For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అసలు దేవునికి పూలని ఎందుకు సమర్పించాలో తెలుసా?

  |

  ప్రకృతి అందం అంటే మొదటగా గుర్తొచ్చేది పూలే. అంతగా రంగు రంగుల పూలతో అలంకరించుకుని ప్రకృతి అందంగా ముస్తాబవుతుంది. తద్వారా రోజూ వారీ దైనందిక వ్యవహారాలలో భాగంగా పూలను జతచేయడం, పూలను తమ పరిసరాల్లో భాగంగా భావించడం మానవుని విధిగా మారింది. భారతీయ స్త్రీల అలంకరణలో భాగంగా పూలకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలియనిది కాదు. క్రమంగా పెళ్ళిళ్ళలోనూ, ఇంటిని అలంకరించుటలో, పెళ్ళికూతురుని అలంకరించడంలో, పండుగలలో, పూజా వ్యవహారాలలో, చివరికి మరణంలో భాగంగా కూడా, అనేక విధాలుగా పూలను వినియోగిస్తారు. కావున దైవ ప్రార్ధనకు పూలను వినియోగించడంలో ఆశ్చర్యమే లేదు.

  కొందరు కేవలం పూల మీద మక్కువతో గృహాలలో ప్రత్యేకంగా తోటలను సిద్దం చేయడం, లేదా పూల కుండీలలో ప్రత్యేకంగా పెంచడం వంటివి చేస్తుంటారు కూడా. ప్రతి 10 కుటుంబాలలో 5 కుటుంబాలు పూల మొక్కలను కలిగి ఉంటాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. అంతగా పూలు దైనందిక వ్యవహారాలలో భాగంగా మారిపోయాయి. ప్రకృతి ప్రేమికునికి ఒక స్నేహితుడిలా పూలు ఉంటాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. కొందరు కేవలం పూల మీద మక్కువతో, తమ వ్యాపారాలను కూడా మొక్కలకే కేటాయించే పనులకు పూనుకుంటూ ఉంటారు.

  Why do we offer flowers to Gods?

  కృష్ణుడు చెప్పిన ప్రకారం , ఒక్క చుక్క నీరైనా, దర్భలైనా, సువాసనలు కలిగించే పూలైనా నాకు సమర్పించి, నా కృపకు పాత్రులవగలరు అని తెలిపాడు. భక్తితో సమర్పించిన తులసి ఆకు సైతం కృష్ణుని భారాన్ని మోయగలిగింది అంటేనే అర్ధమవుతుంది, భక్తితో సమర్పించేది ఎంత చిన్నదైనా దేవుని కృపను ఫలితంగా అందివ్వగలదు అని. అనేక రకాల నైవేద్యాలు పెట్టకపోయినా, అగర్బత్తీ సువాసనల మద్య దేవుని ఉంచకపోయినా , ఖరీదైన ఖనిజాలతో విగ్రహాలు చేయించకపోయినా, ధూప దీప నైవేధ్యాలలో ముంచకపోయినా కూడా పర్లేదు కానీ, పూలతో అలంకరణ లేకుండా పూజ ముగించడం అంటే అది జరగని పనే అవుతుంది. ప్రతి రోజూ ఒక్క పువ్వునైనా దేవుని సమర్పించడం ద్వారా అనేక పూజలు చేసిన ఫలితాన్ని పొందవచ్చు అని భక్తుల విశ్వాసం.

  ఈరోజు ఇక్కడ అసలు పూలను ఎందుకు దేవునికి విధిగా సమర్పిస్తాము అన్న విషయం గురించి తెలుసుకుందాం. మరియు దేవునికి పూలను సమర్పించడానికి సరైన మార్గాలను గురించి కూడా తెలుసుకుందాం.

   ఈ ప్రకృతిలో అత్యంత అందమైన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి పూలే , తర్వాతే ఏమైనా:

  ఈ ప్రకృతిలో అత్యంత అందమైన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి పూలే , తర్వాతే ఏమైనా:

  నిజమే కదా, ఎటువంటి ఆలోచనా లేకుండా చెప్పవచ్చు. గడ్డి పువ్వులో కూడా అందం దాగి ఉంటుందని. పూలను దేవుని సమర్పించడం ద్వారా, ఈ ప్రకృతిలోనే అందమైన విషయాన్ని దేవునికి సమర్పించిన భావన కలుగుతుంది. పూలను సమర్పించే విధానం అనుసరించి, భక్తుడు ఎంత భక్తి ప్రపత్తులను, నియమ నిష్ఠలని కలిగి ఉన్నాడో అన్నది తెలుస్తుంది.

  దేవునికి పూలను సమర్పించడం ద్వారా అనేక లాభాలను పొందవచ్చు :

  దేవునికి పూలను సమర్పించడం ద్వారా అనేక లాభాలను పొందవచ్చు :

  నియమ నిష్టలతో దేవునికి ప్రేమగా పూలను సమర్పించిన భక్తుని పట్ల దేవుని కృప ఎన్నడూ ఉంటుంది, తద్వారా ఆర్ధిక సమస్యలు లేకుండా, మానసికంగా, శారీరికంగా , స్నేహితుల మరియు కుటుంబ సంబంధాల పరంగా సమస్యలను దూరం చేసి , క్రమంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ఆశీర్వదిస్తాడని భక్తుల ప్రఘాడ విశ్వాసం.

  పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా, సానుకూల ఫలితాలకు మార్గాన్ని సుగం చేస్తాయి:

  పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా, సానుకూల ఫలితాలకు మార్గాన్ని సుగం చేస్తాయి:

  పూలలో అంతర్లీన అందం, ఆకర్షణ దాగి ఉంటుంది, మరియు వాటి సువాసన పూజలో ఒకరకమైన సానుకూల దృక్పధాలను కలిగేలా చూస్తుంది. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరి, ఏకాగ్రత పెరగడానికి కారణమవుతుంది. ద్యానం, మంత్రోచ్చాణలు తోడైతే పూజా ఫలం మరింత ఎక్కువగా ఉంటుంది.

  పూజ అనే పదంలో కూడా పూల గురించిన ప్రస్తావన ఉంది :

  పూజ అనే పదంలో కూడా పూల గురించిన ప్రస్తావన ఉంది :

  పూజ అనే పదంలో మొదటి అక్షరం పుష్పాన్ని సూచిస్తే, రెండవ అక్షరం జపాన్ని సూచిస్తుంది. అనగా పుష్ప జపం అని అర్ధం వచ్చేలా. జపం అనగా ఇష్ట దేవుని ఇతర పేర్లతో స్మరించడం. మరియు “ జ ” అనే అక్షరం జలాన్ని కూడా సూచిస్తుంది.

  దేవునికి పూలను ఎందుకు సమర్పించాలి ?

  దేవునికి పూలను ఎందుకు సమర్పించాలి ?

  నిజానికి దేవునికి ఆలోచనలతో సంబంధమే లేకుండా పూలను సమర్పించడం జరుగుతుంది. నిజానికి పెద్ద విషయం కాకపోయినా, మీ ఇష్టదైవానికి సంబంధించి మాత్రం కొన్ని విధివిధానాలు పాటించడం మంచిది.

  ముళ్ళు కలిగిన లేదా అసంబద్దమైన పూలను దేవునికి సమర్పించకూడదు.

  ముళ్ళు కలిగిన లేదా అసంబద్దమైన పూలను దేవునికి సమర్పించకూడదు.

  కొన్ని పురాణాల, దేవుని కథలు, వ్రత విధానాల ప్రకారం కొన్ని పూలు పూజకు పనికి రావు అని తెలుపబడినది. అవి ఏమిటో పెద్దలను కనుగొని, తద్వారా పూజకు ఉపక్రమించడం అన్ని విధాలా మంచిదిగా సూచించబడినది.

  ప్రతి దేవుడు లేదా దేవత తమకంటూ ఇష్టమైన పూలను కలిగి ఉంటారు.

  ప్రతి దేవుడు లేదా దేవత తమకంటూ ఇష్టమైన పూలను కలిగి ఉంటారు.

  ప్రతి దేవుడు లేదా దేవత తమకంటూ ఇష్టమైన పూలను కలిగి ఉంటారు. అవి ఏమిటో తెల్సుకుని తద్వారా పూజకు ఉపక్రమించడం మంచిది. ఉదాహరణకు సరస్వతీ దేవికి తామర పువ్వులా.

  మంచి సువాసనలు కలిగిన పూలను

  మంచి సువాసనలు కలిగిన పూలను

  మంచి సువాసనలు కలిగిన పూలను దేవునికి సమర్పించడంలో జాగ్రత్తను తీసుకోవాలి. తద్వారా తాజా పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది. పెద్దల సూచనల ప్రకారం క్రింద పడిన పూలను సమర్పించడం చేయరాదు.

  శుభ్రంగా ఉన్న పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది

  శుభ్రంగా ఉన్న పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది

  ఎటువంటి కళంకం లేని అందమైన, శుభ్రంగా ఉన్న పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది. కొందరు ఒక పళ్ళెంలో నీటిని తీసుకుని అందులో పూలను ఉంచి, సున్నితంగా శుభ్రపరచిన తర్వాతే దేవుని సమర్పించే అలవాట్లు కలిగి ఉంటారు.

  ఇళ్ళలో ప్రత్యేకంగా మీరే పెంచిన పూల మొక్కలనుండి సేకరించిన పూలను

  ఇళ్ళలో ప్రత్యేకంగా మీరే పెంచిన పూల మొక్కలనుండి సేకరించిన పూలను

  వీలయితే, ప్రత్యేకమైన, శుభ్రంగా ఉన్న ప్రదేశాలలో పెంచిన పూల మొక్కల నుండి పూలు తీసుకోవడం శ్రేయస్కరం. ఇంకా వీలయితే ఇళ్ళలో ప్రత్యేకంగా మీరే పెంచిన పూల మొక్కలనుండి సేకరించిన పూలను పూజకు వాడడం అన్ని విధాలా మంచిది.

  మంత్రోచ్చారణ సమయంలో పూలను పద్దతిగా దేవుని పాదాల కడ విడువడం

  మంత్రోచ్చారణ సమయంలో పూలను పద్దతిగా దేవుని పాదాల కడ విడువడం

  పూలను మాలధారణ, లేదా ప్రతిమకు కాని విగ్రహానికి కాని పూలను అలంకరించడమే కాకుండా మంత్రోచ్చారణ సమయంలో పూలను పద్దతిగా దేవుని పాదాల కడ విడువడం ద్వారా కూడా దేవుని కృపకు పాత్రులవగలరు.

  English summary

  Why do we offer flowers to Gods?

  One of the most important things that are required to pray to the lord is flowers. Any puja is incomplete without offering flowers to the Lord. Lord Krishna has said, "Even a drop of water, a blade of grass or a fragrant flower offered to me with devotion will please me". Even the simplest of poojas will include some flowers that are offered to the favourite deity.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more