For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినాయకుడి వివాహం ఎవరితో జరిగింది? తనకు ఎందరు భార్యలంటే..?

వినాయకునికి ఇద్దరు భార్యలు రిద్ధి మరియు సిద్ధి ఎందుకు ఉన్నారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన భారతదేశంలోని సంప్రదాయాల ప్రకారం, ఏదైనా కొత్త పనిని లేదా శుభకార్యాన్ని ప్రారంభించడానికి ముందు కచ్చితంగా తొలి పూజను గణపతి దేవునికి చేస్తారు.

Why Does Lord Ganesha Have Two Wives Named Riddhi And Siddhi?

వివాహం, కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సైతం వినాయకుడికే తొలి స్థానం ఉంది. పురాణాల ప్రకారం, గణేశుడు పార్వతీ, పరమేశ్వరుల పుత్రుడని మనందరికీ తెలిసిందే. అయితే వినాయకుడు బ్రహ్మచారి అని.. తనకు పెళ్లి జరగలేదని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

Why Does Lord Ganesha Have Two Wives Named Riddhi And Siddhi?

ఎందుకంటే వినాయకుడు బ్రహ్మాచారిగా ఉండాలని కోరుకున్నాడట. కానీ వినాయకుడికి ఒకరితో కాదు ఏకంగా ఇద్దరు మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. దైవిక యోగం ద్వారా ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వారి పేర్లే రిద్ధి మరియు సిద్ధి. ఈ సందర్భంగా వీరిద్దరూ వినాయకుడిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు.. అందుకు గల కారణాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

First Solar Eclipse of 2022:తొలి సూర్య గ్రహణం వేళ.. ఈ 5 రాశులకు ఇబ్బందులు... తస్మాత్ జాగ్రత్త...!First Solar Eclipse of 2022:తొలి సూర్య గ్రహణం వేళ.. ఈ 5 రాశులకు ఇబ్బందులు... తస్మాత్ జాగ్రత్త...!

తులసి ఆకర్షణ..

తులసి ఆకర్షణ..

పురాణాల ప్రకారం, వినాయకుడు ఓ ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న తులసి గణేశుడిని చూసి ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు వినాయకుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ ఆమె బ్రహ్మచారి అని చెప్పి వినాయకుడు తన వివాహ ప్రతిపాదన తిరస్కరించాడు.

తులసిని ఉపయోగించరు..

తులసిని ఉపయోగించరు..

తనతో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన వినాయకుడిపై తులసి కోపంతో తనకు శాపం విధించింది. గణేశుడిని ఒకటి కాదు ఏకంగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని శపించింది. మరోవైపు వినాయకుడు కూడా తులసికి అసురుడితో వివాహం జరుగుతుందని శపించాడు. అందుకే వినాయకుని పూజలో తులసిని వాడకూడదని పండితులు చెబుతారు.

బ్రహ్మచార్యం ప్రారంభం..

బ్రహ్మచార్యం ప్రారంభం..

మరో కథనం ప్రకారం, వినాయకుడు తన రూపం, ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చింది. తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో కలత చెందిన వినాయకుడు బ్రహ్మచార్యం పాటించడం ప్రారంభించాడు. దీంతో కోపోద్రిక్తుడైన గణేశుడు పెళ్లి జరగకుండా ఇబ్బందులను కలుగ జేసేవాడు.

మూషికం మద్దతు..

మూషికం మద్దతు..

వినాయకుడు తనకు పెళ్లి జరగకపోతే.. ఇంకా ఎవరికీ వివాహం జరగకూడదని భావించాడు. ఇందుకు వినాయకుడికి మూషిక మద్దతు కూడా లభించింది. అయితే వినాయకుడి ఈ అలవాటు వల్ల దేవతలందరూ కలత చెందారు. తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మ యోగం నుండి ఇద్దరు కుమార్తెలు రిద్ది మరియు సిద్ధి కనిపించారు. వారిద్దరూ బ్రహ్మదేవుని మానస పుత్రికలు.

వినాయకుని బోధనలు..

వినాయకుని బోధనలు..

దేవతల కష్టాలు తీర్చేందుకు తన కుమార్తెలను వినాయకుడి వద్దకు బోధనల కోసం పంపారు. బ్రహ్మదేవుని ఆదేశాల మేరకు గణేశుడు వారికి బోధనలు ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గర పెళ్లికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు, వారిద్దరూ తన ద్రుష్టిని మరల్చేవారు. ఇలా అందరూ క్రమంగా పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు.

వినాయకుడి వివాహం..

వినాయకుడి వివాహం..

ఒకరోజు అందరూ వివాహం చేసుకున్నారని, చేసుకుంటున్నారని వినాయకుడికి తెలిసిపోతుంది. దీంతో గణపతి సిద్ధి, రిద్దిపై కోపంతో శపించడం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి తనను అడ్డుకుంటాడు. అదే సమయంలో వారిద్దరినీ వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు. ఆ తర్వాత వీరిద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. వీరి పేర్లు శుభ్ మరియు లభ్.

FAQ's
  • వినాయకునికి ఎంతమంది భార్యలు ఉన్నారు?

    ఒకరోజు అందరూ వివాహం చేసుకున్నారని, చేసుకుంటున్నారని వినాయకుడికి తెలిసిపోతుంది. దీంతో గణపతి సిద్ధి, రిద్దిపై కోపంతో శపించడం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి తనను అడ్డుకుంటాడు. అదే సమయంలో వారిద్దరినీ వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు. ఆ తర్వాత వీరిద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. వీరి పేర్లు శుభ్ మరియు లభ్.

English summary

Why Does Lord Ganesha Have Two Wives Named Riddhi And Siddhi?

Here we are talking about the why does lord ganesha have two wives named riddhi and siddhi? Read on
Story first published:Wednesday, April 20, 2022, 15:54 [IST]
Desktop Bottom Promotion