For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాలారోజులు అలానే ఉంచినా గంగానది నీళ్ళు ఎందుకు పాడవవు?

|

మనం బయటనుంచి, వ్యాయామం చేసో లేదా ఉద్యోగానికి వెళ్ళొచ్చో వచ్చినపుడు ఒక నీళ్ళబాటిల్ కన్పిస్తుంది, దాన్ని తీసుకుని వెంటనే తాగేస్తాం, కానీ అందులో నీరు రుచి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇలా జరగటం సాధారణమే. కానీ దానికి అసలు కారణం మనం ఎప్పుడూ తెలుసుకోం, తెలుసుకున్నా పట్టించుకోం. మున్సిపల్ పంపునుంచి వచ్చే నీటికి ఎక్స్పైరీ తేదీ ఉందో లేదో ఆలోచించము.

నిజానికి నీరు ఎక్స్పైర్ అవదు, దుమ్ముధూళి,బ్యాక్టీరియా లేదా పెరగటానికి ఆక్సిజన్ అవసరం లేని ఆల్గేతో కలుషితం మాత్రం అవుతుంది.

Why does the river ganga water not spoil even if kept for long time ?

కానీ ఎప్పుడన్నా ఆలోచించారా గంగానది కలుషితం అయినా కూడా, దాన్ని ప్రభుత్వం శుభ్రం చేసే ప్రాజెక్టులు టివీలో మనకి కన్పిస్తూనే ఉన్నా, మీకు తెలుసా గంగానది నీరు ఎన్నటికీ అపవిత్రం కాలేదని?

“ఈ బరువు తగ్గే చిట్కా నా జీవితాన్ని మార్చేసింది,”అంటున్న అనాయా

Why does the river ganga water not spoil even if kept for long time ?

మీరు ఎప్పుడన్నా పర్వతాల వైపుకి వెళ్ళిఉంటే ,గంగానది గంగోత్రిలోని ఖత్లింగ్ మరియు సతోపంత్ గ్లేసియర్ ల నుంచి కరిగిన మంచు నుంచి పుట్టినదని తెలుస్తుంది. ఈ నీరు కేదార్ నాథ్, నందాదేవి మరియు ఇతరపర్వతాల నుంచి వచ్చిన నీరుతో కలుస్తుంది. ఈ గ్లేసియర్ల చుట్టూ పెరిగే అనేక మొక్కల జాతులకి ఆరోగ్యవిలువలుండి బ్యాక్టీరియా, ఇతర కలుషితాలను చంపేస్తాయి. అందుకే ఈ నీరు చాలాకాలం పాటు తాజాగా ఉంటుంది.
Why does the river ganga water not spoil even if kept for long time ?

మరొక కారణం శాస్త్రీయమైన కారణంగా చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ గంగానదిలో ఉంటుంది, ఇది గంగానదిలోకి వచ్చే ఇతర హానికర బ్యాక్టీరియాలను చంపేస్తుంది.

మరొక వివరణ ఏంటంటే హిమాలయాలలో గంగ్నాని నుంచి గంగోత్రి వరకూ ప్రవహించేటప్పుడు, గంగానదిలోకి వేడినీటి బుగ్గలనుంచి వస్తున్న జలపాతాలు వచ్చి కలుస్తాయి, అందులోని సల్ఫర్ గంగానదిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది.

ఈ శాస్త్రీయ వివరణలు చాలానే ఉండొచ్చు,కానీ గంగానది పవిత్రతపై మాత్రం సందేహం ఎన్నటికీ ఉండబోదు.

English summary

Why does the river ganga water not spoil even if kept for long time ?

When we come from outdoors from a strenuous day workout or from work and we find that bottle of water lying in and around the corner of our room, we grab it and drink the water from it, only to find out that the water in it tastes awful. Well, it happens with us all. We haven’t ever known the cause of that, neither we cared about whether water from the municipal corporation tap has an expiry date.
Desktop Bottom Promotion