For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గాదేవిని మహిషాసురమర్దినిగా ఎందుకు పిలుస్తారో తెలుసా..

|

మహిషాసురుడు అనే భయంకరమైన రాక్షసుడిని అమ్మల గన్న అమ్మ దుర్గమ్మ ఎందుకు వధించింది. అప్పటి నుండి మహిషాసుర మర్దిని దేవిగా ఎందుకు పూజలంటుకుంది. మహిషఘ్నీ పూజ అంటే ఏమిటి? ఆ పూజను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకునేందుకు ఆ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.

1) మహిషఘ్నీ అంటే..

1) మహిషఘ్నీ అంటే..

పురాణాల ప్రకారం మహిషాసురుడిని అంతం చేసిన దేవి కాబట్టి మహిషఘ్నీ అనే పేరు వచ్చింది. మహిషాసురుడిని వధించిన నాటి నుండి అమ్మవారు మహిషాసుర మర్దిని దేవిగా చాలా ప్రాంతాల్లో పూజలు అందుకుంటుంది. అందుకే దీనిని మహిషఘ్నీ పూజ అని కూడా అంటారు. ఇక మహిషాసురుని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

2) రాక్షసుల రాజు..

2) రాక్షసుల రాజు..

రాక్షసుల రాజు అయిన రంభాసురుని కుమారుడు మహిషాసురుడు. రంభాసురుడు కామ వాంఛతో దున్నపోతు రూపంలో తిరుగుతూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక అందమైన ఆడదున్న రూపానికి ముగ్ధుడు అయిపోతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వారికి సగం మనిషి, సగం దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు జన్మించాడు. సాధారణంగా అసురులకు, దేవతలకు మధ్య వైరం ఎప్పటి నుంచో ఉండేది. చాలా మంది అసురులు వర బల గర్వంత స్వర్గాన్ని జయించడం తర్వాత విష్ణువు, శివుడు వేర్వేరు అవతారాలు ధరించి వారిని నిర్జించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మహిషాసురుడు కూడా దేవతలను నాశనం చేయాలని భావించాడు.

3) మరణం లేని వరం..

3) మరణం లేని వరం..

అందుకోసం పక్కా ప్రణాళిక రచిస్తాడు. బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. అందరూ రాక్షసుల మాదిరిగానే చావు లేకుండా వరం ఇవ్వాలని కోరతాడు. అది కుదరదని బ్రహ్మ చెప్పడంతో మహిళలు అబలలు కనుక వారు తనను ఎలాను సంహరించలేరు కనుక వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరం ఇవ్వాలని కోరాడు. అందుకు బ్రహ్మ అంగీకరించి వరమిస్తాడు. దీంతో మహిషాసురుడు ఆ వరం ఉందనే గర్వంతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటాడు. తనను ఓడించే మహిళ ఉండదని విర్రవీగుతూ దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడించాడు. దీంతో దేవతలు తమను రక్షించమని త్రిమూర్తలును వేడుకుంటారు. అప్పుడు వారు తమ ముగ్గురి శక్తులు కలబోసి ఒక మహిళను సృష్టించారు. ఆమె ఎవరో కాదు దుర్గాదేవి. అలా దుర్గాదేవి రూపంలో అవతరించి మహిషాసురుడిని వధించిన ఆ మాత మహిషాసురమర్దినిగా మారింది. దుర్గాదేవి మహిషాసురుడిని వధించే విగ్రహాలు మన దేశంలో చాలా చోట్ల మనకు కనిపిస్తారు. వీటిలో మహాబలిపురం, ఎల్లోరా గుహలు, హలిబెడులోని హోయసాలేశ్వర ఆలయం ద్వారం వద్ద ఉన్నవి ప్రసిద్ధి చెందిన శిల్పాల్లో కొన్ని. ఇంకా చాలా ఆలయాల్లోనే ఇలాటి శిల్పాలు మనకు కనిపిస్తాయి.

4) బౌద్ధ శిల్ప కళలోనూ..

4) బౌద్ధ శిల్ప కళలోనూ..

మహిషాసుర మర్దిని గురించి హిందూ మతంలో ప్రముఖంగానే ఉన్నప్పటికీ అది బౌద్ధ శిల్ప కళలో కూడా విస్తారంగా కనిపించడం విశేషంగా చెప్పొచ్చు. హిమాచల్ ప్రదేశ్ లోని చాంబాలో గల లక్షణా దేవి ఆలయంలో ఈ శిల్పాలు మనకు కనిపిస్తాయి. హట్ కోటిలో వాజేశ్వరీ దేవి చేతిలో ఒక రాక్షసుడు హతమవుతున్నట్లు శిల్పాలు ఉన్నాయి. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఆప్ఘనిస్థాన్ లోని గజ్ని సమీపంలో ఉన్న తప సర్ధార్ లోని పరిరక్షణాలయంలో ఉన్న శిల్పాలలోనూ, మధ్య టిబెట్ లోని కొన్నిచోట్ల దుర్గాదేవి, మహిషాసురుడిని హతం చేస్తున్న శిల్పాలు ఉన్నాయి. అంతే కాదు జైన మతంలో కూడా దుర్గాదేవి, మహిాషాసురుల ప్రస్తావన కనబడటం మరింత విశేషం. జోధ్ పూర్ మ్యూజియంలోనూ, జునాగఢ్ లోని సచికా దేవి ఆలయాల్లోనూ, దేవగఢ్లోని సిద్ధ్ కి గుఫాలోనూ అమ్మవారికి సంబంధించిన, దుర్గాదేవి, మహిషాసురుల మధ్య యుద్ధం వంటి శిల్పాలు కూడా కనిపిస్తాయి.

5) దుర్గాష్టమి రోజున..

5) దుర్గాష్టమి రోజున..

మన తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగకు ముందు దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని మహిషాసురుమర్దిని దేవి రూపంలో పూజిస్తారు. అదే పశ్చిమ బెంగాల్ లో అయితే మహిషాసురుడిని చంపుతున్న దుర్గాదేవి విగ్రహాలకు పూజ చేస్తారు. కర్నాటకలో అయితే ఆ పేరు మహిషాసురమర్దిని నుంచే వచ్చిందని చెబుతారు. శరణు వేడారని, వారిని అసురుణ్ణి దేవి వధించిందని చెబుతారు. మైసూరుకు సమీపంలోని చాముండీ హిల్స్ ప్రాంతంలో తొమ్మిది రోజుల యుద్ధం అనంతరం మహిషాసురుడు నిహతుడయ్యాడని అక్కడి పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ పండుగకు మైసూరు దసరా అనే పేరు కూడా ఉంది. దసరా పండుగను కన్నడలో నడ హబ్బా అంటారు. అంటే రాష్ట్ర పండగు అని అర్థం.

6) మహిషాసురుడికి విగ్రహం..

6) మహిషాసురుడికి విగ్రహం..

మైసూరు నగర పరిరక్షకురాలైన చాముండీ దేవి ఆలయం వద్ద మహిషాసురునికి పెద్ద విగ్రహం ఉందంట. మైసూరు ప్రస్తావనను పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 245 నాటి నుంచే ఉన్నట్టు భావిస్తారు. ఇది సుమారుగా అశోక చక్రవర్తి కాలం. ఆ కాలంలో బౌద్ధమతం ప్రబలంగా ఉండేది. అప్పుడు జరిగిన మూడవ బౌద్ధ స్నాతకోత్సవం ముగింపు సందర్భంగా ఆయన మహిష మండలానికి ఒక బృందాన్ని పంపారని అక్కడి ప్రజలు పేర్కొంటారు.

మరోవైపు కేరళలో మరో కథ ప్రచారంలో ఉంది. మహిష మండలం అంటే మహిషాసురుడు ఒక ప్రదేశాన్ని ఆక్రమించడం. మహిషాసురుడికి మహిషి అనే సోదరి ఉందని, మహిషాసురుడు చనిపోయాక ఆమె దేవతలతో తన యుద్ధం కొనసాగించేదని ఆ కథలో పేర్కొనబడింది.

English summary

Shubho Mahalaya 2019: The Legend Of Mahishasura And Why Goddess Durga Is Called Mahishasuramardini

Mahishasura is the son of Rambhasura, the king of demons. Rambhasura is lustfully wandering in the form of blanket. One day, one is impressed by the beautiful look. He marries her. To them was born a half-man, half-bodied Mahishasura. In general, there has always been animosity between the Asuras and the Gods. Vishnu and Lord Shiva are wearing different incarnations after the Asuras have conquered heaven.
Story first published: Wednesday, September 18, 2019, 17:32 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more