Latest Updates
-
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.!
శనిదేవుడంటే అందరికీ ఎందుకంత భయం,ఎందుకు శనిని దుఃఖానికి, చీకటికి ప్రతీకగా చూస్తారు?
హిందూ పురాణాలలో, కొందరు దేవతలకి భయపడతారు కానీ అందరికంటే ఎక్కువ శనిదేవుడికి ఎక్కువ భయపడతారు.ఆయన దురదృష్టాన్ని, సమస్యలని తెస్తాడని భావిస్తారు. దాన్ని ఒక దురదృష్ట గ్రహంగా, చెడ్డ స్థితిలో ఉన్నప్పుడు మిగతా
హిందూ పురాణాలలో, కొందరు దేవతలకి భయపడతారు కానీ అందరికంటే ఎక్కువ శనిదేవుడికి ఎక్కువ భయపడతారు.
ఆయన దురదృష్టాన్ని, సమస్యలని తెస్తాడని భావిస్తారు. దాన్ని ఒక దురదృష్ట గ్రహంగా, చెడ్డ స్థితిలో ఉన్నప్పుడు మిగతా గ్రహాల మంచి ఫలితాలను కూడా అడ్డుకుంటుంది.

శనేశ్వరుడి మూలాలు
సూర్యుడికి పుట్టిన శని దేవుడికి తన అన్న యముడి కంటే ఎక్కువ భయపడతారు ప్రజలు.ఎందుకంటే యముడు చచ్చిపోయిన వాళ్ళని పాపాల బట్టి శిక్షిస్తే, శనీశ్వరుడు బ్రతికి ఉన్న వాళ్ళని పీడించడంలో పేరు పొందినవాడు.

దురదృష్టానికి దేవుడు
హిందూ పురాణాల ప్రకారం,శనీశ్వరుడు పుట్టినప్పుడు సూర్యుడు గ్రహణంలోకి వెళ్ళాడు.అందుకే శనివారం శుభకార్యలకి మంచిది కాదంటారు.
మందకొడి మరియు అవటివాడైన శని,చిన్నపుడు తన అన్న యముడితో జరిగిన యుద్ధంలో గాయపడ్డాడు.అతను కాకి లేక గ్రద్దచే నడిపే రధం పై విల్లు , బాణాలతో కనిపిస్తాడు.నల్ల రంగు శరీరంతో నల్ల దుస్తులు వేసుకుంటాడు.
శని చంద్రుడికి దగ్గరగా ఉంటే, ఒక వ్యక్తి జాతక చక్రం నుంచి ఏడున్నర ఏళ్ళు ఏలనాటి శని మొదలవుతుంది.వేద జ్యోతిష్యం ప్రకారం, ఒక మనిషి జీవితంలో ఈ కాలం కష్టకాలంగా పేర్కొంటారు.ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు,కష్టాలు,ఎన్నో వైఫల్యాలు, ఆరోగ్య మరియు డబ్బు సంబంధ కష్టాలు ఎదుర్కోవచ్చు.జీవితంతం గుర్తుండిపోయే కాలంగా దీన్ని అనుకుంటారు.

హిందూ పురాణాల ప్రకారం శని, శోకం మరియు బాధలు పెట్టే గ్రహంగా పేరు పొందాడు. కానీ అది పూర్తిగా నిజం కాదు.ప్రజలు తమ కర్మ ఫలాలు అనుభవించడానికి మరియు ధర్మం, న్యాయనికి ప్రతీకగా ఏలనాటి శనిని సృష్టించాడు.
శని దేవుడు పేదరికం, దీర్ఘాయువు, బాధ, ముసలితనం, చావు, పరిమితి, క్రమశిక్షణ, ఆలస్యం, బాధ్యత, అధికారం, వినయం, తెలివి, ఔన్నత్యం మరియు ఆశయానికి సూచిక.ఈ గ్రహం మనుషుల చెడ్డ స్వభావాలని శాసించే చీకటి గ్రహంగా భావించబడుతుంది.

ప్రముఖ నమ్మకాలకి విరుద్ధంగా శని గ్రహమే అన్ని గ్రహాల కంటే తొందరగా ప్రసన్నమవుతాడు.తన స్పష్టమైన కఠిన ప్రవర్తన వలన, తనకి చెడ్డ పేరు వచ్చింది.కానీ అతని ఈ కఠిన ప్రవర్తన వల్లనే, భవిష్యత్తులోని చెడ్డ ప్రవర్తనని నియంత్రిస్తున్నాడు మరియు ప్రజల పాపాల నుంచి విముక్తుల్ని చేస్తున్నాడు.

శని దోషం నుంచి విముక్తికి ఈ క్రింద రాసిన నివారణలు చేయండి
- ఒక పక్షి ని పంజరం నుంచి విడుదల చేయండి.
- ఆవాల నూనె శని దేవుడికి ఇవ్వండి.
- శక్తివంతమైన ఆభరణాలు వేసుకోండి.

- పేదలకు దానాలు ఇవ్వండి.
- రావి చెట్టుని పూజించండి.
- మంచి పనులు చేయండి- ఉత్తమమైనవి.



Click it and Unblock the Notifications
