వృశ్చికరాశిని అన్నిటికన్నా బలమైన రాశిగా మార్చేవేంటి?

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీరెప్పుడైనా వృశ్చికరాశి వారు ఎదురుపడితే, మొదటగా గమనించేది వారి చుట్టూ వారి ముభావత కన్పిస్తుంది. సాధారణంగా వారు చుట్టూ ఉన్నవారిని అంచనావేస్తూ, చాలా తక్కువ సంతోషపడుతుండటం వంటి అనేక లక్షణాలతో ఉంటారు.

వారి మనసులో చోటు సంపాయించాలంటే, ముందు వారు మిమ్మల్ని పూర్తిగా నమ్మాలి. వారికి ఒకసారి నమ్మకం కలిగిందంటే చాలా గాఢంగా నమ్ముతారు,ఇదే వారిని మిగతారాశులనుంచి వేరుచేస్తుంది.

అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ వృశ్చికరాశి మిత్రులలో ఈ లక్షణాలున్నాయో లేదో తెలుసుకోటానికి చదవండి.

మీ భాగస్వామితో మస్తు మజా చేయాలంటే, ఈ ఆహారాల పట్ల జాగ్రత్త సుమా.!

వారు చాలా అంకితభావం కలిగివుంటారు..

వారు చాలా అంకితభావం కలిగివుంటారు..

వృశ్చికరాశి వారు చాలా అంకితభావం కలిగి, ఏదో చేయాలన్న తపనతో రగిలిపోతుంటారు.వారేం పని చేసినా వాటితో మానసికంగా బంధం ఏర్పర్చుకుంటారు. అందుకే వారు ఏం చేసిన అద్భుతాలలాగానే ఉంటాయి.

వారు అస్సలు ఓటమి అంగీకరించరు!

వారు అస్సలు ఓటమి అంగీకరించరు!

పోరాట తత్వంలో వారెక్కడో శిఖరంపై ఉంటారు. ఓటమిని అంగీకరించడం అనే పదం కూడా తెలీదు వారికి. విజయం సాధించటంలో ఆలస్యం,కష్టం ఇవేవి వారికి సంతృప్తినివ్వవు. అందుకని ఏం చేసైనా సరే, వారికి కావాల్సింది వారు సాధించి తీరతారు.

పుట్టుకతోనే స్వతంత్రులు

పుట్టుకతోనే స్వతంత్రులు

ఈ జన్మరాశిని ఒక్క పదంలో వివరించాలంటే,అన్నిటికన్నా మేటిది- వారి స్వతంత్రభావాలు! ఈ రాశివారు చాలా అరుదుగా మరొకరిపై ఏ చిన్నపనికైనా ఆధారపడతారు. పైగా వారికి నచ్చినట్టు వారే మొత్తం పనిచేస్తేనే వారికి నచ్చుతుంది, పనికి తగ్గ ఫలితాన్ని కూడా అంతే మేటిగా ఆశిస్తారు.

అలర్ట్: ఇలాంటి మహిళలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దు..!!

వారు స్వభావసిద్ధంగా నాయకులు

వారు స్వభావసిద్ధంగా నాయకులు

వృశ్చికరాశివారు స్వభావసిద్ధంగా నాయకులు, ఎందుకంటే ఎలాంటి బాధ్యతైనా,ఎలాంటి సమస్యలొచ్చినా వెనకడుగు వేయకుండా అన్నిటికీ ముందుంటారు. రాబోయే కష్టాలను నిలబడి ధైర్యంగా ఎదుర్కొంటారు కాబట్టి వారిది చాలా బలమైన రాశి కూడా అయింది.

 వారు ప్రాణస్నేహితులు!

వారు ప్రాణస్నేహితులు!

ఈ రాశివారు చాలా నమ్మకస్తులు ముఖ్యంగా స్నేహితుల విషయంలో. వృశ్చికరాశి వారితో స్నేహంపై ఎలాంటి అనుమానం అక్కరలేదు. ఏ సమయంలోనైనా, ఎలాంటి స్థితిలోనైనా వారు మీకోసం సిద్ధంగా ఉంటారు. కానీ వారి వద్ద నుంచి ఆ నమ్మకం, స్నేహం పొందటానికి వారితో ముందు చాలా మంచి సమయం గడపాలి.

పడకగదిలో కూడా రారాజులే!

పడకగదిలో కూడా రారాజులే!

వృశ్చికరాశి వారితో సెక్స్ అద్భుతమైన అనుభవంగా మిగిలిపోతుంది. ఎందుకంటే వారు దీన్ని జీవితాన్ని,తమ భావాలను అర్థం చేసుకునే ఒక మార్గంగా భావిస్తారు.ఈ గుణమే మిగతా అన్నిరాశుల కన్నా వీరిని సెక్స్ లో ఎంతో మెరుగైనవారిగా చేస్తుంది.

వారి చాతుర్యం!

వారి చాతుర్యం!

వృశ్చికరాశివారికి చాలా సహజంగా, స్వభావసిద్ధంగా హాస్యచతురత ఎక్కువ ఉంటుంది. ఇందుకే వారి సమక్షంలో ఎవరూ బోర్ ఫీలవరు, పైగా వారిని వదిలి వెళ్ళలేరు కూడా.

వారి అంచనాశక్తి అమోఘం!

వారి అంచనాశక్తి అమోఘం!

ఇదే వారు జీవితంలో విజయవంతం కావటానికి ముఖ్యకారణం. వారి అంచనాలు చాలా శక్తివంతంగా, సరిగ్గా ఉంటాయి. దాదాపుగా అన్ని అంచనాలు సరిగానే అవటంతో, వారు సులభంగా ఓడిపోరు.

అయితే మీకెంతో ఇష్టమైనవారిలో ఎన్ని గుణాలు పైవాటితో సరిపోయాయి? మీ ఆలోచనలను కామెంట్ సెక్షన్ లో కింద మాతో పంచుకోండి.

English summary

Why Is Scorpio Considered The Most Powerful Zodiac Sign?

Why Is Scorpio Considered The Most Powerful Zodiac Sign? ,No wonder this star sign rules the world…
Story first published: Saturday, October 28, 2017, 18:30 [IST]
Subscribe Newsletter