For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీకృష్ణుడు అఘాసురుడుని ఎందుకు చంపుతాడు? అందగాడైన అఘాసురుడు కొండ చిలువలా ఎందుకు మారాడు

దీంతో కృష్ణుడితో పాటు అతని స్నేహితులు గోవులను తోలుకుని గుహమాదిరిగా కనిపించిన అఘాసురుడి నోట్లోకి వెళ్లిపోయారు. నోటిని గట్టిగా మూసేశాడువారంతా తన నోట్లోకి రాగానే నోటిని గట్టిగా మూసేశాడు అఘాసురుడు.

|

అఘాసురుడు అనే రాక్షసుడికి పురాణాల్లో ఒక ప్రత్యేకత ఉంది. బకాసురుడికి ఇతను సోదరుడు. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు తన స్నేహితులతో కలిసి యమునా నది తీరాన ఆడుకుంటూ ఉండేవారు.

అయితే శ్రీకృష్ణుడిని చంపాలని భావించిన అఘాసురుడు కొండ చిలువ మాదిరిగా అక్కడకి వెళ్లాడు.
తన నోటిన పెద్దగా తెరిచి కృష్ణుడిని మింగడానికి ప్రయత్నించాడు.

నోరి తెరిచినట్లు తెలియక

నోరి తెరిచినట్లు తెలియక

అఘాసురుడు తన నోరును తెరుచుకుని ఉన్నట్లు కృష్ణుడితో పాటు అతని స్నేహితులు గమనించలేకపోయారు. భూమి నుంచి మేఘాలను తాకేటట్లుగా తన నోరు తెరిచాడు అఘాసురుడు.

గోవులను తోలుకుని

గోవులను తోలుకుని

దీంతో కృష్ణుడితో పాటు అతని స్నేహితులు గోవులను తోలుకుని గుహమాదిరిగా కనిపించిన అఘాసురుడి నోట్లోకి వెళ్లిపోయారు.

నోటిని గట్టిగా మూసేశాడు

నోటిని గట్టిగా మూసేశాడు

వారంతా తన నోట్లోకి రాగానే నోటిని గట్టిగా మూసేశాడు

అఘాసురుడు. అయితే కొండచిలువలో శరీరంలో ఉండే విష ప్రభావానికి క్రిష్ణుడి స్నేహితులతో పాటు గోవులు మూర్చపోయాయి.

ఉపాయం ఆలోచించాడు

ఉపాయం ఆలోచించాడు

దీంతో కృష్ణుడు ఎలా అయినా ఇక్కడి నుంచి తాను, తన మిత్రులంతా తప్పించుకోవాలనుకున్నాడు. వెంటనే ఒక ఉపాయం ఆలోచించాడు. అఘాసురుడి నవరంధ్రాలను మూసివేయాలనుకున్నాడు.

Most Read :ధనుస్సు రాశి అమ్మాయి గుణగణాలు, భాగస్వామి తో ఎలా ఉంటుందంటే, ఆ విషయంలో కాస్త స్పీడ్Most Read :ధనుస్సు రాశి అమ్మాయి గుణగణాలు, భాగస్వామి తో ఎలా ఉంటుందంటే, ఆ విషయంలో కాస్త స్పీడ్

పొట్ట మొత్తం ఉబ్బిపోయింది

పొట్ట మొత్తం ఉబ్బిపోయింది

వెంటనే ఆ రంధ్రాలన్నీ మూసి వేయడంతో అఘాసురుడి పొట్ట మొత్తం ఉబ్బిపోయింది. దీంతో కడుపు ఉబ్బి అఘాసురుడు మరణించగానే కడుపు చీల్చుకుని బయటకు వచ్చారు కృష్ణుడు, అతని స్నేహితులు, ఆవులు.

శాప విముక్తి

శాప విముక్తి

అయితే కృష్ణుడు చంపగానే అఘాసురుడు శాప విముక్తి పొందుతాడు. దీని వెనకాల ఒక కథ ఉంది. అఘాసురుడు శంఖుడి కొడుకు. బాగా అందంగా ఉంటాడు. బలమైన వ్యక్తి.

ఇన్ని వంకర్లు ఉంది

ఇన్ని వంకర్లు ఉంది

తన మాదిరిగా ఎవరు లేరన్నట్లుగా విర్రవీగుతుంటాడు.

అయితే ఒకసారి అష్టా వక్రుడు అనే మహర్షిని చూసి నవ్వుతాడు అఘాసురుడు. నువ్వు మహర్షివా మరి నీ మూతి, నీ శరీరం ఏందీ ఇన్ని వంకర్లు ఉంది అని నవ్వుతాడు.

అఘాసురుడుని శపిస్తాడు

అఘాసురుడుని శపిస్తాడు

దీంతో అష్టా వక్రుడు అఘాసురుడుని శపిస్తాడు. నువ్వు పరులను నిందించావు కాబట్టి నీ శిక్ష అనుభవించాలని అంటాడు. నువ్వు కొండచిలువ మాదిరిగా మారుతావు అంటాడు. దీంతో అఘాసురుడు పశ్చాత్తాపపడతాడు.

Most Read :మూడు జన్మల్లో విష్ణుమూర్తికి బద్ద శత్రువులుగా పుట్టిన వారు ఆయన కాపలావారే, జయవిజయల కథMost Read :మూడు జన్మల్లో విష్ణుమూర్తికి బద్ద శత్రువులుగా పుట్టిన వారు ఆయన కాపలావారే, జయవిజయల కథ

శాప విముక్తి

శాప విముక్తి

అయితే చివరకు కృష్ణుడి చేతిలో మరణించి మళ్లీ శాప విముక్తి పొందుతావు అంటాడు. అలా అఘాసురుడు చివరకు శ్రీకృష్ణుని చనిపోయి శాప విముక్తి పొందుతాడు.

English summary

Why Little Krishna Killed Aghasura

Why Little Krishna Killed Aghasura
Desktop Bottom Promotion