For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీ కృష్ణుడు కంసుడిని ఎందుకు చంపాడో తెలుసా? సుదర్శన చక్రం కాశీని నామరూపాలు లేకుండా చేసింది

|

ఈ కథ నేరుగా ద్వాపర యుగానికి వెళ్తుంది. మఘద సామ్రాజ్యానికి రాజు జరాసాంధుడు, ఒక నిరంకుశత్వ పాలకునిగా గుర్తింపు పొందిన ఇతనికి,. ఇద్దరు కుమార్తెలు. వారి పేర్లు వరుసగా అస్తి మరియు ప్రస్తి.

తన కుమార్తెలనిద్దరినీ, మధుర రాజ్యానికి రాజైన కంసునికిచ్చి వివాహం చేశాడు. కంసుడు, శ్రీ కృష్ణునికి వరుసకు మేనమామ అవుతాడు. కంసుడు కూడా ఒక నియంత పాలనను అనుసరించేవాడు. అతని పాలనలో ప్రజలు అనేక కష్టాలను అనుభవించేవారు., శ్రీకృష్ణుడు కంసవధ గావించేవరకు.

జరాసంధుడు కంసుని మరణానికి శ్రీ కృష్ణ పరమాత్మునిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆకాంక్షించాడు :

జరాసంధుడు కంసుని మరణానికి శ్రీ కృష్ణ పరమాత్మునిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆకాంక్షించాడు :

మనకు తెలుసు, ధర్మ సంస్థాపనకు, దుష్ట సంహారార్ధం శ్రీ మహా విష్ణువే స్వయంగా కృష్ణావతారం దాల్చాడని, అవునా ? ఆ క్రమంలో భాగంగానే నియంత పాలనతో అరాచక శక్తులతో ప్రజలను పీడిస్తున్న, రాక్షసులను సంహరిస్తూ వచ్చాడు. ఫలితంగా, కంస వధ జరిగింది. కానీ, కంసుడు జరాసంధునికి అల్లుడైన కారణంగా, శ్రీకృష్ణుడి మీద తీవ్రమైన పగను పెంచుకుని, ప్రతీకారం కోసం ఎదురుచూడసాగాడు.

జరాసంధుడు కళింగ రాజు మరియు కాశీరాజులతో చేతులు కలిపాడు :

జరాసంధుడు కళింగ రాజు మరియు కాశీరాజులతో చేతులు కలిపాడు :

కళింగరాజు మరియు కాశీరాజు అని పిలవబడే కళింగ మరియు కాశీ పాలకులతో, జరాసంధుడు చేతులు కలిపి, కృష్ణునికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించారు. అయితే, సహాయక రాజులు ఓడించబడ్డారు, మరియు జరాసంధుడు తన ప్రాణాలను కాపాడుకునే క్రమంలో భాగంగా తప్పించుకున్నాడు. క్రమంగా కాశీరాజు కుమారుడు, కూడా తన తండ్రి కాశీరాజు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడిని ఓడించడానికి అతీంద్రీయ శక్తులు కావాలని తెలుసుకున్న అతను, శివుని గురించి ఘోర తపస్సు చేయనారంభించాడు.

తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు :

తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు :

కొన్ని సంవత్సరముల కఠోర తపస్సు తర్వాత, రాక్షసరాజు కాశీరాజు కుమారుడు శివుని మెప్పించడంలో విజయవంతం అయ్యాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడుగగా, కృష్ణుడి మరణాన్ని కోరికగా అడిగాడు. క్రమంగా శివుడు అతనికి కృష్ణుని సంహరించగలిగే ఒక ఆయుధాన్ని ప్రసాదించాడు. అయినప్పటికీ, పూజారులను, పండితులను గౌరవించే వ్యక్తులపై ఆ ఆయుధం ఉపయోగించరాదని శివుడు సూచించాడు.

పండితులకు అధిక ప్రాధాన్యత

పండితులకు అధిక ప్రాధాన్యత

కానీ శ్రీ కృష్ణ పరమాత్ముడు, తన రాజ్యంలో పండితులకు అధిక ప్రాధాన్యతని ఇచ్చేవానిగా ప్రసిద్ది చెందినవాడు. కావున శివుడు లోకకళ్యాణార్ధం, మర్మం గ్రహించే ఈ నియమం పెట్టినట్లుగా కనిపిస్తుంది. మరియు, ఆలోచన లేని రాక్షస వర్గానికి చెందిన కారణంగా కాశీరాజు కుమారుడు ఆ నియమంలోని మర్మాన్ని గ్రహించలేకపోయాడు.

కృష్ణుడు కాశీ మీద దాడి చేయడం

కృష్ణుడు కాశీ మీద దాడి చేయడం

కాశీరాజు కుమారునికి, శ్రీకృష్ణుడు పూజారులను, పండితులను గౌరవిస్తాడన్న విషయం తెలియదు. క్రమంగా, వాస్తవం తెలుసుకోకుండా, శ్రీ కృష్ణ పరమాత్మునిపై శివుడు ప్రసాదించిన ఆయుధంతో దాడి చేశాడు. అయితే, ఆ ఆయుధం శ్రీ కృష్ణునిపై ఏమాత్రమూ ప్రభావాన్ని చూపలేకపోయింది. తిరిగి అతని చేతికే వచ్చింది. కొపావేశానికి గురైన శ్రీ కృష్ణ పరమాత్ముడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించక తప్పలేదు.

కాశీరాజు కుమారుని సంహరించడమే

కాశీరాజు కుమారుని సంహరించడమే

సుదర్శన చక్రం, కాశీరాజు కుమారుని సంహరించడమే కాకుండా, కాశీని కూడా నామరూపాలు లేకుండా పూర్తిగా నాశనం చేసింది. వార, అసి అనే నదుల ప్రవాహం ఉన్న కారణంగా, ఆ ప్రాంతం మరలా పునరుద్దరింపబడి, క్రమంగా వారణాసిగా మారిందని పురాణం.

బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి

బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Why Lord Krishna Destroyed Kashi

Why Lord Krishna Destroyed Kashi
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more