Latest Updates
-
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
శివాలయాలకు వెళ్లినప్పుడు ముందుగా నవగ్రహ దర్శనమా? శివ దర్శనమా..?
ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహమే ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెబుతున్నాయి.
నవగ్రహాల గురించి తెలుసు కదా. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం 9 గ్రహాలు ఉంటాయి. వీటి స్థితి కారణంగానే వ్యక్తుల జాతకాలు చెబుతారు జ్యోతిష్యులు.
ఈ క్రమంలో ఏవైనా గ్రహ దోషాలు ఉంటే కొందరు పూజలు కూడా చేస్తారు. అయితే ఈ నవగ్రహాలు అనేవి ప్రధానంగా శివాలయాల్లోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి కారణం ఏమిటో తెలుసా..? అదే తెలుసుకుందాం పదండి..!

నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవతలను నియమించింది శివుడే. దీంతోపాటు గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడుకి అధిదేవత కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ వుంటాయి. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి.

ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహమే ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలా మంది భక్తులు శివాలయాల్లో నవగ్రహ పూజ చేసినా చేయకున్నా, శివునికి మాత్రం కచ్చితంగా అభిషేకం లేదా అర్చన చేయిస్తారు.

అలా చేస్తే నవగ్రహ దోషాలు ఉంటే పోతాయని భక్తుల విశ్వాసం. అయితే శివాలయం కాకుండా కొన్ని ఇతర ఆలయాల్లోనూ మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ... ఏ ఆలయంలో నవగ్రహ మండపాలు ఉన్నా చుట్టూ ప్రదక్షిణ చేయడం ఉత్తమం. అలా చేస్తే గ్రహ దోషాలు పోతాయి.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శివాలయానికి వెళ్ళిన తర్వాత నవగ్రహాలను ముందుగా దర్శించాలా లేదా ఆ పరమ శివుడిని ముందుగా దర్శించాల అన్న సందేహం చాలా మందిలో ఉంది. శివాలయంలో నవగ్రహాలను చూసిన వెంటనే మొదట ఆ పరమశివుడి వద్దకు వెళ్లాలా లేదా నవగ్రహారాధన చేయాలన్నా అన్న సందిగ్ధిత ఉంటుంది.

పరమేశ్వరుడు ఆదిదేవుడు, పాలకుడు. కర్తవ్వాన్ని బోధించేది శివుడు. ముందుగా శివున్ని దర్శించుకోవాలి. లేదా నవగ్రహాలను దర్శించినా..ఆ పరమ శివుడి అనుగ్రహానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అలాగే శివుణ్ణి ప్రార్థించిన నవగ్రాలు తమ స్వామిని ముందుగా కొలిచినందుకు అనుగ్రహాన్ని ప్రసాస్తాయి.



Click it and Unblock the Notifications