For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రావణుడు దశరథునికి కౌసల్య దక్కకుండా చేయాలనుకున్నాడు, కౌసల్యను చంపి రాముడు పుట్టకుండా చేయాలనుకున్నాడు

దశరథునికీ, కౌసల్యకూ వివాహం జరిగితేనే కదా.. రాముడు వారికి పుత్రుడుగా పుట్టేది. వారిద్దరినీ సంహరిస్తే నాకిదీ అడ్డుకాదనే భావన మనసులోకి వచ్చింది రావణుడికి. రామాయణం, రావణుడు, రావణుడు కౌసల్య, శ్రీరాముడు.

|

అయోధ్యనేలే రాజు దశరథునికీ కోసల రాజు కుమార్తె కౌసల్యకూ వివాహం నిశ్చయమైంది. వేద పండితులు చక్కని ముహూర్తం నిర్ణయించారు. ఆ దివ్య ముహూర్తానికి ఐదురోజుల ముందు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. లంకాధీశుడైన రావణుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు. దేవదేవతలతో తనకు మరణం సంభవించదనే వరాన్ని పొంది గర్వంతో ప్రవర్తించసాగాడు.

బ్రహ్మదేవుణ్నే ఆహ్వానించి

బ్రహ్మదేవుణ్నే ఆహ్వానించి

బ్రహ్మదేవుణ్నే స్వయంగా లంకకు ఆహ్వానించి, రావణుడు బ్రహ్మతో అంటాడు పుట్టిన వారు గిట్టక తప్పదంటారు కదా! నేనెలా చనిపోతానో ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మహామహులకే నన్ను చంపడం చేతకాదనేది నాకు తెలుసు. అయినప్పటికీ తెలుసుకోవాలనుకుంటున్నానని అంటాడు రావణుడు రావణుని ప్రశ్నకు చిరాకు పడుతూ బ్రహ్మ, నేటికి సరిగ్గా ఐదురోజుల తర్వాత అయోధ్య రాజు దశరథునికీ, కోసల రాజకుమారి కౌసల్యకూ వివాహం జరుగబోతున్నది.

హరియే రాముడై జన్మించబోతున్నాడు

హరియే రాముడై జన్మించబోతున్నాడు

వారికి సాక్షాత్తూ హరియే రాముడై జన్మించబోతున్నాడు. ఆ రాముని చేతిలోనే నీ మరణం తథ్యం. నీ గర్వం, నీ పరాక్రమం, నిన్ను మరణం నుంచి తప్పించలేవని తెలుసుకో. నీ మూర్ఖత్వమే నీ పాలిట శత్రువని గ్రహించమని చెప్పి వెళ్ళిపోతాడు బ్రహ్మ.

దశరథునికీ, కౌసల్యకూ వివాహం జరిగితేనే కదా

దశరథునికీ, కౌసల్యకూ వివాహం జరిగితేనే కదా

రావణుడు విధిని ఎలాగైనా ఉల్లంఘించాలనీ, దానికి సరైన మార్గం వెంటనే వెదకాలనీ ఆలోచనల్లో పడ్డాడు. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. అసలు దశరథునికీ, కౌసల్యకూ వివాహం జరిగితేనే కదా.. రాముడు వారికి పుత్రుడుగా పుట్టేది. వారిద్దరినీ సంహరిస్తే నాకిదీ అడ్డుకాదనే భావన మనసులోకి వచ్చింది రావణుడికి. వెంటనేకొంతమంది రాక్షసులను వెంటబెట్టుకొని పుష్పక విమానంలో ముందు అయోధ్యకు బయలుదేరాడు రావణుడు. విశేష మంతనాలు చేయడానికని దశరథుడు సుమంతుడనే మంత్రినీ, మరికొందరు ముఖ్యులనూ వెంటబెట్టుకొని సరయూ నదిలో జలవిహారానికి వెళ్ళాడు.

కోసల రాజు రావణునితో తలపడ్డాడు

కోసల రాజు రావణునితో తలపడ్డాడు

ఆకాశంలో విహరిస్తూ రావణుడు వారిని చూసి సరయూ నదిలో దిగి వారు విహరిస్తున్న నావను బలంగా తన్నాడు. పడవ అమాంతం మునిగిపోయింది. అందరూ నదిలో మునిగిపోయారని నిర్ధారించుకొని రావణుడు కోసల రాజ్యానికి పయనమయ్యాడు. కోసల రాజు రావణునితో చాలాసేపు తలపడ్డాడు. కానీ రావణుడు అవలీలగా కోసలరాజును ఓడించి, కౌసల్యను చెరబట్టి ఆకాశమార్గాన వెళ్ళిపోతాడు.

లంకకు తీసుకెళ్ళి ప్రాణాలతో ఉంచితే

లంకకు తీసుకెళ్ళి ప్రాణాలతో ఉంచితే

రావణుడు కౌసల్యను తీసుకెళ్తున్నాడే గానీ, అతని మనసు అందుకు అంగీకరించడం లేదు. ఒక అబలను చంపడం మహావీరులైన నాబోటివానికి తగదనీ, స్త్రీని అన్యాయంగా చంపేసాడనే అపవాదుకు చోటివ్వరాదనుకున్నాడు. అదే సమయంలో ఆమెను లంకకు తీసుకెళ్ళి ప్రాణాలతో ఉంచితే దేవతలు ఏదో రకంగా ఆమెను విడిపించి తీసుకెళుతారనే సందేహంలో రావణుడు పడిపోయాడు.

తిమింగళం రూపం దాల్చి

తిమింగళం రూపం దాల్చి

అంతలో అతనికొక దీవి కనిపించింది. అక్కడే ఒక పెద్ద పెట్టెలో కౌసల్యను బంధించి ఒక రాక్షసున్ని తిమింగళం రూపం దాల్చి దానికి కాపలాగా ఉండమని నియమించి, నేను అడిగినప్పుడు దానిని తనకు తిరిగి ఇవ్వాలని హెచ్చరించి నిశ్చింతగా అక్కడి నుండి లంకకు వెళతాడు రావణుడు.

రాక్షసుడు అమాంతం ఆ పెట్టెను మింగేసి

రాక్షసుడు అమాంతం ఆ పెట్టెను మింగేసి

తిమింగలం రూపంలోని రాక్షసుడు అమాంతం ఆ పెట్టెను మింగేసి సముద్రంలో తిరగసాగాడు. సరయూ నదిలో మునిగిపోయిన దశరథుడూ, సుమంతుడూ గంగానదికి కొట్టుకువచ్చారు. ఆ నదీ ఉపరితలంపై తేలుతున్న చెక్కను పట్టుకొని వారిద్దరూ నదీ ప్రవాహం దిశగా సాగిపోయారు. గంగానదీ ప్రవాహం వారిని సముద్రంలోకి తీసుకెళ్ళి చేర్చింది. సముద్రపు అలలకు వారు కూర్చున్న చెక్క చెదిరిపోగా, వారు కౌసల్యను బంధించిన దీవి ప్రాంతానికి తరలిపోయారు.

తిమింగలం పెట్టెను దీవిపై ఉంచి పోరాడసాగింది

తిమింగలం పెట్టెను దీవిపై ఉంచి పోరాడసాగింది

దశరథ సుమంతులు అక్కడికి చేరడానికి కొద్దిసేపటి క్రితమే తిమింగలం రూపంలోని రాక్షసుడూ, మరో తిమింగలానికి పెద్ద యుద్ధం జరుగుతుంది. యుద్ధం చేయడానికని రాక్షస రూపంలో ఉన్న తిమింగలం పెట్టెను దీవిపై ఉంచి పోరాడసాగింది. దశరథ సుమంతులు పెట్టెను తెరచి చూస్తే కౌసల్య కనిపించింది. వారికి జరిగిన విషయాలను కౌసల్య వివరిస్తుంది. తనను రావణుడు చెరబట్టిందీ కౌసల్య వివరిస్తుంది. కౌసల్య పెట్టెలోకే దశరథ సుమంతులూ చేరతారు.

బ్రహ్మదేవా! మీరు చెప్పిందంతా అసత్యం

బ్రహ్మదేవా! మీరు చెప్పిందంతా అసత్యం

దశరథుడు కౌసల్యను ఆ దీవిలోనే గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అయితే పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికే వారి పెళ్ళి జరగడం విశేషం. తిమింగలం రూపంలోని రాక్షసుడు వేరే తిమింగలాన్ని చంపి తిరిగివచ్చి ఆ పెట్టెను మింగేసి మళ్ళీ సముద్రంలో తిరుగసాగాడు. కొంతకాలం తర్వాత రావణుడు బ్రహ్మను మళ్ళీ తన లంకకు ఆహ్వానించి సభలో అందరూ ఉన్న సమయం చూసి బ్రహ్మదేవా! మీరు చెప్పిందంతా అసత్యం అయిందని తాను చేసిందంతా గర్వంగా చెబుతాడు రావణుడు.

రాముడు జన్మించి నిన్ను చంపుతాడు

రాముడు జన్మించి నిన్ను చంపుతాడు

బ్రహ్మ రావణునితో విధిని మార్చడం ఎవరి తరం కాదు అని అంటారు. అనుకున్న సమయానికే దశరథ కౌసల్యల వివాహం జరిగింది. వారికి రాముడు జన్మించి నిన్ను చంపుతాడనేది విధి. దానిని మార్చడం అసాధ్యం అంటాడు. వెంటనే రావణుడు తిమింగలం రాక్షసున్ని పిలిపించి పెట్టెను తెరచిచూడగా దాంట్లోంచి కౌసల్యా దశరథ సుమంతులు బయటకు వచ్చారు.

ఆయుష్షును చేజేతులా అంతం చేసుకోకు

ఆయుష్షును చేజేతులా అంతం చేసుకోకు

ఏం చేయాలో తెలియక వారిని చంపబోతుంటే బ్రహ్మ రావణున్ని వారిస్తూ నీకు ఉన్న ఆయుష్షును చేజేతులా ఇప్పుడే ఎందుకు అంతం చేసుకుంటావు. మర్యాదగా వారిని అయోధ్యకు పంపించు. విధి విచిత్రాన్ని అంత సులభంగా నువ్వు అర్థం చేసుకోలేవు. కాబట్టి జరుగబోయేది జరిగే తీరుతుందంటాడు.

రాముడు పుడతాడు

రాముడు పుడతాడు

రావణుడు బ్రహ్మ చెప్పినట్టుగానే వారిని అయోధ్యకు పంపి ఇప్పటికి ప్రమాదం తప్పిందని శాంతపడతాడు. కానీ విధిని తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు కదా. అందుకే రాముడు పుడతాడు.. రావణున్ని చంపుతాడు.

English summary

why ravana abducted ramas mother kausalya

why ravana abducted ramas mother kausalya
Desktop Bottom Promotion