Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
పరమశివుడ్ని పసుపుతో ఎందుకు పూజించకూడదు?పరమ శివుడిని పసుపుతో అభిషేకించకూడదు ఎందుకు?
పరమశివుడ్ని పసుపుతో ఎందుకు పూజించకూడదు?పరమ శివుడిని పసుపుతో అభిషేకించకూడదు ఎందుకో తెలుసుకోవాలంటే.. దవండి.
Spirituality
lekhaka-Deepthi T A S
ఇది వరకటి వ్యాసాల్లో మేము, ఇంట్లో లేదా ఎక్కడైతే రోజూ సరైన ఆచారాలతో పూజలు జరగవో అక్కడ శివలింగాన్ని పెట్టకూడదని సలహా ఇచ్చాం. అలా సరైన పూజాపునస్కారాలు లేకపోవటం పరమశివుణ్ణి అగౌరవంగా చూడటంతో సమానం.
పరమశివుడు చాలా సాదా జీవనం గడపటానికి ప్రసిద్ధుడు, అందుకని ఆయన్ని పూజించటం కూడా చాలా సాధారణంగానే ఉండాలి. అందంగా అలంకరణలు, పెద్ద పెద్ద నైవేద్యాలు,పళ్ళు ఇవేవీ శివుడ్ని పూజించటానికి అవసరం ఉండదు.

పురాణాలలో పరమశివుడు కేవలం దత్త పండు, బిల్వ ఆకులు, కల్లు, తాజా చల్లని ఆవుపాలు, గంధపు పేస్టు ,మరియు భస్మం వీటితోనే ఆనందపడతాడని రాసి ఉంది.
హిందూ మతంలో, పరమశివున్ని క్రమం తప్పకుండా పూజించటం, ధ్యానించటం వలన ఇతర దేవదేవతలు కూడా అనుగ్రహిస్తారని నమ్ముతారు.

శివుడు, పార్వతుల జీవితకథ అయిన శివపురాణంలోని ఒక అధ్యాయంలో వారిని ఎలా పూజించాలో, ఎలా పూజించకూడదో మొత్తం రాసి ఉంది.
ఈ రోజు, మేము పరమశివుడికి పసుపు(హల్దీ) ఎన్నటికీ ఎందుకు పెట్టకూడదో పంచుకుంటున్నాం.

పసుపు అన్ని మతాచారాలలో చాలా పవిత్రమైనదని గుర్తించినా, అందరు దేవతలను పూజించటానికి ఉపయోగించిన, పసుపును పరమశివుడికి లేదా ఆయన శివలింగానికి ఎన్నటికీ వినియోగించరు.

పురాణాల ప్రకారం శివలింగాన్ని పురుషయోనికి గుర్తుగా భావిస్తారు, ముఖ్యంగా శివునిది. అది ఆయన అపారమైన శక్తికి నిదర్శనం. ఈ కారణం వలన దాన్ని ఎప్పుడూ చల్లబర్చే పాలు, గంధం, బూడిద వంటి వాటితోనే పూజిస్తారు.
కానీ పసుపు స్త్రీ అందాన్ని పెంచే వస్తువు. ఈ భౌతిక అందాలకి దూరంగా ఉండే పరమశివుడు ఒక సన్యాసిగా జీవిస్తారు కాబట్టి పసుపుతో ఎన్నటికీ పూజించబడరు.
Comments
English summary



Click it and Unblock the Notifications
