For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం..

By Saraswathi
|

శివాలయంలో శివలింగాన్ని నేరుగా చూసి దర్శనం చేసుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే..

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని

చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా?

సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర)దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి

వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి.

పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది.

ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి, అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన మాత్రమే వాడతారు.

మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు. అలా చూడటం వెనుక రహస్యమేమిటంటే...

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

పరమ శివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగ కరచరనాదులు(విగ్రహ రూపం) లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూం.

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం

చేయాలి.

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము(కొమ్ముల)నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరింఛి దర్శనం చేసుకోవాలి.

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

నంది యొక్క పృష్ట భాగంను నిమురుచూ, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి.

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

అంతే కాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో

ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి.

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు. అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సివుంటుంది.

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు.

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు.

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

రాశి చక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం. వృషభరాశి నందిశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి, వృషభరాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు.

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

శివదర్శనాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి చేసుకోవాలి.. ఎందుకని?

వృషభం (నందీశ్వరుడు)యొక్క వృషభ బాగాన్ని స్పృషిస్తూ శివుని దర్శించటం వల్ల విధి విహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణలో ఉన్నది .

English summary

Why should devotees see lord Shiva through the horns of Nandi?

Why should devotees see lord Shiva through the horns of Nandi?,When we enter lord Shiva temple, we find “Nandhi”, Indian bull. The idol of seated bull is placed straight to Shiv Linga. Our parents say it is good to see lord Shiva through the horns of Nandhi.
Desktop Bottom Promotion