For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు.. !

|

పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు.

ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరము ( తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు.

పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగ, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.

పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు !

హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్తసులభుడు, హనుమంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేదపండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు.

ఆంజనేయస్వామి నవావతరాలు ప్రసన్నాంజనేయస్వామి, వీరాంజనేయస్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టాదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చల ఆంజనేయస్వామి, చతుర్భుజ ఆంజనేయస్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి మరియు వానరాకార ఆంజనేయస్వామి.

ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు. పంచముఖాలు ఐదు దిక్కులను దృష్టిని సారించి ఉండగా ఆ ముఖాలలోని వివరాలు ఈ విధంగా చెప్పబడ్డాయి.

తూర్పుముఖముగా హనుమంతుడు:

తూర్పుముఖముగా హనుమంతుడు:

తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. ఆంజనేయ స్వామి, తూర్పునకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు

దక్షిణముఖంగా

దక్షిణముఖంగా

దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.నరసింహ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.

పడమర ముఖంగా

పడమర ముఖంగా

పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు

ఉత్తరముఖముగా

ఉత్తరముఖముగా

ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు

ఊర్ధ్వంగా

ఊర్ధ్వంగా

ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.

 శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి

శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి

ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి.

"శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు

అలాగే ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

English summary

Why should we worship Panchmukhi Hanuman?

Pancha means Five and Mukhi means faces, so panchmukhi hanuman is a form Lord hanuman which has five different faces. Hanuman ji is an ardent devotee of Lord Rama. He is the symbol of power, energy, strength and knowledge. And, an epitome of true devotion and brahmcharya (bachelorhood). - See more at: http://blog.onlineprasad.com/why-should-we-worship-panchmukhi-hanuman/#sthash.yNGOE602.dpuf
Story first published: Wednesday, May 11, 2016, 18:20 [IST]
Desktop Bottom Promotion