TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
సీతను అగ్ని ప్రవేశం చేయమనడానికి గల కారణాలు తెలుసా ?
రామాయణం ప్రపంచ సాహిత్యాలలోని అతిపెద్ద పురాణాలలో ఒకటిగా ఉన్నది. దీనిలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు మరియు ఏడు అధ్యాయాలు, ఐదు వందల ఉప భాగాలుగా విభజించబడింది. వాల్మీకి వ్రాసిన రామాయణం, మొదట సంస్కృతంలో వ్రాయబడింది . ప్రజలకు సమాచారాన్ని అందజేయడం, ప్రేరణ కలిగించడం మరియు సామాన్యులకు అర్ధమవడంలో భాగంగా ఇతర భాషలకు కూడా అనువదించబడినది. అందులో ముఖ్యంగా గోన బుద్దా రెడ్డి, 1300-1310 మద్య కాలాన తెలుగులోనికి అనువదించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఇక మొల్ల రామాయణాన్ని కవయిత్రి మొల్ల రచించారు.
రామాయణాన్ని ఆదికావ్యoగా పిలుస్తారు. అనగా మొదటి పద్య రచనగా చెప్పబడినది. మరియు సమాజంలో మనుగడ సాగించుటకు ఒక మనిషి చేయవలసిన వివిధ పాత్రలను, సంబంధాలను వర్ణిస్తుంది. ఇక్కడ సమాజాన్ని కర్మక్షేత్రo అని కూడా పిలుస్తారు. ఇక్కడ, ప్రతి ఒక్కరూ తమ పాత్రలను ఉత్తమమైన పద్ధతిలో నిర్వహించవలసి ఉంటుంది.
రామాయణoలో ప్రధానంగా చెప్పబడిన అంశాలు మరియు గూడార్ధాలు ఇవే. క్లిష్ట పరిస్థితులలో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో అన్న భావన చుట్టూ ఈకావ్యo తిరుగుతుంది. తద్వారా ఒక మనిషి మనీషిగా మారడంలో కీలకపాత్ర పోషించేలా ఈ రామాయణం ఉంటుంది.
సీతాదేవి అగ్ని పరీక్ష :
రామాయణం అయోధ్యకు చెందిన యువరాజు కథ మాత్రమే కాదు. ఆదర్శవంతమైన రాజు, ఆదర్శ కుమారుడు, ఆదర్శ కుమార్తె, ఆదర్శ సోదరుడు మొదలైన ఉత్తమ సంబందాల మేలు కలయిక. అందులో అత్యంత జనాదరణ పొందిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సీత పాత్రే. ఆదర్శ భార్యగా సీత పాత్రను మలచిన తీరు ఈనాటికీ ఏనాటికీ ఉన్నతమైన స్త్రీత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈపాత్రలో ఆమెను భర్తతో పాటు బహిష్కరించబడిన మహిళగా మాత్రమే కాకుండా, రావణాసురుడు తనను కనీసం తాకలేదని రుజువు చేసుకునే ప్రక్రియలో భాగంగా అగ్ని ప్రవేశం చేసి పునీతురాలై నిలచిన తీరుతో, రామాయణ మహా కావ్యానికే ఉత్తమమైన పాత్రగా నిలిచింది. ఈ ప్రసిద్ధమైన భాగాన్ని అగ్నిపరిక్షగా వ్యవహరిస్తారు.
భూమిమీద అత్యంత పవిత్రురాలుగా విశ్వసించే సీతాదేవి మీద అనుమానం
కానీ సామాన్యంగా ఒక ప్రశ్న అందరికీ మదిలో మెదులుతుంది, భూమిమీద అత్యంత పవిత్రురాలుగా విశ్వసించే సీతాదేవి మీద అనుమానంతో అగ్ని ప్రవేశం చేయమని రాముడు చెప్పడం అత్యంత హేయమైన చర్య కదా ! ఈ చర్యకు రాముడు ఎలా పూనుకున్నాడు? అని. మేమిప్పుడు చెప్పబోయే అంశం కూడా ఇదే.
సీత, లక్ష్మీదేవి అవతారం అని అందరికీ తెలుసు.
సీత, లక్ష్మీదేవి అవతారం అని అందరికీ తెలుసు. భవిష్యత్తులో జరగబోయే ప్రతి అంశం గురించిన అవగాహన లక్ష్మీ దేవికి ఉంది. రావణుడు ఆమెను అపహరించుకుని పోవడం కూడా ఆమెకు తెలుసు అని నమ్ముతారు. ఆమె భర్త, శ్రీరాముడు మరియు అతని సోదరుడు లక్ష్మణుడు ఇద్దరు కూడా వెంటనే రావణాసురుని నుండి తనను కాపాడలేరని కూడా సీతకు తెలుసు.
తద్వారా తనను తాను రావణుడి బారి నుండి కాపాడుకొనే ప్రక్రియలో
తద్వారా తనను తాను రావణుడి బారి నుండి కాపాడుకొనే ప్రక్రియలో భాగంగా తనను దహించి వేయమని అగ్ని దేవుని వేడుకోగా, సీత భక్తికి మెచ్చిన అగ్ని దేవుడు మాయా సీతను, అసలు సీత స్థానంలో ఉంచి, సీతకు తన ఇంట ఆశ్రయాన్ని కల్పించాడు. క్రమంగా రావణుడు మాయాసీతను, సీతా దేవిగా భావించి ఆమెను తనతో తీసుకెళ్ళాడని ప్రతీతి.
త్రేతా యుగంలో,
త్రేతా యుగంలో, నీతిమoతుడైన వ్యక్తితో ఏ తప్పూ జరగదన్న నమ్మకం ఉంది. మరియు రావణుడు సీతను తాకినట్లయితే, ఆమె తన పవిత్రతను కోల్పోతుందని నమ్ముతారు. మరియు రావణుడు సీతను చేతితో పట్టుకొని బలవంతంగా ఆమెను అపహరించినా కూడా, అది మాయా సీతనే కానీ నిజమైన సీత కాదు. రావణ రాజ్యం లంకలోని అశోకవనంలో ఉంచబడిన సీతాదేవీ, వాస్తవo కాదు. తను మాయా సీత.
రాముడు విష్ణుమూర్తి అంశ, కావున సీత వలె రామునికి కూడా
రాముడు విష్ణుమూర్తి అంశ, కావున సీత వలె రామునికి కూడా జరగబోయే అంశాల గురించిన అవగాహన ఉంది. కానీ, నరుడై పుట్టిన కారణంగా కర్మను పాటించక తప్పని పరిస్థితిలో ఉండుట సహజం. తన భార్యను రావణుడి బారినుండి కాపాడే చర్యలలో తన శక్తినంతా ధారపోశాడు. అది రాజ ధర్మమే కాకుండా, భర్తగా తన భాద్యత కూడా. కానీ ఈ ప్రపంచాన ధర్మ సంస్థాపన లక్ష్యం దృష్ట్యా, రావణాసురుని చంపడo, తద్వారా అహంకారాన్ని భూస్థాపితం చేయడం ప్రధాన లక్ష్యంగా మారింది. మరియు వేరొకరి చెంతన ఉన్న భార్య పునీతురాలని ప్రజలకు ఒక రాజుగా తెలియజేయాల్సిన భాద్యత కూడా రాముని పై ఉంది. ధర్మ సంకటంలో ఉన్న రాముడు తప్పక మనసొప్పక సీతకు అగ్ని పరీక్షను పెట్టవలసి వచ్చినది.
తన వానర సైన్యంతో కలిసి యుద్ధంలో పాల్గొని,
అందువల్ల రాముడు, తన వానర సైన్యంతో కలిసి యుద్ధంలో పాల్గొని, రావణుని, అతని పరివారాన్ని ఓడించి సీతా దేవిని కాపాడాడు. రావణాసురుని చెరనుండి బయట పడిన తరుణంలో, అసలు సీతా దేవి ఆగమనానికి సమయం ఆసన్నమైంది. ఆ కారణం చేతనే, రాముడు ఆమెని అగ్నిగుండం లోకి వెళ్ళమని కోరాడు. రామునికి సీతకు ఈ విషయం గురించిన పూర్తి అవగాహన ఉన్నది. తద్వారా అగ్ని గుండము లోనికి వెళ్ళిన మాయా సీత, నిజమైన సీతను తిరిగి పంపినది.
కొన్ని కథల సారాంశం ప్రకారం అసలు సీత పూర్వ జన్మలో వేదవతి. బ్రహ్మర్షి అయిన కుశ ధ్వజునికి, మూలవతికి పుట్టిన కుమార్తె వేదవతి. విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలన్న ఆలోచనతో, వేదవతికి వచ్చిన అన్ని సంబంధాలనూ నిరాకరిస్తూ వచ్చారు. విష్ణు మూర్తికై పరితపిస్తున్న వేదవతి, ప్రత్యక్షం గావించి తన కోరికను తెలుపాలన్న లక్ష్యంతో తపస్సు చేయచుండగా, రావణుడు తనను పరిణయమాడవలెనని కోరగా వేదవతి తిరస్కరించింది. కోపంతో వేదవతిని చెరబట్టాలని చూడగా, యోగాగ్నిలో దూకి తనను తాను భస్మo చేసుకుంది. అలా రావణాసురుని పై పగ పూనిన వేదవతి, రావణాసురుని నాశనముకై ఒక పద్మములో లంకలో పుట్టగా, జ్యోతిష్యులు ఈ బాలిక వలన లంకకే అరిష్టమని చెప్పగా, ఒక పెట్టెలో ఉంచి సముద్ర మద్యములో ఉంచారు. తద్వారా, మిధిలా నగరంలో జనకునికి నాగేటి చాలులో ఈ పెట్టె లభించగా, పెట్టెలోని ఆ పాపకు సీతగా నామకరణం చేసి తమ సొంత బిడ్డవలె, దేవుడిచ్చిన ప్రసాదం వలె భావించి పెంచినారు. సీత అనగా నాగేటి చాలు అని అర్ధం వస్తుంది. తర్వాతి కాలంలో సీత ద్వారానే, రావణాసురుడు నాశనం గావింపబడ్డాడు. అలా వేదవతి రావణాసురుని పై పగ తీర్చుకుందని అనేక కథల సారాంశం.
కొన్ని కథల సారాంశం ప్రకారం అసలు సీత పూర్వ జన్మలో వేదవతి. బ్రహ్మర్షి అయిన కుశ ధ్వజునికి, మూలవతికి పుట్టిన కుమార్తె వేదవతి. విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలన్న ఆలోచనతో, వేదవతికి వచ్చిన అన్ని సంబంధాలనూ నిరాకరిస్తూ వచ్చారు. విష్ణు మూర్తికై పరితపిస్తున్న వేదవతి, ప్రత్యక్షం గావించి తన కోరికను తెలుపాలన్న లక్ష్యంతో తపస్సు చేయచుండగా, రావణుడు తనను పరిణయమాడవలెనని కోరగా వేదవతి తిరస్కరించింది. కోపంతో వేదవతిని చెరబట్టాలని చూడగా, యోగాగ్నిలో దూకి తనను తాను భస్మo చేసుకుంది. అలా రావణాసురుని పై పగ పూనిన వేదవతి, రావణాసురుని నాశనముకై ఒక పద్మములో లంకలో పుట్టగా, జ్యోతిష్యులు ఈ బాలిక వలన లంకకే అరిష్టమని చెప్పగా, ఒక పెట్టెలో ఉంచి సముద్ర మద్యములో ఉంచారు. తద్వారా, మిధిలా నగరంలో జనకునికి నాగేటి చాలులో ఈ పెట్టె లభించగా, పెట్టెలోని ఆ పాపకు సీతగా నామకరణం చేసి తమ సొంత బిడ్డవలె, దేవుడిచ్చిన ప్రసాదం వలె భావించి పెంచినారు. సీత అనగా నాగేటి చాలు అని అర్ధం వస్తుంది. తర్వాతి కాలంలో సీత ద్వారానే, రావణాసురుడు నాశనం గావింపబడ్డాడు. అలా వేదవతి రావణాసురుని పై పగ తీర్చుకుందని అనేక కథల సారాంశం. అసలు సీత పూర్వ జన్మలో వేదవతి. బ్రహ్మర్షి అయిన కుశ ధ్వజునికి, మూలవతికి పుట్టిన కుమార్తె వేదవతి. విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలన్న ఆలోచనతో, వేదవతికి వచ్చిన అన్ని సంబంధాలనూ నిరాకరిస్తూ వచ్చారు. విష్ణు మూర్తికై పరితపిస్తున్న వేదవతి, ప్రత్యక్షం గావించి తన కోరికను తెలుపాలన్న లక్ష్యంతో తపస్సు చేయచుండగా, రావణుడు తనను పరిణయమాడవలెనని కోరగా వేదవతి తిరస్కరించింది. కోపంతో వేదవతిని చెరబట్టాలని చూడగా, యోగాగ్నిలో దూకి తనను తాను భస్మo చేసుకుంది. అలా రావణాసురుని పై పగ పూనిన వేదవతి, రావణాసురుని నాశనముకై ఒక పద్మములో లంకలో పుట్టగా, జ్యోతిష్యులు ఈ బాలిక వలన లంకకే అరిష్టమని చెప్పగా, ఒక పెట్టెలో ఉంచి సముద్ర మద్యములో ఉంచారు. తద్వారా, మిధిలా నగరంలో జనకునికి నాగేటి చాలులో ఈ పెట్టె లభించగా, పెట్టెలోని ఆ పాపకు సీతగా నామకరణం చేసి తమ సొంత బిడ్డవలె, దేవుడిచ్చిన ప్రసాదం వలె భావించి పెంచినారు. సీత అనగా నాగేటి చాలు అని అర్ధం వస్తుంది. తర్వాతి కాలంలో సీత ద్వారానే, రావణాసురుడు నాశనం గావింపబడ్డాడు. అలా వేదవతి రావణాసురుని పై పగ తీర్చుకుందని అనేక కథల సారాంశం.