For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగువారు సంక్రాంతి ఎందుకు నిర్వహించుకుంటారో తెలుసా? భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యత ఇదే...

అలాగే కనుమ రోజు గుమ్మడి కాయల్ని పగలకొడుతారు. వాటితో పొలి వేస్తారు. కొందరు పశువులకు పూల దండలు కూడా వేసి బాగా అలంకరిస్తారు. ఎద్దుల బండ్లు కట్టి ఆలయాల చుట్టూ తిప్పుతారు. ఈ రోజు పశువులకు సంబంధించిన పందేలు

|

సంక్రాంతి సంబురాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం. కొత్త సంవత్సరాదిలో వచ్చే తొలి పండుగ కావడంతో అందరూ చాలా వైభవంగా నిర్వహించుకుంటారు.

why we celebrate makara sankranti

ముచ్చటగా మూడు రోజుల పాటు చేసుకుంటారు ఈ పండుగను. భోగితో మొదలయ్యే పండుగ కనుమతో ముగుస్తుంది. కొందరు ముక్కనుమ కూడా చేసుకుంటారు. పండుగరోజుల్లో ప్రతి పల్లెలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతుంది.

నెల రోజుల పండుగ

నెల రోజుల పండుగ

సంక్రాంతి మూడు రోజుల పండుగే అయినా నెల రోజుల పాటు పండుగ వాతావరణమే ఉంటుంది. ధనుర్మాసంలోకి ఎంటర్ కాగానే పండుగ సంబురాలు మొదలవుతాయి.

మకర సంక్రాంతి

మకర సంక్రాంతి

సంక్రాంతి పండుగలో మకర సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంది. మకర సంక్రాంతిని మన పెద్దలు నిర్ణయించడానికి కొన్ని కారణాలున్నాయి.

సాధారణంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే విషయం మనకు తెలిసందే.

మకరరాశిలోకి సూర్యుడు

మకరరాశిలోకి సూర్యుడు

ఇలా తిరగడం వల్ల భానుడు ప్రతి రాశిలో కూడా ఒక నెల రోజుల పాటు ఉంటాడు. అలా ప్రతి మాసంలో ఒక సంక్రాంతి వస్తూ ఉంటుంది. అయితే ఇందులో మకరరాశిలోకి సూర్యుడు ఉన్నప్పుడు మనం చేసుకునేది మకర సంక్రాంతి.

ఉత్తరార్ద గోళంలో

ఉత్తరార్ద గోళంలో

దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. సూర్యుడు ధనుస్సురాశిలోకి ప్రవేశించి అక్కడి నుంచి మకరంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరార్ద గోళంలో ఉన్న మనం సూర్యుడి రాకను పురస్కరించుకుని పండుగ చేసుకుంటాం.

దక్షిణాయనం ముగుస్తుంది

దక్షిణాయనం ముగుస్తుంది

మకర సంక్రాంతి రోజుతో దక్షిణాయనం ముగుస్తుంది. అలాగే ఉత్తరాయణం మొదలవుతుంది. అలాగే ఈ రోజు స్వర్గానికి ఉండే తలుపులు తెరుచుకుంటాయని విశ్వాసం.

Most Read :ఈ ఆహారాలు తింటే నలభైలోనే కాదు ఎప్పటికీ యంగ్ హీరోల్లా ఉంటారు, మగవారి ఆరోగ్యాన్ని కాపాడే పది ఆహారాలుMost Read :ఈ ఆహారాలు తింటే నలభైలోనే కాదు ఎప్పటికీ యంగ్ హీరోల్లా ఉంటారు, మగవారి ఆరోగ్యాన్ని కాపాడే పది ఆహారాలు

ధనుర్మాసంలో లాస్ట్ డే భోగి

ధనుర్మాసంలో లాస్ట్ డే భోగి

మనం ధనుర్మాసంలో లాస్ట్ డేను భోగి పండుగ చేసుకుంటాం. ఆ రోజు ఇంట్లోని పాత వస్తువులను, పనికిరాని వాటినన్నింటినీ భోగి మంటలో వేస్తాం. ప్రజలంతా తెల్లవారుజామునే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు.

రేగి పళ్లు పోసి ఆశీర్వదిస్తారు

రేగి పళ్లు పోసి ఆశీర్వదిస్తారు

ఇక చిన్నారులకు భోగి రోజు సాయంత్రం పేరంటాలు నిర్వహిస్తారు. వారికి రేగి పళ్లు పోసి ఆశీర్వదిస్తారు. భోగభోగ్యాలతో కలకాలం చల్లంగా ఉండమని పెద్దలు దీవిస్తారు. ఇళ్లవాకిళ్లలన్నీ ఈ మూడు రోజులు గొబ్బిమ్మలతో, రంగవల్లికలతో నిండిపోతాయి. భోగి రోజు చాలా మంది నువ్వుల రొట్టెలు చేసుకుంటారు. అలాగే కలగూర వండుకుంటారు. కొందరు గాలిపటాలు ఎగురువేస్తారు.

అభ్యంగన స్నానం

అభ్యంగన స్నానం

ఇక రెండో రోజు మకర సంక్రాంతి నిర్వహించుకుంటారు. ఈ రోజు ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేస్తారు. మకర సంక్రాంతి రోజు బెల్లంతో పాటు గుమ్మడి కాయలు, నువ్వుల్ని దానం చేస్తే మంచిది. అలాగే ముత్తైదువులకు పసుపు కుంకుమ అందిస్తే మేలు.

పశువులకు ప్రాధాన్యం

పశువులకు ప్రాధాన్యం

మూడో రోజు కనుమను నిర్వహించుకుంటారు. కనుమ పండుగ పూట ఎక్కువగా పశువులకు ప్రాధాన్యం ఇస్తారు. ఏడాదంతా కష్టపడి పని చేసినా పశువులను ఆ రోజు ఎంతో బాగా చూసుకుంటారు.

శుభ్రంగా కడుగుతారు

శుభ్రంగా కడుగుతారు

పశువులను శుభ్రంగా కడుగుతారు. వాటికి పూజలు చేస్తారు. పశుపాలకను మొత్తం బాగా శుభ్రం చేసి ముగ్గులేస్తారు. పశువుల కోసం ప్రత్యేకంగా వంటలు చేసి వాటికి తినిపిస్తారు.

Most Read :రోగాల బారినపడకుండా పెద్దవాళ్లంతా ఈ టీకాలు వేయించుకోవాలి, వయస్సు పెరిగే కొద్దీ టీకాలే అవసరంMost Read :రోగాల బారినపడకుండా పెద్దవాళ్లంతా ఈ టీకాలు వేయించుకోవాలి, వయస్సు పెరిగే కొద్దీ టీకాలే అవసరం

పొలి వేస్తారు

పొలి వేస్తారు

అలాగే కనుమ రోజు గుమ్మడి కాయల్ని పగలకొడుతారు. వాటితో పొలి వేస్తారు. కొందరు పశువులకు పూల దండలు కూడా వేసి బాగా అలంకరిస్తారు. ఎద్దుల బండ్లు కట్టి ఆలయాల చుట్టూ తిప్పుతారు. ఈ రోజు పశువులకు సంబంధించిన పందేలు కూడా ఉంటాయి.

పొలాల్లో చల్లుతారు

పొలాల్లో చల్లుతారు

ఇక పొంగలిని తయారు చేసి పొలాల్లో చల్లుతారు. దీంతో పంటలపై ఏ ప్రభావం పడదని రైతుల నమ్మకం. ఇక కనుమ మరుసటి రోజు కొందరు ముక్కనుమ వేడుకలను కూడా నిర్వహించుకుంటారు.

దానంగా ఇస్తారు

దానంగా ఇస్తారు

ఆ రోజు గ్రామంలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉండే కళాకారులకు నూతన వస్రాలు, ధాన్యంలాంటివి దానంగా ఇస్తారు. అలాగే పని చేసేవారికి కూడా ఆ రోజు ఎంతో కొంతసాయం చేసే సంప్రదాయం ఉంది. ఇక ఈ రోజుతో సంక్రాంతికి ముగింపు పలుకుతారు.

English summary

why we celebrate makara sankranti

why we celebrate makara sankranti
Desktop Bottom Promotion