మనము మొదటగా గణేషుడినే ఎందుకు పూజించాలి ?

By Lekhaka
Subscribe to Boldsky

ఏదైనా నూతన కార్యాన్ని మొదలుపెట్టే స్వరూపంగా "గణేషుడు" కొలువై వున్నాడు. గణేశుని ప్రేరణ లేకుండా ఎలాంటి కార్యసిద్ధి జరగదు.

అయితే, మనము మొదటగా ఎందుకు గణేషుడినే పూజించాలి అన్న సందేహము చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదా ? అందుకు గల కారణాలు ఈ క్రిందన తెలుపబడినవి.

పార్వతిదేవి తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు :

పార్వతిదేవి తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు :

పార్వతిదేవి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. మరోపక్క శివుడు తన గణాలతో పాటు బయటకు వెళ్లాడు. అప్పుడు పార్వతీదేవి స్నానం చేయవలసి సమయం వచ్చింది. అలాంటి సమయంలో ఆమెకు తోడుగా ఇంకెవరూ లేనందున ఆమె ఒంటరిగా ఉన్నది.

పార్వతీదేవి తన దేహమంతటికీ గంధాన్ని పూసుకుంది. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె శరీరంపై ఉన్న గంధంతో ఒక బాలుడి ప్రతిమను చేసి, దానికి జీవితాన్ని ఎందుకు ప్రసాదించకూడదు అని, ఆమె భావించింది. ఆ విధంగా ఆమె శరీరం వెలుపల నుంచి ఒక బాలుడు జన్మించడం వల్ల, పార్వతిదేవికి ఆ బాలుడు కుమారుడుగా మారే అవకాశముంది.

అనుకున్నట్టుగానే, పార్వతీదేవి తన శరీరం నుంచి ఒక బాలుడి ప్రతిమను తయారు చేయడం ప్రారంభించింది. అలా తయారుచేసిన ఆ ప్రతిమకు తన దైవిక శక్తులతో జీవితాన్ని ప్రసాదించింది. ఆ విధంగా పార్వతీదేవి, ఈ బాలునికి తన కుమారుడి హోదాను కలిగి ఉండేటట్లుగా జీవితాన్ని ప్రసాదించింది.

గణేషుడే సంరక్షకునిగా :

గణేషుడే సంరక్షకునిగా :

ఇప్పుడు, పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్లేటప్పుడు - ఆ బాలుడిని తన సంరక్షకునిగా నియమించి, ఇతరులను లోపలికి రానివ్వవద్దని ఆ బాలునికి సూచించడమైనది.

గణేషుడు : "ఎవరినీ లోపలికి పంపించవద్దా తల్లి ?"

పార్వతిదేవి : "అవును, ఎవ్వర్నీ లోపలికి పంపించవద్దు"

గణేషుడు : "ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో"

పార్వతిదేవి : "అవును, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా లోపలికి పంపించవద్దు"

తన తల్లి పార్వతీదేవి చెప్పినట్లుగా, గణేషుడు ఇతరులను లోపలికి అనుమతించకుండా తన విధులను నిర్వర్తిస్తున్నాడు.

శివుడు, గణేషుడి తలను నరికాడు :-

శివుడు, గణేషుడి తలను నరికాడు :-

సరిగ్గా అప్పుడే, అటుగా వచ్చిన శివుడు - పార్వతి మందిరంలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేసినప్పుడు, ఈ బాలుడు శివుడిని అడ్డగించి మందిరంలోనికి ప్రవేశించనివ్వలేదు. అలా వచ్చింది ఎవరో ఆ బాలునికి తెలియలేదు, కానీ ఇతరులను పార్వతీ దేవి మందిరంలోనికి ప్రవేశించనివ్వకూడదని మాత్రమే ఆ బాలునికి తెలుసు.

ఆ బాలుని చేష్టలకు తీవ్ర కోపోద్రిక్తుడైన శివుడు ఆ బాలుని తలను నరికేశాడు. అటుగా వచ్చిన పార్వతీదేవి ఈ సంఘటనను చూసి తట్టుకోలేక మహాకాళి రూపంలోకి మారి, తన కుమారుడిని తిరిగి బ్రతికించేకపోతే ఈ విశ్వాన్ని పూర్తిగా నాశనం చేస్తానని శివుడిని హెచ్చరించింది.

శివుడు తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు :-

శివుడు తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు :-

శివుడు తన తప్పిదాన్ని తెలుసుకుని, తన గణాలను పిలచి - మీకు మొదటగా ఎదురైన ఒక బాలుని తలను తీసుకురమ్మని ఒక షరతు మీద వారిని పంపించాడు శివుడు. ఆ షరతు ఏమిటంటే, "ఆ బాలుడు & అతని తల్లి వ్యతిరేక దిశలో ఉండాలి, మీరు చేసే ఈ పని ఆ బాలుని తల్లికి తెలియకూడదని" !

గణేశునికి ఏనుగు తలను ప్రతిస్థాపన చేయడం :-

గణేశునికి ఏనుగు తలను ప్రతిస్థాపన చేయడం :-

శివుని ఆదేశానుసారం - ప్రమదగణాలు తల కోసం వెతుకుతుండగా, వారికి తల్లి ఏనుగుతో పాటు వున్న పిల్ల ఏనుగు కనబడింది. తల్లి ఏనుగు ఉత్తరదిశలో ఉండగా పిల్ల ఏనుగు దక్షిణ దిశలో ఉంది.

తెల్ల ఏనుగు తలను నరికి, శివుని వద్దకు తీసుకువెళ్లారు. శివుడు ఆ ఏనుగు తలను ఆ బాలుని తలకు జతచేసి, మళ్లీ పునర్జన్మను ప్రసాదించాడు.

పార్వతీదేవి సంతృప్తి చెందలేదు :-

పార్వతీదేవి సంతృప్తి చెందలేదు :-

ఆ విధంగా, తన కుమారుడు సజీవమైనప్పటికీ పార్వతీదేవి సంతోషించలేదు. మానవ శరీరానికి తగిలించిన ఏనుగు తలను చూసి పార్వతిదేవి సంతృప్తి చెందలేదు.

"పార్వతిదేవి చేత ఈ విశ్వము వినాశనం కాకుండా రక్షించడానికి నేనేమీ చేయగలనని" - శివభగవానుడు ఆలోచనలోపడ్డాడు.

గణేషుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందాడు :-

గణేషుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందాడు :-

పార్వతీదేవిని ప్రసన్నం చేయడానికి, శివునికి అనుచరులుగా ఉండే గణాలకు ఈ బాలుడే అధిపతి అని శివుడు ప్రకటించి, ఆ బాలునికి "గణేష" అని నామకరణం చేశారు. అప్పటినుంచి గణాల ప్రభువుగా "గణేషుడు" కీర్తికెక్కాడు. అది మాత్రమే కాకుండా భక్తులందరి చేత ప్రథమంగా పూజలందుకునే దేవుడిగా గణేశుడినే ప్రార్థించాలని శివ మహాదేవుడు ప్రకటించాడు. అందుచేతనే గణేషుడు మొట్టమొదటి దేవతా మూర్తిగా ప్రజలందరి చేత పూజలందుకుంటున్నాడు. మనము చేసే కార్యాలలో ఎదురయ్యే అన్ని ఆటంకాలను తొలగించి, మనకు కార్యసిద్ధిని కలుగజేస్తాడు కాబట్టి గణేషుడిని "విఘ్నేశ్వరుడు" అని కూడా పిలుస్తారు.

గణేశ చతుర్ధి :-

గణేశ చతుర్ధి :-

ఆరోజు నుంచి ఎలాంటి పవిత్రమైన వేడుకలలోనైనా అన్ని దేవతల కంటే ముందుగా గణేషుడినే పూజిస్తారు. మనము చేపట్టే పనులలో వచ్చే అడ్డంకులను తీసివేసి, మనకు విజయాన్ని చేకూరుస్తాడు. అసంపూర్ణమైన కార్యాచరణ తర్వాత కూడా, సంపూర్ణత్వాన్ని "శ్రీ మహా గణేషుడు" మాత్రమే సిద్ధింపజేస్తాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Why We Worship Ganesha First​​​?

    Why We Worship Ganesha First​​​? , Lord Ganesha is the embodiment of a perfect beginning. No work reaches success without invoking him first. Have you ever wondered why only he was chosen to be worshiped first? Well, here is the reason. Read on.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more