For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

By Swathi
|

ఏదీ దేవుడికి జరగని విధంగా ఆంజనేయ స్వామికి తమలపాకు సేవను అత్యంత గొప్పగా నిర్వహిస్తారు. ఆయనకు ప్రత్యేకమైన మంగళవారం, శనివారాల్లో తమలపాకులతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఆంజనేయుడికి తమలపాకులకు ఉన్న అనుబంధమేంటి ? తమలపాకులతోనే ఎందుకు హనుమంతుడిని ఎక్కువగా పూజిస్తారు ? తమలపాకులతో పూజిస్తే పొందే ప్రయోజనాలేంటి ?

మనలో ఉత్తేజాన్ని నింపే ఆంజనేయుడి గొప్ప లక్షణాలు మనలో ఉత్తేజాన్ని నింపే ఆంజనేయుడి గొప్ప లక్షణాలు

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం ఉంది. ఒకసారి సీతమ్మ అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని దగ్గరకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ''స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడట. అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుందని వివరించారు. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పగానే.. ఆంజనేయుడు ఒళ్లంతా తమలపాకులు కట్టుకుని రాముడి దగ్గరకు వచ్చాడట.

బ్రహ్మచారైన హనుమంతుడికి పుత్రుడున్నాడా? బ్రహ్మచారైన హనుమంతుడికి పుత్రుడున్నాడా?

మరో కథ ప్రకారం.. అశోకవనంలో ఉన్న సీతమ్మకి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట. అప్పుడు హనుమంతుడు చాలా సంతోషపడ్డారని ప్రతీతి. అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే చాలా ఇష్టమని.. భక్తులు కూడా సమర్పిస్తారు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల పొందే ఫలితాలేంటో చూద్దాం..

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

ఇంట్లో దుష్టశక్తులున్నాయని, చెడు చేశారని భావించేవాళ్లు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే కీడు తొలగిపోతుంది.

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఏ కార్యం మొదలుపెట్టినా శుభాలే కలుగుతాయి. విజయం సిద్ధిస్తుంది.

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

సమాజంలో గౌరవం లేకుండా.. అందరూ హీనంగా చూసే వ్యక్తి.. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారం సమర్పిస్తే.. మంచి గుర్తింపు లభించి.. గౌరవించబడతారు.

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారు.

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

తమలపాకుల హారం హనుమంతుడికి సమర్పిస్తే.. భార్య భర్తల మధ్య సమస్యలు తొలగిపోయి.. సీతారాముల లాగా అన్యోన్యంగా ఉంటారు.

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

వ్యాపారంలో నష్టాలు వస్తుంటే.. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పించాలి. తర్వాత పండ్లు, ఆకులు దానం చేస్తే వ్యాపారంలో పురోగతి సాధిస్తారు.

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

కొంతమంది పిల్లలు చాలా బక్క పలుచగా, సన్నగా ఉంటారు. త్వరగా నీరసించిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లు స్వామికి తమలపాకుల హారం సమర్పిస్తే మంచిది.

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

ఆంజనేయస్వామిని ఎందుకు తమలపాకులతో పూజిస్తారు ?

అరటితోటలో హనుమంతుడిని పూజ చేస్తే కోటిరెట్ట ఫలితం దగ్గుతుందట.

English summary

Why We Worship Hanuman With Betel Leaves ?

Why We Worship Hanuman With Betel Leaves ? Sri Hanuman conveyed the message from Sri Rama, Sita Devi garlanded Sri Hanuman with betel leaves as a token of her joy and appreciation, as she could not find any flowers nearby.
Story first published: Monday, February 22, 2016, 17:55 [IST]
Desktop Bottom Promotion