For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ జనవరిలో వచ్చే సూర్య గ్రహణం వలన ప్రభావితమయ్యే ప్రధాన రాశి చక్రాలు ఇవే!

|

ఈ జనవరిలో సూర్యగ్రహణం మొదటి వారంలోనే రానుంది. అదేవిధంగా ఈ సూర్య గ్రహణం కొన్ని ప్రత్యేకమైన రాశి చక్రాల మీద గణనీయమైన ప్రభావాలను కూడా చూపనుంది. ఇటువంటి గ్రహణాలు ఈ సంవత్సరం పొడవునా గమనించినప్పుడు, 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలుగా ఉండనున్నాయి.

వీటిలో మొట్టమొదటి గ్రహణంగా వచ్చే ఈ పాక్షిక సూర్య గ్రహణం, మకర రాశిలో వస్తుంది. మరియు చైనా, కొరియా, జపాన్, ఉత్తర పసిఫిక్ మహా సముద్రం మరియు అలాస్కాలోని అలియుటియన్ ద్వీపాల వంటి ప్రదేశాలలో ఈ గ్రహణాన్ని వీక్షించే వెసులుబాటు ఉంది.. ఈ గ్రహణం 2019 జనవరి 6వ తేదీన ఉదయం 4.08 కి ప్రారంభమై, 9.18 వరకు కొనసాగనుంది. ఇక్కడ జనవరి 6వ తేదీన వచ్చే సూర్య గ్రహణం ద్వారా ప్రభావితమయ్యే రాశి చక్రాల గురించిన వివరాలు ఇక్కడ పొందుపరచబడినవి.

సూర్య గ్రహణం వలన ప్రభావితమయ్యే ప్రధాన రాశి చక్రాలు

మేష రాశి :

మేష రాశి :

మీ నాయకత్వ లక్షణాలు ఎల్లవేళలా మీ బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేయడంలో సహాయకంగా ఉంటాయి. మరియు మీరు ఇష్టపడే మీ లక్షణాలలో ఇది ప్రధమంగా ఉంటుంది. ఈ సూర్య గ్రహణం వలన ఏర్పడే ప్రతికూలతల ఆధారంగా, మీకు అదనపు బాధ్యతలు కలిగే సూచనలు ఉన్నాయి.

ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో అటువంటి బాధ్యతలను ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ ప్రతిదీ ఎదుర్కోవాలని నియమమేమీ లేదు, వేచి చూడండి. మీ ఉన్నత లక్ష్యాలతో సర్దుబాటు అయ్యే ప్రతి బాధ్యతను స్వీకరించండి. వేసే ప్రతి అడుగులోనూ ఆచితూచి వ్యవహరించండి.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

గ్రహణం అనేది కొన్ని రాశుల మీద ప్రత్యేకించి ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తుంటుంది. క్రమంగా ఆ రాశి చక్రాలకు సంబంధించిన వారు, లేదా వారి భాగస్వాముల దృష్ట్యా సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి.

Most Read : రోగాల బారినపడకుండా పెద్దవాళ్లంతా ఈ టీకాలు వేయించుకోవాలి, వయస్సు పెరిగే కొద్దీ టీకాలే అవసరం

ఒక్కోసారి భాగస్వామితో సమన్వయ లోపాల పరంగా అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే, ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తే, సకాలంలో సమస్యలను గుర్తించి, త్వరలోనే వాటిని పరిష్కరించవచ్చు. మీరు ఇతరులతో వ్యవహరించే ముందు పూర్తి అవగాహనతో ప్రయత్నించండి. చివరికి విజయం మీదే.

తులా రాశి :

తులా రాశి :

మీరు మీ విలువలపై పునరాలోచన చేయాలనుకుంటున్న సమయంలో, వాటికి అవరోధాలుగా కొన్ని పరిస్థితులు తలెత్తనున్నాయి. ఇది మీ వ్యక్తిత్వాన్ని సైతం ప్రశ్నార్ధకం చేసే పరిస్థితిగా మారవచ్చు. క్రమంగా కొన్ని పరిస్థితులు మానసిక గందరగోళానికి దారితీస్తాయి. అన్నిటా కోపావేశాలను పక్కన పెట్టి, విచక్షణతో కూడిన నిర్ణయాలపై దృష్టిసారించండి. మీ అంతరాత్మతో చర్చించిన అనంతరమే ఎటువంటి నిర్ణయమైనా తీసుకోండి. పరిస్థితులు అన్ని వేళలా అనుకూలంగా ఉండవు. కానీ, మీ ఆలోచనా శక్తి మాత్రమే మార్గనిర్దేశం చేస్తుంది. అనూహ్య ప్రయాణాలు తలభారాన్ని కలిగించవచ్చు.

మకర రాశి :

మకర రాశి :

సూర్య గ్రహణ ప్రభావిత రాశులలో మకర రాశి వారి జీవితంలో ప్రతికూల శక్తుల ప్రవాహం అధికంగా ఉంటుంది. వాస్తవానికి మీరు అధిక శ్రద్ధకు కేంద్రంగా ఉంటారు. అంతేకాకుండా మీ తెలివితేటలు, విశ్వసనీయత, కార్యదక్షత మీకున్న ఉత్తమ లక్షణాలుగా ఉంటాయి.

కానీ గ్రహణ ప్రభావం వలన కొంత మానసిక గందరగోళానికి గురవుతున్న నేపధ్యంలో కొన్ని విషయాలనందు ఆచితూచి అడుగులు వేయవలసిన పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు కొన్ని అనాలోచితంగా దొర్లే మాటలు మీకు సమస్యలను తీసుకుని రావొచ్చు. కావున కాస్త తెలివితో వ్యవహరించడం మంచిదని గుర్తుంచుకోండి. వీలైనంతవరకు తక్కువ మాట్లాడేలా ప్రయత్నించండి. ఈ విషయంలో మీ సన్నిహితులు సహాయం తీసుకోండి.

సూర్య గ్రహణం

సూర్య గ్రహణం

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Most Read : నన్ను నమ్మించి చివరకు మరో అమ్మాయితో కులికాడు, చివరకు రోడ్డున పడ్డాడు, ఆడవారిని మోసం చేస్తే పోతారు

English summary

Zodiac Signs the January Solar Eclipse Will Affect the Most

Zodiac Signs The January 2019 Solar Eclipse Will Affect The Most
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more