For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020 గౌరీ పండుగ : గణేష్ చతుర్థికి ముందు జరుపుకొనే గౌరీ పూజకు సంబంధించిన కొన్ని ఆచారాలు

గౌరీ పూజ జరుపుకోవడానికి సంబంధించి కొన్ని ఆచారాలు

|

గౌరీ పూజ ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, దక్షిణ కర్ణాటక ప్రాంతాలలో ప్రత్యేకంగా జరుపుకునే ఒక ప్రధానమైన పండుగ. భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో ఈ పండుగను హర్తాలిక అని పిలుస్తారు. ఈ గౌరీ హబ్బాను గణేశ చతుర్ధి పూజకు ఒకరోజు ముందు జరుపుకుంటారు. ఈ గౌరీ దేవిని సుబ్రహ్మణ్య (కార్తికేయ), వినాయకుడి తల్లయిన పార్వతిగా భావిస్తారు. హబ్బ అంటే కన్నడ లో పండుగ అని అర్ధం.

గౌరీ హబ్బ రోజు, గౌరీ దేవిని ఎంతో భక్తితో పూజిస్తారు. ఈ గౌరీ దేవి శక్తికి మూలమైన ఆది శక్తికి ప్రతిరూపంగా భావిస్తారు. ఎవరైతే ఈ గౌరీ దేవిని ఎంతో భక్తితో, నమ్మకంతో పూజిస్తారో, వారికి ఆ దేవత అపారమైన ధైర్యాన్ని, శక్తిని ప్రసాదిస్తుందని చెప్తారు.

ఈ దేవతను శాంతింప చేయడానికి ప్రత్యెక పండుగ అయిన గౌరీ హబ్బ రోజు స్వర్ణ గౌరీ వ్రతం నిర్వహిస్తారు. ఈ పండుగకు సంబంధించిన కొన్ని ఆచారాలను కొన్నిటిని చూద్దాం:

Rituals Associated With Gowri pooja

1. మొట్టమొదట గౌరీ పండుగకు ముందు రోజు గౌరీ దేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తారు. ఈ సమయంలో గౌరీ దేవి వారి తండ్రి ఇంటికి వచ్చినట్టుగా నమ్ముతారు. అందువల్ల, ప్రతి ఇల్లు గొప్ప భక్తితో, ఉత్సుకతతో ఆమెను ఆహ్వానిస్తారు.

2. గౌరీ పండుగ రోజు, స్త్రీలు వారి సాంప్రదాయ దుస్తులను ధరించి పసుపుతో 'జలగౌరి’ లేదా 'అరిశినాదగౌరి’ ని తయారుచేస్తారు. తరువాత మంత్రాలూ జపించి దేవతను ఆవాహనం చేస్తారు.

3. తరువాత ఆ దేవత విగ్రహాన్ని ఒక పళ్ళెంలో బియ్యపు రాసి లేదా ధాన్య౦పై ఉంచుతారు.

4. ఈ పూజను ఎంతో పరిశుభ్రతతో, భక్తితో నిర్వహిస్తారు.

5. ఈ విగ్రహం చుట్టూ మావిడి ఆకులతో, అరటి కొమ్మలతో ఒక 'మండపం’ లేదా పందిరిని నిర్మిస్తారు. ఈ విగ్రహాన్ని అందమైన పూల మాలలతో, దుస్తులతో అలంకరిస్తారు.

6. స్త్రీలు ఈ దేవత ఆశీర్వాదానికి గుర్తుగా 'గురిదార’ అనే పదహారు ముడులతో కూడిన ఒక కంకణాన్ని చేతికి ధరిస్తారు.

7. ఈ వ్రతంలో భాగంగా, 'బాగిన’ ను తయారుచేస్తారు. పసుపు, కుంకుమ, నలుపు గాజులు, నల్లపూసలు, ఒక దువ్వెన, ఒక చిన్న అద్దం, కొబ్బరికాయ, జాకెట్టు, పప్పుధాన్యాలు, బియ్యం, కాయగూరలు, గోధుమ, బెల్లం వంటి వివిధ వస్తువుల సముదాయాన్ని బాగిన అంటారు. ఈ వ్రతంలో ఐదు బాగినాలను తయారుచేస్తారు.

8. ఒక బాగినను అమ్మవారికి సమర్పిస్తారు, మిగిలిన బాగినలను ముత్తైదువులకు పంచుతారు.

9. తరువాత ఈ దేవతకు హోలిగే లేదా ఓబ్బట్టు, పాయసం వంటి తీపి పదార్ధాలను సమర్పిస్తారు.

ఈ గౌరీ పండుగ తరువాతి రోజు వినాయకుడిని ఇంటికి తెచ్చి పూజిస్తారు. ఈ ఉత్సవాన్ని11 రోజులు నిర్వహిస్తారు, చివరిరోజు అన్ని విగ్రహాలను నీటిలో కలుపుతారు.

English summary

Rituals Associated With Gowri pooja

Gowri Puja is an important festival celebrated especially in the South Karnataka area, Andhra Pradesh and Tamil Nadu. In the Northern parts of India, this festival is known as Hartalika.Gowri Puja is an important festival celebrated especially in the South Karnataka area, Andhra Pradesh and Tamil Nadu.
Desktop Bottom Promotion