For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంత రుద్దినా మీ ముఖంపై జిడ్డు పోవట్లేదా? అందుకు గల కారణాలేంటో తెలుసా....

మన ముఖం మీది చర్మం అత్యంత సున్నితంగా ఉంటుంది., క్రమంగా అతి త్వరలోనే ఈ రసాయనాలు చర్మంపై ప్రభావాలను చూపిస్తుంటాయి. కావున ముఖం మీది చర్మంపై సబ్బును ఉపయోగించే హానికర ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

|

మనలో అనేకమంది, సబ్బులు చర్మానికి చేసే హానికర ప్రభావాల గురించిన సరైన అవగాహన లేకుండానే వినియోగిస్తూ ఉంటారు. ఆశ్చర్యకరంగా, సబ్బులను తరచూ ఉపయోగించడం మూలంగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, మరియు ఇతర చికాకులకు కూడా దారితీయవచ్చు.

7 Reasons Why You Should Not Use Soap On Your Face

సబ్బు ముఖానికి హానికరం ఎందుకు ? సబ్బులలో అత్యంత హానికరం అయిన సోడియం లారిల్ సల్ఫేట్ అనే రసాయనాన్ని కలిగి ఉంటుంది. దీనితో పాటుగా కాస్టిక్ సోడా, కృత్రిమ సువాసనలు, కృత్రిమ సంరక్షణకారులను (ప్రిసర్వేటివ్స్) మొదలైన ఇతర రసాయనాలను కూడా కలిగి ఉంటుంది. అవి మరింత నష్టం కలిగించవచ్చు.

మన ముఖం మీది చర్మం అత్యంత సున్నితంగా ఉంటుంది., క్రమంగా అతి త్వరలోనే ఈ రసాయనాలు చర్మంపై ప్రభావాలను చూపిస్తుంటాయి. కావున ముఖం మీది చర్మంపై సబ్బును ఉపయోగించే హానికర ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

ఈవ్యాసంలో ముఖం మీద సబ్బును ఎందుకు ఉపయోగించకూడదు అనడానికి గల కారణాలను మీకు తెలియజేయబోతున్నాము.

చర్మం మీద సోప్ వినియోగించకూడదు అనడానికి గల 7 ప్రధాన కారణాలు :

7 Reasons Why You Should Not Use Soap On Your Face


1. చర్మాన్ని దెబ్బతీస్తుంది :

సబ్బు హానికరమైన రసాయనాలతో నిండి ఉన్న కారణాన, చర్మానికి అత్యంత హానికరంగా ఉంటుందని చెప్పబడింది. ముఖం మీది చర్మం, అత్యంత సున్నితంగా మరియు నునుపుగా ఉన్న కారణాన, ఈ హానికర కారకాలు అత్యంత తీవ్రమైన ప్రభావాలను చూపగలవు. తరచుగా సబ్బు వినియోగం కారణంగా చర్మం మీద ఉండే సహజ సిద్దమైన నూనెలు తొలగిపోయి, నిర్జీవాన్ని సంతరించుకుంటుంది.

7 Reasons Why You Should Not Use Soap On Your Face

2. డ్రై స్కిన్ (పొడిబారిన చర్మానికి) దారితీస్తుంది :

మీ ముఖం మీద సబ్బును ఉపయోగించడం చర్మాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది కానీ అనేక రకాల దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. సబ్బులో ఉండే కాస్టిక్ యాసిడ్ చర్మంపై ఉత్పత్తి అయ్యే సహజ నూనెలను తొలగిస్తుంది. ఇది మీ చర్మం మందంగా మరియు పొడిబారినట్లు కనపడడానికి కారణంగా ఉంటుంది. అంతేకాకుండా, తరచుగా వినియోగించడం మూలంగా మీ చర్మంపై ముడుతలకు దారి తీస్తుంది.

7 Reasons Why You Should Not Use Soap On Your Face

3. చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది :

బార్ సబ్బులు తరచుగా ఉపయోగించడం మూలాన, చర్మంపై ఉండే సహజ సిద్దమైన లిపిడ్లు కరిగిపోవడం జరుగుతుంటుంది. వాస్తవానికి ఈ సహజ సిద్దమైన లిపిడ్లు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారినుండి కాపాడుతుంది. ఈ లిపిడ్ల నష్టం, చర్మంపై బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్లను అదుపు చేయలేకపోవడానికి కారణంగా మారుతుంది. ఇది చర్మం యొక్క రోగ నిరోధకతను ప్రభావితం చేస్తుంది.

7 Reasons Why You Should Not Use Soap On Your Face

4. చర్మం యొక్క pH సంతులనం :

కొన్ని సబ్బులు చర్మపు ఉపరితలం యొక్క pH సంతులనానికి భంగం వాటిల్లేలా చేస్తాయి. తద్వారా అది మరింత ఆల్కలీన్ అవుతుంది. చర్మం యొక్క pH సంతులనం బాక్టీరియా మరియు అంటురోగాల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మం పొడిబారకుండా కాపాడడంతో పాటు, చర్మాన్ని ఆరోగ్యకరంగా సున్నితంగా ఉంచేలా సహాయపడుతుంది. బార్ సబ్బులతో పోలిస్తే, లిక్విడ్ బాడీ వాష్లు మరింత ఆమ్ల తత్వాలను కలిగి ఉండి, చర్మం యొక్క pH బ్యాలెన్స్ను అధిక స్థాయిలో ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి.

7 Reasons Why You Should Not Use Soap On Your Face

5. చర్మ రంధ్రాలకు అవరోధంగా ఉంటుంది :

సబ్బులను తరచుగా వినియోగించడం కారణంగా, చర్మం ఉపరితలంపై రంధ్రాలను నిరోధించటానికి దారితీస్తుంది. అత్యధికంగా బార్ సబ్బులలోని కొవ్వు ఆమ్లాలు, రంధ్రాలలో పేరుకుని పోవడం మూలాన, చివరకు బ్లాక్హెడ్స్, బ్రేక్ అవుట్స్, ఇన్ఫెక్షన్లు మొదలైన వివిధ చర్మ సమస్యలకు దారితీస్తుంది.

7 Reasons Why You Should Not Use Soap On Your Face

6. చర్మం నుండి విటమిన్లను తొలగిస్తుంది :

సోప్ బార్ల మితిమీరిన ఉపయోగం చర్మంలోని అవసరమైన విటమిన్లను తొలగిస్తుంది. విటమిన్లు చర్మాన్ని తాజాగా మరియు ఆరోగ్యంగా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. మీ చర్మం మీది విటమిన్ D , సూర్య కాంతి మూలంగా సహజ సిద్దంగా ఉత్పన్నమవుతుంది. కాని సోప్స్ అధిక వాడకం వలన, కఠినమైన రసాయనాల కారణంగా ఈ విటమిన్లు తొలగిపోతుంటాయి. ఆరోగ్యకరమైన చర్మానికి విటమిన్ D అవసరంగా ఉంటుంది.

7 Reasons Why You Should Not Use Soap On Your Face

7. మంచి సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది :

బాక్టీరియా రెండు రకాలుగా ఉంటాయి, మంచి మరియు చెడు. వివిధ రకాల చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడే చర్మ ఉపరితలంపై ఉండే మంచి బ్యాక్టీరియా సోప్స్ అధిక వాడకం మూలాన తొలగిపోతుంటుంది. క్రమంగా చర్మం మీద బ్రేకౌట్లకు కారణంగా మారుతుంది. ముఖం మీద సబ్బును ఉపయోగించడం వలన కలిగే దుష్ప్రభావాల గురించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు కదా, ఇక నిర్ణయం మీదే.

7 Reasons Why You Should Not Use Soap On Your Face

సబ్బులను ఎంచుకునే విధానం :

అంతేకాకుండా సోప్ TFM స్థాయిల ఆధారితంగా గ్రేడ్లు విభజించబడి ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3 లుగా. కావున, సోప్స్ అనుసరించేటప్పుడు, వాటి లేబుళ్ల మీద ఉండే గ్రేడ్స్ చూసుకుని అనుసరించడం కూడా ఉత్తమంగా ఉంటుంది. ప్రకటనలను చూసి, సువాసనలను చూసి మోసపోకుండా, ఆ సబ్బులోని రసాయనాలను, గ్రేడ్లను చూసి నిర్ధారించుకోవడం ఉత్తమం. ఫేస్ వాష్, లిక్విడ్ బాడీ వాష్, సోప్స్ ఏవైనా సరే, రసాయనాలు తక్కువ ఉండేలా చూసుకోవడం మన ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో.

చిన్నపిల్లల చర్మ తత్వాలు, పెద్దవారితో పోల్చినప్పుడు మరింత సున్నితంగా ఉంటాయని మరువకండి. ఏ సబ్బులు కూడా అందరికీ సరిపోతాయి అని ఎక్కడా ఉండదు. ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుంది. ఒక్కోసారి ప్రదేశాలను, నీళ్ళ యొక్క ph విలువలను దృష్టిలో ఉంచుకుని సబ్బులను అనుసరించవలసి ఉంటుంది. కావున, వీలైనంత వరకు రసాయనాలకు దూరంగా ఉండేలా, క్రమంగా ముఖానికి సబ్బుల వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

7 Reasons why you should not use soap on your face

7 Reasons Why You Should Not Use Soap On Your Face
Desktop Bottom Promotion