For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూర్యకిరణాలు చర్మం పై పడితే..?

|

Vitamin D from the Sun
శరీరంలోని ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం అవసరం. కాల్షియం శరీరం గ్రహించడానికి విటమిన్-డి దోహదపడుతుంది. సూర్యరశ్మిలోని యూవీ కిరణాలు (అల్ట్రా వైలెట్ రేస్ ) సోకడం వలన చర్మంలో విటమిన్-డి తయారవుతుంది. సూర్యరశ్మిని నిరోధించే చర్మ సౌందర్య ఉత్పత్తులతో విటమిన్ -డి లోపం ఏర్పడుతుంది. రోజువారిగా విటమిన్-డి అన్ని వయస్సుల వారికి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్-డి నారింజ పండ్లు రంస, సాలమన్, మాకెరెల్, ట్యూనా చేపలు, పాలు, పాలు సంబంధిత ఉత్పత్తుల్లో లభిస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 100 మిల్లీ లీటర్ల నారింజ పండ్ల రసంలో 143 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్), మిల్క్ షేక్ లో 140 ఐయా(ఇంటర్నేషనల్ యూనిట్స్), పాలలో 98 ఐయూ, పన్నీర్ లో 140 గ్రాముల ఐయూ విటమిన్ -డి లభిస్తుంది.

వారంలో మూడు సార్లు10 నుంచి 15 నిమిషాల పాటు సూర్య రశ్మి ముఖం, భుజాలు, చేతులు, వీపుకు సోకడం విటమిన్ -డి తయారీకి అత్యవసరం. కాబట్టి శీతాకాలంలో జబ్బుల బారినపడకుండా ఉండాలంటే విటమిన్ -డి అత్యవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Vitamin D from the Sun | సూర్యకిరణాలు చర్మం పై పడితే..?

We all know about the dangers of not protecting our skin from the sun. They range from cosmetic, such as sun spots and early aging signs such as wrinkles and fine lines to life-threatening skin cancers. But the sun isn't actually an enemy. The sun is the best source of Vitamin D, which our body needs to function properly. When your Vitamin D levels are low, you run into many symptoms, which definitely can effect your day.
 
Story first published:Monday, December 5, 2011, 11:47 [IST]
Desktop Bottom Promotion