For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లగా మారిన పెదాలను అందంగా మార్చుకోవడం ఎలా?

|

సాధారణంగా కొంత మంది పుడుతూనే అందంగా పుడుతారు. కొంత మంది ఏదో ఒక లోపంతో పుడుతుంటారు. కొంత మందిలో పుట్టుకతోనే పెదా చుట్టూ నల్లగా ఉంటుంది. మరి కొంత మందికేమో వారి జీవనశైలిలో మార్పుల వల్ల పెదాల చుట్టు నల్లగా మారే అవకాశం ఉంటుంది. జీవశైలిలో మార్పులు అనగా, పెదాలు, మరియు పెదాల చుట్టూ నల్లగా మారడానికి ప్రధాన కారణం స్మోకింగ్(సిగరెట్ తాగడం)చేయడం. కాబట్టి, నల్లగా మారిన పెదవులు ఉండటం చాలా మందికి ఇష్టం ఉండదు. అటువంటి వారు, పెదాలు గులాబీ వర్ణంలో ఉండాలని కోరుకునే వారు, వెంటనే సిగరెట్ తాగడం మానేయడానికి ఇది ఒక మంచి సమయం.

ముఖ చర్మం, అలాగే పెదాలు నల్లగా మారడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. కఠినమైన సూర్యకిరణాలు శరీరం మీద ఎక్స్పోషర్ కావడమే. దీన్ని నివారించాలంటే ఎల్లప్పుడూ spf రక్షణ కలిగిన లిప్ బామ్ ను పెదాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. నల్లగా మారిన పెదాలను, కలర్ ఫుల్ గా కలిపించేలా చేసే వాటిలో లిప్ స్టిక్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ దీన్ని దీర్ఘ కాలం ఉపయోగించడం వల్ల పెదవులు నల్లగా మార్చేస్తుంది. సూర్యరశ్మితో పాటు, పెదవుల మీద సైరన శ్రద్ద వహించకపోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పెదాలు, చర్మం పొడి బారడం మరియు పెదాలు పగలడం, చీలడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మరి మీ పెదాల చుట్టు ఆ నలుపుదనం పోగొట్టుకోవాలంటే ఇక్కడ కొన్ని పద్దతులున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..

Lips

1. గ్లిజరిన్: పత్తిని తీసుకొని ఉండగా చుట్టి గ్లిజరిల్ లో డిప్ చేసి, మీ పెదాల మీద, పెదాల చుట్టూ అప్లై చేయాలి. ఇది ఆ ప్రదేశం మొత్తం హైడ్రేషన్ లో ఉంచి, మంచి మాయిశ్చరైజర్ లా ఉపయోగపడుతుంది. అంతే కాదు, ఇది పెదాల చుట్టూ నలుపుదనాన్ని తగ్గిస్తుంది మరియు ఇది నలుపుదాన్ని హైడ్ చేయడానికి బాగా సహాయపడుతుంది.

2. అరటి ప్యాక్: అరటి పండు, పెరుగు, తేనె మూడింటిని ఒక గిన్నెలో వేసి, బాగా మిక్స్ చేయాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని పెదాల మీద మరియు పెదాల చుట్టూ అప్లై చేసి,15-20నిముషాల అలాగే ఉంచాలి. 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసి, మార్పును గమనించండి. డార్క్ గా ఉన్న చర్మం షేడ్ అయినట్లు కనబడుతుంది. నల్ల మారిన చర్మం లేదా పెదాల నలుపు దనాన్ని తగ్గించుకోవడానికి ఈ ప్యాక్ ను రెగ్యులర్ గా ఉపయోగించుకోవచ్చు.

3. కన్సీలర్: పెదాల చుట్టు నలుపుదనాన్ని దాచేయడానికి మరో గొప్ప మార్గం, కొద్దిగా కన్సీలర్ ను అప్లే చేయడమే. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరియు ఇది మీ స్కిన్ టోన్ కు తగ్గవిధంగా సరిపోల్చుతుంది.

4. నిమ్మరసం: నిమ్మరసంలోని అసిడిక్ లక్షణాల వల్ల నిమ్మరసం చాలా అద్భుతమైన బ్లీచింగ్ గా ఉపయోగపడుతుంది. స్కిన్ షేడ్ ను మార్చుకోవాలంటే దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడమే. పెదాల చుట్టూ ఉన్న నలుపుదనాన్ని, డార్క్ పిగ్మెంటేషన్ ను తగ్గించుకోవాలంటే రెగ్యులర్ గా నిమ్మరసం అప్లై చేయాల్సిందే. దీన్ని దీర్ఘకాలం ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మరియు నలుపుదనాన్ని తగ్గించడంలో చాలా సులభతరం చేస్తుంది.

5. పసుపు మరియు పెసరపిండి: పసుపు, మరియు పెసరపిండి, పాలు కలిపి మెత్తగా పేస్ట్ లా చేసి, పెదాల చుట్టూ అప్లై చేయడం వల్ల ఇది స్కిన్ టోన్ ను మార్చుతుంది. మరియు డార్క్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది . ఈ పేస్ట్ ను రెగ్యులర్ గా పెదాల చుట్టూ అప్లై చేయడం వల్ల పెదాల చుట్టు ఉండే నలుపు క్రమంగా తగ్గిపోతుంది.

6. బాదాం : పెదాల చుట్టూ ఉన్న, డార్క్ స్కిన్ ను లైట్ గా మార్చే గుణం, బాదాంలో పుష్కలంగా ఉంది. బాదాం నూనెను నల్లగా మారిన పెదాలు, పెదాల చుట్టూ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే బాదం 4-6తీసుకొని పాలల్లో వేసి, రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం వీటిని అలాగే పేస్ట్ లా తయారు చేసి నల్లగా మారిన పెదాలు, పెదాల చుట్టూ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ హోం రెమడీని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ స్కిన్ టోన్ లో చాలా మార్పు వస్తుంది.

English summary

Ways To Hide Darkness Around Lips

Some women are born with a dark patch around their lips and others acquire dark patches around their lips due to the lifestyle choices they make or practices they follow. One of the main reasons for getting darkness around lips is smoking.
Desktop Bottom Promotion