For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మఛాయను కాంతివంత చేసే టాప్ 10 బాడీ స్ర్కబ్స్

|

బాడీ స్ర్కబ్ అంటానే గ్లోయింగ్ స్కిన్ అనేవిషయం గుర్తుకు రావాలి. ఎందుకంటే బాడీ స్ర్కబ్ తో మన శరీరం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, చర్మం కాంతివంతంగా మరియు క్లియర్ గా కనబడుతుంది. బాడీ స్క్రబ్ కోసం మార్కెట్లో కమర్సియల్ గా లేదా రసాయనికంగా ఉత్పత్తి అయిన బాడీ స్ర్కబ్స్ కాకుండా, తాజాగా మనం ఇంట్లో తయారుచేసుకొనే బాడీ స్ర్కబ్స్ మన చర్మానికి చాలా తాజాగా మరియు ఫ్రెష్ గా మరియు యవ్వంగా ఉంచుతుంది.

స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. మీరు బ్రాండ్ ప్రొడక్ట్స్ కు పోకుండా, ఇంట్లో తాజాగా అందుబాటులో ఉండే బెస్ట్ హోం మేడ్ బాడీ స్ర్కబ్స్ ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందుకు చాలా సింపుల్ మరియు బాడీ స్ర్కబ్స్ చాలా ఉన్నాయి. మన ఇంట్లో అందుబాటులో ఉండే ఈ బేసిక్ పదార్థాలతోనే మన చర్మం యొక్క రంగును మార్చుకోవచ్చు. చర్మాన్ని కాంతివంతంగా మార్చవచ్చు.

చర్మం యొక్క ఒక నిజమైన ఆకర్షణ ఎలా అంటే ఇంట్లో ఉండే బాడీ స్ర్కబ్బింగ్ పదార్థాలన్ని నేచురల్ గా మనకు లభించినవి, ఇవి చర్మానికి ఎటువంటి ప్రభావాన్ని చూపవు. కాబట్టి, మీ చర్మం కమిలిందనో లేదా సన్ టాన్ కు గురైందనో, చర్మం నల్లబడుతోందనో చింతించక, మీ వర్రీస్ అన్నీ కట్టి పెట్టి, ఈ నేచురల్ బాడీ స్ర్కబ్స్ ను ఉపయోగించి ఫలితాన్ని చూడండి...

షుగర్ అండ్ బాడీ వాష్:

షుగర్ అండ్ బాడీ వాష్:

ఇది ఒక ఉత్తమ బాడీ స్ర్కబ్. మీరు ఎక్కువ ప్రయాణం చేసి, మీ చర్మం కాంతివిహీనంగా మారిందా? అటువంటప్పుడు ఈ షుగర్ స్ర్కబ్ చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. పంచదారను బాడీవాష్ తో మిక్స్ చేసి బాడీస్ర్కబ్ లా శరీరం మొత్తం పట్టించి పది-పదిహేను నిముషాల తర్వాత స్నానం చేయాలి.

తేనె-బాదం స్ర్కబ్:

తేనె-బాదం స్ర్కబ్:

మీ అంతట మీరు చర్మం ఛాయను మెరుగుపరుచుకోవాలిన చూస్తుంటే? మీ చర్మానికి ఇంట్లోనే చికిత్సను అంధించండి. తేనెకు కొద్దిగా పంచదార మిక్స్ చేసి, దానికి బాదంపొడిని కూడా చేర్చి శరీరాన్ని పట్టించి స్నానం చేస్తే చాలా ఉత్తమ ఫలితాలను అంధిస్తుంది.

ఓట్ మీల్ స్ర్కబ్:

ఓట్ మీల్ స్ర్కబ్:

ఒది ఒక ఉత్తమ బాడీ స్ర్కబ్. దీన్ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు . ఓట్ మీల్ ను పొడి చేసుకొని, అందులో మీరు రెగ్యులర్ గా ఉపయోగించే నూనెను వేసి బాడీ స్ర్కబ్ గా ఉపయోగించాలి. చమోమోలిన్ మరియు రోజ్ ఉడ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల దురదపెట్టే చర్మం లేదా డ్రైస్కిన్ నుండి ఉత్తమ ఫలితాలను పొందివచ్చు.

మసాలాలు-షుగర్ స్ర్కబ్:

మసాలాలు-షుగర్ స్ర్కబ్:

ఇది మరొక హో రెమెడీ బాడీ స్ర్కబ్ . కొంచెం పంచదారను, లవంగాలను పొడి, ఎండిన రోజాపువ్వు రేకులు మిక్స్ లో వేసి పౌడర్ చేసుకొని, అలాగే కొందిగా ఆరెంజ్ గుజ్జును కూడా మిక్స్ చేసి శరీరానికి పట్టించాలి. దీన్ని చర్మాన్నికి పట్టించి స్నానం చేస్తే చాలా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

సిట్రస్ ఫ్రూట్ స్ర్కబ్:

సిట్రస్ ఫ్రూట్ స్ర్కబ్:

వ్యాయమం లేదా జిమ్ తర్వాత రిఫ్రెష్ అవ్వడానికి ఎక్కువగా ఇటువంటి స్ర్కబ్స్ సహాయపడుతాయి. ఇది చర్మానికి కూల్ చేసి రిఫ్రెష్ చేస్తుంది. లెమన్ లేదా సిట్రస్ ఫ్రూట్స్ యొక్క రసానికి కొద్దిగా సీసాల్ట్ మిక్స్ చేసి, దీన్ని మీ చర్మానికి మర్దన చేసి 20నిముషాల తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

లావెండర్ సాల్ట్ స్ర్కబ్:

లావెండర్ సాల్ట్ స్ర్కబ్:

లావెండర్ మరియు సాల్ట్ ఒక ఉత్తమ హోం మేడ్ బాడీ స్ర్కవ్. ఇది మీ చర్మాన్ని పొడి బారిన, పొలుసుగా ఉన్న చర్మాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా ఇది డ్రై స్కిన్ కలవారికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కొబ్బరి నూనె మరియు వెనీలా:

కొబ్బరి నూనె మరియు వెనీలా:

కొబ్బరినూనె కొన్ని అద్భుతాలనే చేస్తుంది. కొబ్బరి నూనెకు కొద్దిగా వెనీలా మరియు బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి, శరీరం మొత్తానికి పట్టించి తర్వాత స్నానం చేస్తే మేలవుతుంది.

టమోటో స్ర్కబ్:

టమోటో స్ర్కబ్:

ప్రతి ఒక్కరి ఇల్లలోనూ టమోటోలు స్టాక్ ఉంటాయి. ఇవి రెడ్ కలర్ లో ఫ్రెష్ గా ఉంటాయి? అటువంటి టమోటోలో చర్మకాంతిని పెంచడంలో, మొటిమలు, మచ్చలు నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి

నిమ్మ, ఉప్పు మరియు రోజ్మెరీ:

నిమ్మ, ఉప్పు మరియు రోజ్మెరీ:

మనందరికి కూడా సహజంగా లభించే హెర్బ్స్ అంటే ఇష్టమే కదా మరియు మన వంటల్లో ఉపయోగించే మసాలా. అయితే ఈ రెండింటి కాంబినేషనలో చర్మానికి ఉపయోగిస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ మూడింటిని మిక్స్ చేసి, చర్మానికి పట్టించాలి.

బనానా మరియు షుగర్ స్ర్కబ్:

బనానా మరియు షుగర్ స్ర్కబ్:

బాగా పండిన అరటిపండుకు, కొద్దిగా పంచదారను చేర్చి, బాగా మిక్స్ చేసి, పంచదార స్పటికలుగా ఉన్నప్పుడే, బాడీకి మసాజ్ చేసి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

10 Best Homemade Body Scrubs

It is a myth that only the rich can afford those body scrubs that leave your skin glowing like an infant’s. Cosmetic companies charge ridiculous amounts for a simple scrub. Have you ever thought of making a scrub that can beat any of these commercially available products?
Story first published: Monday, March 10, 2014, 16:30 [IST]
Desktop Bottom Promotion