For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ అందాన్ని రెట్టింపు చేసే 11సూపర్ ఫుడ్స్

|

‘జాం పండువే...దోర జాం పండువే....' ఈ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదూ! గుర్తు పెట్టుకుంటే, సరిపోతుందా? మనమూ అలా దోరజాంపండులా మెరిసిపోవద్దూ..? అలా అవ్వాలనుకుంటే కొన్ని రకాల సూపర్ పుడ్స్ ని తీసుకోవాల్సిందే. అవును..అందాన్నిమెరుగుపరచడంలో బ్యూటీ ఉత్పత్తులే కాదు...ఆహారపదార్థాలు పాత్ర కూడా చాలా ఉంటుంది. రోజూ మనం తీసుకొనే ఆహారంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటే చాలు.. మెరిసే అందం మన సొంతమవుతుంది.
సూపర్ ఫుడ్స్ అంటే ఏదో ఖరీదైన ఆహారం అనుకునేరు. ఈ ఫుడ్స్ మనకు అందుబాటులో ఉండేవే...తాజా పండ్లు, ఆకుకూరలు, దుంపలు, ఇలా చలా రకాల ఆహారాలున్నాయి. మరి అవేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈక్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

ఆకుకూరలు:

ఆకుకూరలు:

కళ్ళ క్రింద నల్లటి వలయాలను తొలగించడానికి బచ్చలికూర, పాలకూర లాంటి ఆకుకూరలు ఉపయోగపడుతాయి. వీటిలో కెరోటినాయిడ్స్ ల్యూటిన్, జియోక్సాంథిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండూ కలిసి కంటిలోని రెటీనా మధ్యభాగంలో ఉండే మాక్యులాను రక్షిస్తుంది.

గుడ్డు: వెరీ గుడ్డు:

గుడ్డు: వెరీ గుడ్డు:

కోడి గుడ్డులో ఉండే ఐరన్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంకా దీనికిలో ఉండే సల్ఫర్ జుట్టు పట్టులా నిగనిగలాడేలా చేస్తుంది. ఇలా గుడ్డు మన అందాన్ని ఆరోగ్యాన్ని రెండింటినీ కాపాడుతుంది. ఒకవేళ మీకు గుడ్డు తినడం ఇష్టం లేకపోతే మాత్రం దాన్ని పగులగొట్టి అందులో ఉండే తెల్ల సొనను జుట్టుకు పెట్టుకొని గంట తర్వాత కడిగేస్తే మీ కురులు నిగనిగలాడుతూ ఉంటాయి.

అరటి:

అరటి:

మనలో కొంతమందికి అరటిపండు అంటే ఇష్టం ఉండదు. అయితే అరటి మన చర్మానికి చాలా అవసరం. ఇది చర్మంలోని మిలినాలు తొలగించడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం అరటిపండ్లు దాదాపు అన్ని సీజన్లలో లభిస్తున్నాయి. దీనిలో ఉండే ఎ, బి, ఇ విటమిన్లు వల్ల చర్మం సాగే గుణాన్ని సంతరించుకుంటుంది.

జామపండు:

జామపండు:

మనలో చాలా మంది స్నాక్స్ తినడానికి బటయకు వెళుతుంటారు. వాటన్నింటిని తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే మనకు సులభంగా దొరుకుతూ టేస్టీగా ఉండే జామపండ్లను తింటే చర్మం యవ్వనంగా తయారవుతుంది. జామపండులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడే ఫ్రీరాడికల్స్ ని సమూలంగా తొలగిస్తాయి. ఈ ఫ్రీరాడికల్స్ చర్మానికి హానిచేయడమే కాకుండా, చిన్న వయస్సులోనే వ్రుద్యాప్య ఛాయలు కనిపించేలా చేస్తాయి. వీటిని తొలగించడం వల్ల ముడుతలు రావన్నమాట. అంతే కాదు, జామ మీ శరీరంలో విటమిన్ ‘సి' పెంచతుంది.

దానిమ్మపండు:

దానిమ్మపండు:

దానిమ్మ వయస్సు పైబడిన కొద్దీ వచ్చే ముడతల్ని తగ్గించే శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ఇది మన గుండెలో ఆక్సిజన్ లెవల్స్ ని సమన్వయం చేయడంలో కూడా తోడ్పడుతుంది.

గ్రీన్ బొప్పాయి:

గ్రీన్ బొప్పాయి:

సహజసిద్దమైన ఎంజైమ్ లు, ఫైటోన్యూట్రియంట్లు ఉండే పండు ఇది. ఒక బొప్పాయి అనే కాదు.. పొటాషియం, మెగ్నీషియం, ఎ, బి, సి, ఇ విటమిన్లు ఉండే ఏ పండైనా జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. దీంతో పాటు మీ చర్మాన్ని తిరిగి కాంతి వంతం చేస్తుంది.

అకాయ్ బెర్రీస్:

అకాయ్ బెర్రీస్:

ఇది వయస్సు పైబడేకొద్దీ వచ్చే ముడుతలను నివారిస్తుంది. వీటిలో అమైనో ఆమ్లాలు పాలీఫినోల్స్, ఫ్లెవనాయిడ్స్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఇంకా బి1, బి2, బి3, సి, ఇ మొదలైన విటమిన్లు ఉంటాయి. ఈ బెర్రీస్ లో ఉండే ఆంథోసయనిన్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అంతే కాదు వీటి వల్ల శరీరానికి ఆరోగ్యం, కురులకు మెరుపు అందుతాయి.

గోజీ బెర్రీస్:

గోజీ బెర్రీస్:

గోజీ బెర్రీస్ అంటే మనలో చాలా మంది ఇష్టపడుతారు. వీటిలో 18అమైనో ఆమ్లాలు, బి, బి1, బి2, బి6, సి, ఇ విటమిన్లుతో పాటు బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. కంటి, చర్మ సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను సమన్వయపరుస్తుంది.

రెడ్ క్యాబేజ్ :

రెడ్ క్యాబేజ్ :

రెడ్ క్యాబేజ్ తినడం వల్ల చర్మానికి మంచి ఫలితాలుంటాయి. ముదురు, ఊదారంగులో ఉండే రెడ్ క్యాబేజ్ లో ఎక్కువ మొత్తంలో సల్పర్, అయోడిన్ ఉంటాయి. ఇది మీ శరీర అంతర్భాగాలలో ఉండే మలినాలను తొలగిస్తుంది. మీరు బయటకి వెళ్లొచ్చిన తర్వాత మీ చర్మాన్ని ఎలా శుభ్రపరుచుకుంటారో అలాగే శరీరంలోని మలినాలను తొలగించుకోవడానికి దీన్ని తీసుకోవడం చాలా అవసరం.

ఉసిరి:

ఉసిరి:

ఇది గోళ్ళు, జుట్టు పెరుగుదలకు ఉపయోపడతుంది. చిన్నతనంలోనే తెల్లజుట్టు, చర్మం ముడుతలు పడటాన్ని నివారిస్తుంది. కాలేయం, ప్లీహం, గుండె, జీర్ణవ్యవస్థలను ఇది బలపరుస్తుంది. రక్తనాళాల గోడలు దళసరిగా మారేలా చేస్తుంది. ఉసిరి ఎముకల్ని, దంతాల్ని కూడా ద్రుడపరుస్తుంది.

బీట్ రూట్:

బీట్ రూట్:

బీట్ రూల్ టో బీటైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కొవ్వులను కరిగించే బయోయాక్టివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బీట్ రూట్ రసంలో ఉండే క్లోరిన్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్ ని పరగడుపునే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

11 Super Foods That Boost Beauty From the Inside and Outside

These nutritious foods are a recipe for great hair, glowing skin, and more--whether you eat them or turn them into topical treatments.
Story first published: Thursday, July 10, 2014, 12:18 [IST]
Desktop Bottom Promotion