For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాత్ ఆయిల్స్ తో మనస్సుకు ఆహ్లాదం-శరీరానికి ఘుబాలించే పరిమళం

|

రెగ్యులర్ గా వేడి నీళ్ళ స్నానం అందులోనూ సెంట్ ఆయిల్స్ తో స్నానం చేయడమంటే చాలా మందికి ఇష్టం. అయిన మనలో ఎంత మంది ఈ సెట్ బాత్ చేసుకుంటారు? అలాగే ఎంత మంది స్నానానికి నేచురల్ ఆయిల్ ను ఉపయోగిస్తారు? చాలా మంది ఏదో బబుల్ బాత్ తో స్నానాన్ని ముంగించేస్తారు. ఇలా చేయడం చర్మానికి అంత ప్రయోజనం ఉండదు. సహజంగా నేచురల్ బాత్ ఆయిల్స్ మాల్స్ మరియు షాప్స్ లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇవి కొంచె ఖరీదైనవి మరియు సాధరం కంటే కొంచె రిచ్ గా ఉంటాయి .

అయితే ఇంత ఖరీదైనా బాత్ ఆయిల్స్ మార్కెట్లో కొని, స్నానం చేయడం అంత అవసరమా అనుకొనేవారు ఉన్నారు? కాబట్టి ఖచ్చితంగా నో అనే చెప్పాలి. అందుకే మనకోసం కొన్ని నేచురల్ బాత్ ఆయిల్స్ మనకు అందుబాటులోనే ఉన్నాయి మరియు చాలా సులభమైనటువంటి హోం మేడ్ బాత్ ఆయిల్స్ రిసిపిలను మనం ప్రతి రోజూ ఉపయోగించుకోవచ్చు. హోం మేడ్ బాత్ ఆయిల్స్ ను తయారుచేసుకోవడం చాలా సులభం మరియు అందుకు ఉపయోగపడే పదార్థాల కూడా చాలా సులభంగా ఖర్చులేకుండా మనకు దొరుకుతాయి.

అందుకు, మనం ఇంట్లోనే తయారుచేసుకోగల బాత్ ఆయిల్స్ -7నేచురల్ బాత్ ఆయిల్ రిసిపిల గురించి తెలుసుకోవాలి. వీటిని ఉపయోగించే ఒక ప్రశాంతమైన హాట్ బాత్ చేసుకొనే ఒక ప్రకాశవంతమైన చర్మం పొందవచ్చు మరియు శరీరం నుండి ఒక బ్యూటిఫుల్ స్మెల్ కూడా వస్తుంటుంది. మరి ఆ నేచులర్ 7 బాత్ ఆయిల్ రిసిపిలేంటో ఒక సారి చూద్దాం...

రోజ్ వాటర్ అండ్ ఆలివ్ ఆయిల్:

రోజ్ వాటర్ అండ్ ఆలివ్ ఆయిల్:

ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా అద్భుతమైనటువంటి బాత్ ఆయిల్ ను తయారుచేసుకోవచ్చు . అందుకు మీరు కొద్దిగా రోజ్ వాటర్ తీసుకొన అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని హాట్ వాటర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే ఇంకా మీరు కొన్నిఫ్రెష్ రోజా పువ్వుల యొక్క రేకులను హాట్ వాటర్ లో వేసి స్నానం చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ రిజల్ట్ పొందవచ్చు.

జాస్మిన్ ఆయిల్:

జాస్మిన్ ఆయిల్:

ఇది మరో సులభమైన హోం మేడ్ ఆయిల్ రిసిపి . కొన్ని జాస్మిన్(మల్లెమొగ్గలను) తీసుకోని వాటిని రాయితో మెత్తగా దంచుకోవాలి. లేదా మల్లెపువ్వు యొక్క రేకులను విడిపించే మెత్తగా పేస్ట్ చేసుకోవడం ద్వారా ఆయిల్ తీసుకోవచ్చు. ఈ ఆయిల్ ను హాట్ వాటర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే కొన్ని మల్లెపువ్వులను కూడా హాట్ వాటర్ లో వేసి మరింత ఎఫెక్టివ్ గా ఫలితం ఉంటుంది . జాస్మిన్ సువాసన మనస్సును ప్రశాతం పరుస్తుంది.

రెడ్ వైన్:

రెడ్ వైన్:

క్లియో పాత్ర తన హాట్ బాత్ కోసం బాత్ టబ్ నిండా రెడ్ వైన్ ఉపయోగించే వారట. ఆమెలా మనం చేయలేం కాబట్టి, మనం హాట్ బాత్ కోసం సిద్దంగా ఉంచుకొన్ని నీటిలో కొద్దిగా రెడ్ వైన్ వేసి బాగా మిక్స్ చేస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ వాసన కొందరి మరింత తేలిక పరుస్తుంది. మీకు నచ్చిన ఎటువంటి వైన్ అయినా మీరు ఎంపిక చేసుకోవచ్చు.

మ్యారిగోల్డ్ అండ్ సాండిల్ వుడ్:

మ్యారిగోల్డ్ అండ్ సాండిల్ వుడ్:

బంతిపువ్వుల యొక్క రేకులను మెత్తగా చేసి అందునుండి ఆయిల్ తీసుకోవచ్చు . ఈ ఆయిల్ ను కొద్దిగా సాండిల్ వుడ్ ఆయిల్ కు మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా ఒక బెస్ట్ హోం మేడ్ బాతింగ్ ఆయిల్.

మిక్స్ బ్లెండ్:

మిక్స్ బ్లెండ్:

మిమ్మల్ని ప్రశాంతపరచడంకోసం ఈ మిక్స్ బ్లెండ్ ఆయిల్స్ అద్భుతంగా సహాయపడుతాయి. అందుకు బాదం నూనె, రోజ్ ఎక్సాక్ట్స్(రోజ్ వాటర్), లెమన్ ఎక్సాక్ట్ (నిమ్మరసం), మరియు సాండిల్ వుడ్ ఎక్సాక్ట్ వేసి అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఆయిల్స్ ను కొన్ని రోజుల పాటు అలాగే పక్కనుంచుకోవాలి. తర్వాత స్నానం చేసే ముందు ఈ మిక్స్డ్ ఆయిల్ ను ఉపయోగించవచ్చు. ఇది ఒకూడా ఒక నేచురల్ బాత్ ఆయిల్ రిసిపి.

లావెండ్ ఆయిల్:

లావెండ్ ఆయిల్:

లావెండర్ మరియు జాస్మిన్ రెండింటిని బాత్ ఆయిల్ రిసిపిగా తయారుచేసుకోవాలి. అందుకు 10చుక్కల ల్యావెండర్ ఆయిల్లో 5 చుక్కల జాస్మిన్ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. దీన్ని స్నానం చేసే నీటిలో వేసి మిక్స్ హాట్ షవర్ బాత్ చేసుకోచ్చు.

షాంపు ఆయిల్:

షాంపు ఆయిల్:

షాంపూ బేస్డ్ ఆయిల్స్అంటే బాదం ఆయిల్ ను బేబీ షాంపు మరియు ఇతర ఎసెన్షియల్ ఆయిల్స్ తో మిక్స్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఇది మంచి ఫ్లేవర్ ను కలిగి ఉంటుంది.

English summary

7 Homemade Bath Oil Recipes

A hot water bath with nice scented oils, it is like a dream bath for many. But how many of us actually get some nice natural oils for bath, most of us just end up with some bubble bath with no good use for the skin. The natural bath oils available in the shops and malls are quite expensive and a little out of reach for the normal ones.
Story first published: Monday, June 16, 2014, 13:09 [IST]
Desktop Bottom Promotion