For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోచేతులు నలుపు తగ్గించి కాంతివంతగా మార్చే 9 హోం రెమెడీస్

|

కొంతమందికి శరీరం మొతం తెల్లగా, మృదువుగా ఉన్నా మోచేతుల దగ్గర చర్మం నల్లగా, గరుకుగా ఉంటుంది. అక్కడి చర్మం మొద్దుబారిపోయి చూడ్డానికి చాలా ఇబ్బందిగా, మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం... అప్పటి వరకు ఏదో పనిచేస్తూ అనాలోచితంగా దగ్గరో ఏ ఆధారం దొరికితే దాని మీద మోచేతులు పెట్టి కూర్చోవడమో, నిల్చోవడమో చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల ఆ సమయంలో రిలాక్సవ్వొచ్చు.

కానీ ఇదే సంఘటన పదే పదే జరిగినప్పుడు మోచేతుల దగ్గర చర్మం మొద్దుబారినట్లయి నల్లగా కమిలిపోతుంది. మరికొన్ని రోజులకు గరుకుగా అవుతుంది. ఈ నలుపు పోయి తిరిగి మోచేయి మామూలుగా రావాలంటే వివిధ రకాల మార్గాలున్నాయి. మోచేయి నలుపు తగ్గించుకోవడానికి కేవలం నిమ్మరసం రాస్తే సరిపోదు, దాంతో పాటు మరికొన్ని సులభమైన ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

పుదీనా:

పుదీనా:

ప్రతి రోజూ మనం తయారుచేసుకొనే వంటల్లో పుదీనా తప్పనిసరిగా వాడుతుంటారు. ఇది వంటలకు మంచి రుచి, ఫ్లేవర్ ను మాత్రమే అందివ్వడం కాదు, సౌందర్యానికి కూడా అద్భుతంగా సమాయపడుతుంది. మోచేతుల వద్ద నలుపును నివారించడానికి ఒక కప్పు నీళ్ళు పోసి అందులో పుదీనా వేసి మరిగించి నిమ్మరసం పిండి, ఈ మిశ్రామన్ని కాటన్ తో మీ మోచేతులకు పట్టించి తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయాలి.

షుగర్ మరియు ఆలివ్ ఆయిల్:

షుగర్ మరియు ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ మరియు పంచదార మిశ్రమం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మానికి తగినంత తేమను అందించి తెల్లగా మార్చుతుంది . అందుకు ఆలివ్ ఆయిల్ మరియు పందార సమంగా తీసుకొని పేస్ట్ చేసి, ఈ మిశ్రమాన్ని మోచేతులకు పట్టించి 10 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి.

బేకింగ్ సోడ మరియు పాలు:

బేకింగ్ సోడ మరియు పాలు:

బేకింగ్ సోడా మరియు పాలు రెండింటిని చిక్కటి పేస్ట్ గా చేసి ఈ మిశ్రమాన్ని మోచేతులకు పట్టించి 10 నిముషాల తర్వాత సర్కులర్ మోషన్ లో బాగా రుద్ది తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. పాలలోని ల్యాక్టిక్ యాసిడ్ మోచేతులు నలుపును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బేకింగ్ సోడా డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

కొబ్బరి నూనె మరియు నిమ్మరసం :

కొబ్బరి నూనె మరియు నిమ్మరసం :

ఒక చెంచా కొబ్బరి నూనె మరియు అర చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మోచేతులకు పట్టించి 20నిముషాల తర్వాత టిష్యు పేపర్ తో తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి నూనె చర్మానికి తగినంత తేమను అందించి, నేచురల్ బ్లీచర్ గా పనిచేస్తుంది.

పెరుగు మరియు వెనిగర్ మిశ్రమం:

పెరుగు మరియు వెనిగర్ మిశ్రమం:

రెండు చెంచాలా పెరుగు మరియు రెండు చెంచాల వెనిగర్ ను మిక్స్ చేసి మోచేతులకు అప్లై చేసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

శెనగపిండి ప్యాక్:

శెనగపిండి ప్యాక్:

మనం సాధారణంగా మన ముఖానికి శెనగపిండితో ఫేస్ ప్యాక్ చేసుకుంటుంటాము . ఫేస్ కు మాత్రమే కాదు, నల్లగా మారిన మోచేతులకు కూడా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక సారి అప్లై చేసిన తర్వాత బాగా మర్దన చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద మరియు తేనె:

కలబంద మరియు తేనె:

మన ఇంటి ఆవరణలో లేద పెరట్లో ఉండే కలబంద వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. అలొవెరా జెల్ ను అప్లై చేయడం ద్వారా స్కిన్ పిగ్న్మెంటేషన్ ను తొలగిస్తుంది. అలోవెరా జెల్ మరియు తేనె మిశ్రమాన్ని అప్లై చేసి అరగంట తర్వాత వాష్ చేస్తే, చర్మం కాంతివంతంగా మారుతుంది.

తేనె మరియు పసుపు ప్యాక్:

తేనె మరియు పసుపు ప్యాక్:

పసుపులో యాంటీసెస్టిక్ గుణాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి, పసుపులో కొద్దిగా తేనె మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా చేసి మోచేతులకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత, బాగా రుద్ది, తర్వాత నీళ్ళు పోసి శుభ్రం చేసుకోవాలి.

ప్రో టిప్:

ప్రో టిప్:

మీది డ్రై స్కిన్ అయితే మీ చర్మాన్ని మరంత పొడిగా మార్చుతుంది కాబట్టి, నిమ్మరసం వాడిన తర్వత చేతులకు మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్లీని ఉపయోగించాలి.

English summary

9 Home Remedies to Lighten Elbows You Probably Did Not Know

Dark elbows can ruin the look even if you are dressed gorgeously. You might have faced instances where you had to give pretty little white dress a pass simply because of the darkened elbows. There are various ways to solve this issue; the most common being rubbing lemon on the elbows. We list down of the quick and effective home remedies to lighten the dark elbows.
Desktop Bottom Promotion