For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవాంఛిత రోమాలను శాస్వతంగా దూరం చేయడానికి చిట్కాలు

|

కొంత మందిలో అవాంఛితరోమాలు, కాళ్లు, చేతులపై విపరీతంగా వచ్చి ఇబ్బంది కలుగజేస్తుంటాయి. అవాంఛితి రోమాల సమస్య ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తోంది. అందుకోసం రకరకాల కృత్రిమ పద్దతులతో ఎటువంటి మార్పు లేనందున వారిలో చిరాకు మొదలవుతుంది. అలాంటప్పుడు త్రెడింగ్, షేవింగ్ లాంటి పద్ధతుల కన్నా.. వ్యాక్సింగ్ చక్కని ప్రత్యామ్నాయం.

వ్యాక్సింగ్ కొందరికి పడకపోవచ్చు. కొన్ని సార్లు సరిగ్గా చేయకపోతే చర్మంపై దద్దుర్లు, ఎర్రటి పొక్కులు వస్తాయి. ఇక చేతులు, భుజాల దగ్గర బ్యాక్టీరియా ఉంటే ఇన్ ఫెక్షన్ కు కారణమై మచ్చలకు దారితీస్తుంది. కొందరిలో అవి త్వరగా తగ్గితే..మరికొందరిలో చాలా సమయం పట్టవచ్చు.

READ MORE: శరీరం మీద అవాంఛిత రోమాలను ఒక్క రోజులో తొలగించడం ఎలా

అయితే అవాంఛిత రోమాలను తొలగించుకునేందుకు అనుసరించే కొన్ని ఆధునిక పద్ధతుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయి. అయినా ఇంతకుమించి మార్గం ఏముంది. డబ్బు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు ఎక్కువమంది. ఈ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లో, మీ వంటింట్లోనే ఉందంటున్నారు సౌందర్య నిపుణులు. READ MORE:పెదాలు నల్లగా మారడానికి 8 ప్రధాన కారణాలు.!

శెనగపిండి -గంధం:

శెనగపిండి -గంధం:

శెనగపిండి, గంధం ఒక్కోటి రెండు టేబుల్‌ స్పూన్లు చొప్పున, తాజా మీగడ, ఆముదం, రోజ్‌వాటర్‌లు ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున తీసుకుని కొద్దిగా పసుపు కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న ప్రాంతంలో రాయాలి. పావుగంట తరువాత అపసవ్య దిశలో (రోమాలు పెరిగే దిశకు వ్యతిరేక దిశలో) మర్దనా చేయాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి.

మసూర్ దాల్ :

మసూర్ దాల్ :

మసూర్‌దాల్‌ (ఎర్ర కందిపప్పు)ను కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేశాక అందులో కొద్దిగా తేనె, గంధం, ముల్తాని మట్టి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మం మీద రాసుకోవాలి. ఆరిన తరువాత అపసవ్య దిశలో మర్దనా చేసి, కడిగేయాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాల పెరుగుదల వేగం తగ్గుతుంది.

 పచ్చిబొప్పాయి:

పచ్చిబొప్పాయి:

పచ్చి బొప్పాయి, అలొవెర (కలబంద) జెల్‌, శెనగపిండి, పసుపులను కలిపి శరీరానికి రాసుకోవాలి. బొప్పాయిలోని పపైన్‌ అనే ఎంజైమ్‌ కుదుళ్లలోకి వెళ్లి రోమాలు పెరగకుండా చేస్తుంది. ఇదేకాకుండా శెనగపిండి, పాలు, పసుపులను పేస్ట్‌లా చేసి వాడినా ఫలితం కనిపిస్తుంది.

పంచదార, నిమ్మరసం,

పంచదార, నిమ్మరసం,

పంచదార, నిమ్మరసం, తేనెల మిశ్రమాన్ని వాడినా అవాంఛితరోమాలు తొలగించుకోవచ్చు. పంచదారనునీటితో కలిపితే, ఇది మంచి ఎక్స్ ప్లోయేట్ గా పనిచేస్తుంది. నిమ్మరసం ఒక అద్భుతమైన ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. అవాంఛితరోమాలను శరీరం నుండి తొలగిస్తుంది.

పసుపు -శెనగపిండి:

పసుపు -శెనగపిండి:

ముఖంపై ఉండే అవాంఛితరోమాలను తొలగించాలంటే పసుపు, శెనగపిండి, వేపాకు పొడి, పచ్చి పాలు వాడాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట ఉండాలి. పూర్తిగా ఆరిపోకముందే చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇది సహజసిద్ధమైన యాంటీసెప్టిక్‌గా పనిచేసి రోమాలు పెరగకుండా నిరోధిస్తుంది. శెనగపిండి, పాలు సహజసిద్ధ క్లెన్సర్స్‌గా పనిచేస్తాయి.

గుడ్డు-నిమ్మరసం:

గుడ్డు-నిమ్మరసం:

గుడ్డు తెల్లసొనలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మాస్క్‌లా వేసుకున్నా ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. మాస్క్‌ లాగుతున్నప్పుడు అవాంఛిత రోమాలు దాంతోపాటు ఊడి వచ్చేస్తాయి.

అరటి-బియ్యం పిండి:

అరటి-బియ్యం పిండి:

చేతులు, కాళ్ల వంటి భాగాల్లో అవాంఛితరోమాలను తొలగించేందుకు అరటి, బియ్యప్పిండిలతో తయారుచేసిన స్క్రబ్‌ బాగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు శరీరమంతటా రాసుకుని మర్దనా చేసుకోవాలి.

తేనె ఎగ్ మాస్క్ :

తేనె ఎగ్ మాస్క్ :

స్టిక్ నెస్ విషయానికొస్తే, ఎగ్ వైట్ తేనెతో బాగా కలిసిపోతుంది. గుడ్డు కూడా చర్మానికి బాగా మెత్తుకుంటుంది. కాబట్టి,తేనె మరియు ఎగ్ వైట్ యొక్క మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత దాన్ని తొలగించేప్పుడు సన్నని హెయిర్ కూడా వస్తుంది.

బొప్పాయి, శెనగపిండి

బొప్పాయి, శెనగపిండి

బొప్పాయి, శెనగపిండి, పసుపు మరియు కలబంద: ఈ అన్ని పదార్థాల యొక్క కలయిక అవాంఛిత రోమాలను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ముఖ్యంగా శెనగపిండి, పసుపు, కలబంద, చర్మాన్ని సున్నితంగా మరియు కాంతివంతంగా ఆరోగ్యకరమైన చర్మం అందివ్వడానికి సహాయపడుతుంది.

 కార్న్ ఫ్లోర్:

కార్న్ ఫ్లోర్:

ఒక టీస్పూన్ కార్న్ ఫ్లోర్ ను, షుగర్ మరియు ఎగ్ వైట్ వేసి బాగా గిలకొట్టి, దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇది హోం మేడ్ ఫేషియల్ హెయిర్ రిమూవర్. దీని వల్ల ముఖం మీద హెయిర్ తొలగిపోవడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగిపోతాయి.

అవాంఛిత రోమాలను తొలగించడానికి సులభ చిట్కాలు

అవాంఛిత రోమాలను తొలగించడానికి సులభ చిట్కాలు

ఇక్కడ చెప్పినవన్నీ సహజసిద్ధ హెయిర్‌ రిమూవర్స్‌గా పనిచేయడం ఖాయం. కాకపోతే ఫలితం క్షణాల మీద కనిపించదు. క్రమంగా చేస్తుండాలి.

English summary

Home Remedies to get rid of unwanted hair permanently

Home Remedies to get rid of unwanted hair permanently. Body hair is one of the many things that is nasty to look at when you take a shower, especially. To get rid of body hair in 1 day, there are a handful of natural remedies you can try out to make it work.
Story first published: Friday, June 12, 2015, 12:52 [IST]
Desktop Bottom Promotion