For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్ పెడిక్యూర్ : ఇంట్లోనే చేసుకోవడానికి 7 సులభ మార్గాలు

By Super
|

మనం మన ముఖం మీద చూపినంత శ్రద్ధ పాదలమీద చూపం. నిర్లక్ష్యం చేయబడ్డ మీ పాదాలు మీరెంత అలంకరించుకున్నా కానీ మీ అందాన్ని ఒక మెట్టు కిందకి జారుస్తాయి.అందుకే అప్పుడప్పుడు పెడీక్యూర్ చేసుకుని పాదాలని కాస్త పట్టించుకుంటూ ఉండాలి.

పెడీక్యూర్ల గురించి మాట్లాడుకుంతటే ఫ్రెంచ్ పెడీక్యూర్ దే అగ్రస్థానం.ఫ్రెంచ్ పెడీక్యూర్ చేసిన పాదాలు సొంపుగా ఉండటమే కాకుండా చక్కదనానికి చిరునామాగా ఇంకా చెప్పాలంటే సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తాయి. ఇంత చక్కటి పెడీక్యూర్ ని ఎప్పుడూ సెలూన్ లో చేయించుకుందామంటే అయ్యే పని కాదు.ఇంట్లో పెడీక్యూర్ ని ఎలా చేసుకోవాలో తెలుసుకుని ఉండటం మంచిది.ఫ్రెంచ్ పెడీక్యూర్ చేసుకోవడానికి అవసరమయ్యే సామాగ్రి దగ్గర నుండీ, అది ఎలా చేసుకోవాలో ఇక్కడ ఇస్తున్నాము.

కావాల్సిన వస్తువులు:

ఈ పెడీక్యూర్ చేసుకునే ముందు కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చుకోవడం చాలా ముఖ్యం.

కాళ్ళు నానబెట్టడానికి పెద్ద బకెట్ లేదా బేసిన్,బాడీ ఆయిల్,ప్యూమిక్ స్టోన్,ఎప్సం సల్త్,నెయిల్ పాలిష్ రిమూవర్, ఫైలర్,కన్సీలర్ బ్రష్,కాటన్ బాల్స్,వైట్ నెయిల్ పాలిష్, లోషన్, తో స్పేసర్స్(నెయిల్ పాలిష్ వేసేటప్పుడు పక్క వేలికి అంటకుండా వేళ్ళ మధ్యలో వాడతారు) మరియు టవల్స్.

ఈ సూచనలని అనుసరించి పెడీక్యూర్ చేసుకుంటే అచ్చం సెలూన్ లో చేయించుకున్న ఫ్రెంచ్ పెడీక్యూర్ లాగే వస్తుంది.
ఎలా చేసుకోవాలో చూద్దామా

కాళ్ళని నానబెట్టడం

కాళ్ళని నానబెట్టడం

మొట్టమొదటగా ఒక పెద్ద టబ్ లో గోరువెచ్చటి నీళ్ళు పోసి కాళ్ళని నానబెట్టండి.ఎప్సం సాల్ట్ లేదా షాంపూ నీటిలో కలిపి నానపెడితే పాదాలు మ్రుదువుగా మారతాయి. కాళ్ళు ఇలా నీటిలో పెట్టి హాయిగా కాసేపు రిలాక్స్ అవ్వండి. కాళ్ళు కాసేపు నానిన తరువాత ప్యూమిక్ స్టొన్ తీసుకుని మీ అరికళ్ళు, పాదాలు రుద్దుకోవాలి.మెల్లిగా రుద్దుకోండి సుమా.

లోషన్ తో పాదాల మర్దనా

లోషన్ తో పాదాల మర్దనా

కాస్త బాడీ లోషన్ తీసుకుని మీ పాదాలకి మ్రుదువుగా మర్దనా చెయ్యండి.మీ పాదాలు ఇప్పటికే మ్రుదువుగా మారి ఉంటాయి.మర్దనా అయ్యాకా చివర్లో వాస్ లైన్ కూడా రాసుకోవచ్చు.ఇప్పుడు ట్రిమ్మర్ తీసుకుని గోర్ల చుట్టూ ఉన్న మ్రుత చర్మాన్ని(డెడ్ స్కిన్) తొలగించండి.ట్రిమ్మర్ వాడేటప్పుడు జాగ్రత్త.

నెయిల్ పాలిష్ తొలగించడం

నెయిల్ పాలిష్ తొలగించడం

మీ కాలిగోళ్లకి ఉన్న పాత నెయిల్ పాలిష్ ని ఇప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ తో తొలగించండి.తొలగించాకా ఒక చిన్న కాటన్ బాల్ మీద నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి గోళ్ళ మీద అద్దితే ఇంకా మిగిలిఉన్న పాలిష్ కూడా పోతుంది.

గోళ్ళకి వైట్ నెయిల్ పాలిష్ వెయ్యడం:

గోళ్ళకి వైట్ నెయిల్ పాలిష్ వెయ్యడం:

ఇప్పుడు వైట్ నెయిల్ పాలిష్ చేసుకుని గోళ్ళ పైభాగం లో వెయ్యండి.ఒకట్రెండు నిమిషాలు ఆగి ఆరిన తరువాత మరలా సెకండ్ కోట్ వెయ్యండి.సెకండ్ కోట్ చాలా ముఖ్యం.ఎందుకంటే ఈ కోట్ ఏమన్నా అసమానతలు ఉంటే వాటిని కప్పిపుచ్చి గోళ్ళు అందం గా కనపడేటట్లు చేస్తుంది.ఒకవేళ కాస్త అసమానతలున్నా కంగారుపడకండి. నెక్స్ట్ స్టెప్ వీటిని దిద్దుతుంది.

అసమానతలని కప్పిపుచ్చడం లేదా ఎక్స్ ట్రా నెయిల్ పాలిష్ తొలగించడం:

అసమానతలని కప్పిపుచ్చడం లేదా ఎక్స్ ట్రా నెయిల్ పాలిష్ తొలగించడం:

ఇక్కడే మీరు పొరపాటు చేసే అవకాశం ఉంది.ఎందుకంటే మీకు ఇది రోజూ చేసే అలవాటూ లేదు మరియు మీరేమి నిపుణులు కాదు కదా పెడిక్యూర్ లో. అయినా ఏమీ కంగారు పడకండి. కన్సీలర్ బ్రష్ తీసుకుని దానిని ఎసిటోన్ లో ముంచి మెల్లిగా గోళ్ళ చుట్టూ ఉన్న ఎక్స్ ట్రా నెయిల్ పాలిష్ ని తొలగించండి.ఇది చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేస్తే చూడటానికి గోళ్ళు అందం గా ఉంటాయి.

నెయిల్ పాలిష్ పూర్తిగా ఆరనివ్వండి:

నెయిల్ పాలిష్ పూర్తిగా ఆరనివ్వండి:

అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మీ నెయిల్ పాలిష్ ని మరికాస్త ఆరనివ్వండి.త్వరగా ఆరాలంటే మీ పాదాలని చన్నీటిలో ముంచి తీయండి.ఈ చిట్కా మీ నెయిల్ పాలిష్ ఎక్కువరోజులు నిలబడేటట్లు చేస్తుంది

క్లియర్ పాలిష్ వెయ్యడం:

క్లియర్ పాలిష్ వెయ్యడం:

ఇది ఆఖరి స్టెప్.ఒక్కో గోరు మీదా క్లియర్ నెయిల్ పాలిష్ వెయ్యండి.ఇప్పుడు చూసుకోండి, మంచు అంత స్వచ్చం గా లేవూ మీ పాదాలు?? చూసారుగా, ఇదేమీ కష్టం కాదు. ఫ్రెంచ్ పెడిక్యూర్ కి కావల్సిందల్లా సామాగ్రి ని వెతికి తెచ్చుకోవడం మరియు కాస్త ఓపిక మాత్రమే. మరెందుకాలశ్యం మీ పాదాలకి ఒక కొత్త రూపునివ్వండి ఇప్పుడే. మీరు తరచుగా పెడీక్యూర్లకి వెడుతుంటారా??ఇంట్లో ప్రయత్నించారా ఎప్పుడైనా?? ఓక వేళ ప్రయత్నిస్తే ఎంత ప్రభావవంతం గా ఉందో మాకు కామెంట్స్ రూపం లో కింద తెలియచెయ్యండి.

English summary

Seven Easy Steps To Do A French Pedicure At Home:Beauty Tips in Telugu

7 Easy Steps To Do A French Pedicure At Home,Our feet are often neglected while we shower our face with all our attention. But unkempt feet can really bring your style quotient down a notch! And that is why you need to pamper your feet with regular pedicures.
Desktop Bottom Promotion