For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడ చుట్టూ, వీపు భాగంలో డార్క్ స్కిన్ పోగొట్టే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!

సాధారణంగా మహిళల్లో ముఖం తెల్లగా కాంతివంతంగా కనిపిస్తే, మెడ, బ్యాక్ పోర్షన లో నల్లగా కనబడుతుంది. అందుకు కారణం ఆ ప్రదేశంలో డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడటమే.

|

సహజంగా కొంత మందిని గమనించినట్లైతే ముఖంలో ఉన్న అందం, గ్లోనెస్ గొంతు, మెడ భాగంలో కనిపించదు. ముఖం కాంతివంతంగా ఉంటే, మెడ డార్క్ కలర్ లో ప్యాచ్ లు గా కనబడుతుంటుంది. ఈ తేడాను తగ్గించడంలో , ఫేస్ అండ్ నెక్ స్కిన్ ఒకే విధంగా మార్చడంలో కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి .

సాధారణంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంటుంది. ముఖం తెల్లగా కాంతివంతంగా కనిపిస్తే, మెడ, బ్యాక్ పోర్షన లో నల్లగా కనబడుతుంది. అందుకు కారణం ఆ ప్రదేశంలో డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడటమే. ముఖానికి తీసుకున్నంత శ్రద్ద మెడకు తీసుకోకపోవడం వల్ల మహిళలు మెడ, వీపు బాగంలో చర్మం డార్క్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్నే హైపర్ పిగ్మెంటేషన్ గా పిలుస్తారు. ఇది ఇన్ఫెక్షన్ కాదు, అయితే ఈ సమస్య అలాగే చాలా ఎక్కువ రోజుల నుండి ఉన్నట్లైతే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

మెడ, వీపు బాగంలో డార్క్ స్కిన్ తొలగించుకోవడానికి ఈ క్రింది సూచించిన హోం రెమెడీస్ ను ఫాలో అవ్వాలి.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

మెడమీద, వీపు భాగంలో మలినాలను, దుమ్ముధూళిని తొలగించడంలో కీరదోసకాయ గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మానికి మంచి గ్లోయింగ్ ను అందిస్తుంది. కీరదోసకాయను తురుమి అందులో నుండి కొద్దిగా రసాన్నీ తియ్యాలి. ఇప్పుడు దీన్ని సున్నితంగా మెడ, వీపుకు అప్లై చేయాలి. ఈ జ్యూస్ చర్మంలోనికి పూర్తిగా ఇంకి, డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు:

పెరుగు:

పెరుగు మెడను శుభ్రం చేస్తుంది. చర్మంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. కొంత పెరుగు తీసుకుని నేరుగా మెడకు, వీపు బాగానికి అప్లై చేయాలి. కొద్ది సమయం అలాగే వదిలేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాదం:

బాదం:

బాదంను పొడి చేసి అందులో కొద్దిగా తేనె, పాలు మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మెడకు, వీపు బాగానికి అప్లై చేసి, డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్స్ మరియు టమోటో:

ఓట్స్ మరియు టమోటో:

అరకప్పు ఓట్స్ పొడిలో ఒక టమోటో వేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ రెండు పదార్థాలు బాగా మిక్స్ అయిన తర్వాత ఇది మెడకు, వీపు బాగానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత ముఖానికి నీళ్ళు చిలకరించి మర్ధన చేసి , చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడా గ్రేట్ ఎక్స్ ఫ్లోయేటర్, ఇది చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.బేకింగ్ సోడకు కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. తర్వాత దీన్ని డార్క్ స్కిన్ ప్యాచెస్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్ గా తయారవుతుంది.

 మిల్క్ క్రీమ్, శెనగపిండి:

మిల్క్ క్రీమ్, శెనగపిండి:

అరస్పూన్ మిల్క్ క్రీమ్ తీసుకుని, అందులో అరటీస్పూన్ శెనగపిండి మిక్స్ చేయాలి. చిక్కగా పేస్ట్ చేసి, నల్లగా ఉన్నభాగంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు మిక్స్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఆరెంజ్ పీల్ మాస్క్:

ఆరెంజ్ పీల్ మాస్క్:

ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి, పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా పాలు కలుపుకుని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మెడకు, వీపుకు అప్లై చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

అన్నం గంజి:

అన్నం గంజి:

అన్నం గంజి మెడ మీద, వీపు మీద ఉన్న డార్క్ స్కిన్ తొలగిస్తుంది. అన్న ఉడికిన తర్వాత వంచిన గంజిని మెడకు వీపు భాగానికి అప్లై చేయాలి. పూర్తిగా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో స్క్రబ్ చేసే కడిగేసుకోవాలి.

ఎసెన్సియల్ ఆయిల్స్:

ఎసెన్సియల్ ఆయిల్స్:

ఎసెన్సియల్ ఆయిల్స్ లో బాదం ఆయిల్ , ఆలివ్ ఆయిల్ అన్ని రకాల చర్మ తత్వాలకు నప్పుతుంది. ఈ నూనెలు చేతిలోకి కొద్దిగా తీసుకుని, మెడ, వీపు భాగానికి అప్లై చేసి, మసాజ్ చేయాలి. గోరువెచ్చని టవల్ ను మెడకు చుట్టి, ఒక గంట తర్వాత స్నానం చేయాలి. ఫాస్టర్ రిజల్ట్ కోసం ఈ రెండు నూనెను కలిపితే మరింత బెటర్ గా ఫలితం ఉంటుంది.

వాల్ నట్స్, పెరుగు:

వాల్ నట్స్, పెరుగు:

వాల్ నట్, పెరుగు రెండింటిని మిక్స్ చేయాలి. ఈ రెండు పదార్థాల యొక్క మిశ్రమాన్ని మెడకు, వీపుకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వాల్ నట్ చర్మానికి పోషణను అందిస్తుంది. పెరుగు చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

English summary

10 Home Remedies For Dark Skin Around The Neck & Back

10 Home Remedies For Dark Skin Around The Neck & Back,You should never go for an instant whitening on the neck and back region, but instead try to opt for some home remedies that will help to whiten the skin around the neck and back.
Story first published: Wednesday, November 2, 2016, 16:38 [IST]
Desktop Bottom Promotion