For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్లజోడు వల్ల కళ్లకింద ఏర్పడిన డార్క్ సర్కిల్స్ తొలగించే టిప్స్

By Super
|

కళ్లద్దాలు ఒకప్పుడు కళ్లలో ఏదో లోపం ఉంటే పెట్టుకొనే వారు, కానీ ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో కళ్లద్దాలు కూడా ఒక ఫ్యాషన్ గా మారింది. ఉన్నట్లు ఉండి కొంత మంది అద్దాలను వినియోగిస్తుంటారు. అద్దాలు చూడటానికి చాలా అందంగా, ఫ్రేము చాలా బ్యూటిఫుల్ గా, గ్లామరస్ గా, బోల్డ్ గా ఉంటాయి. ఫలితంగా గ్లాస్ వినియోగించే వారికి ఐ మేకప్ ముఖ్యమైనదిగా మారింది.

కళ్ల జోళ్లు దీర్ఘకాలం పాటు వేసుకోవడం వల్ల ముక్కుమీద నల్లని చారలు శాశ్వత మచ్చలుగా మారతాయి. కళ్లజోడును ధరించడం దీర్ఘకాలం పాటు పాటిస్తున్నట్లైతే అలవాటుగా కూడా మారుతుంది. కళ్ల జోడు ధరించడం వల్ల ఏర్పడే ముక్కుమీద నల్లని మచ్చలను తొలగించడానికి అవకాశం ఉంది. అందుకు కొన్ని హోం రెమడీస్, బేసిక్ టిప్స్ ఉన్నాయి. ఇవి ముక్కు మీద మచ్చలను తొలగించడం మాత్రమే కాదు తిరిగా అటువంటి మచ్చలు ఏర్పడకుండా నివారిస్తాయి.

అంతే కాదు బరువుగా ఉండే కళ్ళ అద్దాలు కంటిన్యుగా వేసుకుంటే తరచూ తలనొప్పికి దారితీస్తుంది. నొప్పి, కళ్ల నుంచి నీళ్లు కారడం జరగుతుంది. కాబట్టి, లైటర్ ఫ్రేమ్ ను ఎంచుకోవడం, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన అద్దాలు, బయటకు వెళ్లినప్పుడు మరో రకమైన అద్దాలు వేసుకోవడం మంచిది. ఇక డార్క్ సర్కిల్స్ ను నివారించే హోం రెమెడీస్ చూద్దామా..

బంగాళదుంపలు:

బంగాళదుంపలు:

బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్, తేనె మిక్స్ చేసి, కళ్ల కింది భాగంలో వలయాలపై అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

కలబంద:

కలబంద:

చర్మానికి కలబంద చాలా త్వరగా ఎపెక్టివ్ గా మార్పు తీసుకొస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఈ కలబంద రసాన్ని నల్లగా మారిన చర్మం, వలయాల మీద అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం :

నిమ్మరసం :

చర్మ సంరక్షణలో నిమ్మరసం ఒక క్లీనింగ్ ఏజెంట్. మీ చర్మం మంచి కలర్ రావాలంటే , నిమ్మరసాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చల్లటి రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ తొక్క:

ఆరెంజ్ తొక్క:

ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా నారింజ తొక్కకు, కొంచెం తేనె మిక్స్ చేసి పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను నేరుగా నల్లగా మారిన చర్మం మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది.

కీరదోస:

కీరదోస:

కీరదోసకాయ చర్మ సంరక్షణకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. కీరదోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి అప్లై చేసిన వెంటనే త్వరగా చల్లబరుస్తుంది . స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది. దాంతో డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవచ్చు

తేనె:

తేనె:

ఒక టేబుల్ స్పూన్ తేనెకు కొద్దిగా ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి తర్వాత డార్క్ సర్కిల్లో బాగా మర్ధన చేయాలి. 15నిముషాల తర్వాత డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే వలయాలు మాయం అవుతాయి.

వెనిగర్:

వెనిగర్:

ఒక కప్పు వాటర్ లోఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి అందులో కాటన్ బాల్ డిప్ చేసి , దాంతో నల్లమచ్చలు , వలయాలున్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా ఎపెక్టివ్ గా పనిచేస్తుంది. డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి . కంటి అద్దాల వల్ల ఏర్పడ్డ చారలు, మచ్చలు తొలగిపోతాయి.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

బాదం ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా చేతి వేళ్లకు బాదం ఆయిల్ తీసుకొని కళ్ల క్రింది బాగంలో అప్లై చేయాలి. అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డార్క్ సర్కిల్స్ చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది.

రోజ్ వాటర్:

రోజ్ వాటర్:

రోజ్ వాటర్ చర్మ సంరక్షణకు చాలా ఉపయోగకరం. ఇది ఇక క్లీన్ ఏజెంట్ లా పనిచేస్తుంది ఈ రోజ్ వాటర్ ను రోజుకు రెండు సార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . కళ్ల క్రింది అప్లై చేసి సున్నిత మసాజ్ ఇవ్వడం వల్ల కళ్ల క్రింద బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. వలయాలు మాయం అవుతాయి.

English summary

Tips On How To Remove Dark Circles Caused By Spectacles

Tips On How To Remove Dark Circles Caused By Spectacles. With the continuous use of heavy spectacles, you tend to develop dark circles under your eyes.
Story first published: Wednesday, April 20, 2016, 17:19 [IST]
Desktop Bottom Promotion