For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1వీక్ లో ఐబ్రోస్ ఒత్తుగా పెరగాలంటే..సింపుల్ టిప్స్...

By Super
|

కళ్ళు ఎంత అందంగా ఉన్నా..అందమైన కనుబొమ్మలు లేకపోతే ఆ ముఖం ఎంత అలంకరించుకొన్నా, అందవిహీనంగానే కనబడుతుంది . అందుకోసమే మీకు అందమైన కనుబొమ్మలు పొందడానికి మేము ఇక్కడున్నాము . మీ ఐబ్రోస్ అందంగా ..ఒత్తుగా పెరగడానికి కొన్ని హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి.

ఉదాహరణకు హెయిర్ గ్రోత్ కోసం వాజలైన్ జెల్ గ్రేట్ గా సహాయపడుతుంది . అయితే ఈ పెట్రోలియం జెల్లీ వల్ల , ఒక నిరుపయోగం కూడా ఉంది . ఇది చర్మంను నల్లగా మార్చుతుంది . మరి అయితే మీ ఐబ్రోలను అందంగా చూపించుకోవడానికి ఐబ్రో పెన్సిల్, లేదా ఐనర్ వంటివి ఉపయోగిస్తుంటే , నేచురల్ రెమెడీస్ ఐన బాదం ఆయిల్, మరియు కోకనట్ ఆయిల్ వంటి నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల బెటర్ రిజల్ట్ ను మీరు చూడవచ్చు . ఈ రెండింటి కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది .

అదే విధంగా, మీకు ఇలాంటి నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల ఏవైనా అలర్జీ లక్షణాలున్నప్పుడు , ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది . మరి కొన్ని నేచురల్ రెమెడీస్ తో అందమైన ఐబ్రోస్ ను ఒక వారంలో ఎలా పొందాలలో చూద్దాం...

బాదం నూనె:

బాదం నూనె:

బాదం నూనెతో ఐబ్రోస్ కు అప్లై చేసి మసాజ్ లా చేయాలి. 30 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇంకా రాత్రుల్లో ఐబ్రోలకు ఈ నూనె అప్లై చేసి ఉదయం స్నానం చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ ఫలితాలను పొందవచ్చు.

అలోవెర:

అలోవెర:

ఈ సింపుల్ హోం రెమెడీని వారంలో రెండు సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలోవెర జెల్ ను నేరుగా కనుబొమ్మల మీద అప్లై చేయాలి . 20 నిముషాల డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక వారం పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒత్తైన ఐబ్రోను పొందవచ్చుజ

ఆముదం:

ఆముదం:

ఆముదం చూడటానికి చాలా చిక్కగా మరియు జిడ్డుగా ఉంటుంది. అయితే కాటన్ బాల్ ఉపయోగపడుతుంది . కాటన్ బాల్ ను ఆముదంలో డిప్ చేసి కనుబొమ్మల మీద అప్లై చేయాలి. ఒక గంట తర్వాత నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి . ఈ నూనెలో ఉండే లక్షణాలు చర్మానికి తగిన పోషణను అందివ్వడంతో పాటు కనుబొమ్మలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే కొబ్బరినూనెను అప్లై చేసుకోవచ్చు . అంతే కాదు, కనుబొమ్మలకు ఇది ఒక నేచురల్ షైనింగ్ ను అందిస్తుంది . కాబట్టి, మీ కనుబొమ్మలను ఒత్తుగా అందంగా పెంచుకోవాలి నేచురల్ కొబ్బరి నూనెను ఒక రోజుకు రెండు సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ రసం:

కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ ఉల్లిపాయ రసం, కానీ ఈ వాసన అంటే కొంత మందికి పట్టదు, కానీ వేరే మార్గం లేదు . ఒక కాటన్ బాల్ ను ఉల్లిపాయ రసంలో డిప్ చేసి కనుబొమ్మల మీద అప్లై చేయాలి . ఈ జ్యూస్ ను అప్లై చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి . ఇది స్కిన్ టోన్ కూడా పెంచుతుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల కేవలం రెండు రోజుల్లోనే ఫలితం పొందవచ్చు. ఆలివ్ ఆయిల్ బెస్ట్ హోం రెమెడీ. నిద్రించడానికి ముందు, ఆలివ్ ఆయిల్ ను ఐబ్రోలకు అప్లై చేసి 15నిముషాలు మసాజ్ చేయాలి. ఈ ఆయిల్ కనుబొమ్మల యొక్క హెయిర్ ను ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

పాలు:

పాలు:

గోరువెచ్చని పాలలో కాటన్ బాల్ ను డిప్ చేసి కనుబొమ్మల మీద అప్లై చేయాలి . మిల్క్ డ్రై అయిన తర్వాత . చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ సింపుల్ హోం రెమెడీని 5 రోజులు క్రమంగా పాటించి ఫలితాలను గమనించవచ్చు.

English summary

Tips To Thicken Scanty Eyebrows In 1 Week

Scanty eyebrows throw off a very nasty look on women, which is why we are here to help you get that bushy beautiful brow. To grow and thicken your eyebrows there are a handful of home remedies you can apply to the brow, to enhance it's growth.
Story first published: Thursday, March 31, 2016, 15:53 [IST]
Desktop Bottom Promotion