దోమకాటుకు అరటి తొక్కను ఉపయోగించే అద్భుత మార్గాలు

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

దోమ కాటుకు తక్షణ ఉపశమనం కలిగించే పదార్థాలేవైనా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉందనే చెప్పవచ్చు. అదే బనానా పీల్(అరటి తొక్క).

3 Amazing Ways To Use Banana Peel For Treating Mosquito Bite

అరటి తొక్కలో చర్మ పరివర్తకలిగించే లక్షణాలు కలది. అరటి తొక్క అనేక బ్యూటీ ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాదండోయ్ దోమకాటు వల్ల వచ్చిన వాపు, మంట నుండి తక్షణ ఉపశమనం కలిగించే గుణాలు కూడా ఇందులో ఉండాయంటే ఆశ్చర్యం కలగక తప్పదు. ఎందుకంటే అరటి తొక్కలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది ఇన్ఫ్లమేషన్ కు వ్యతిరేఖంగా పోరాడటానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. మరి దోమకాటుకు అరటి తొక్క ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..

దోమలు కుట్టకుండా ఉండుటకు సులభ చిట్కాలు

3 Amazing Ways To Use Banana Peel For Treating Mosquito Bite

1. అరటి తొక్క మరియు గ్లిజరిన్:

అరటితొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది.దోమలు కుడితే చర్మం దద్దుర్లు ఎర్రగా కందిపోయి కనబడుటయే కాదు, చాలా నొప్పి, బాధ కలిగిస్తుంది. నొప్పి, రెడ్ నెస్, రాషెస్ ను ఎఫెక్టివ్ గా తొలగించడానికి అరటి మరియు గ్లిజరిన్ ఉపయోగపడుతాయి. మరి వీటి కాంబినేషన్ ఎలా తయారుచేయాలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఎలా తయారుచేయాలి?

ముందగా అరటి తొక్కను తీసి పక్కన పెట్టుకోవాలి.

అరటితొక్కకు కొద్దిగా గ్లిజరిన్ కలపాలి

ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ చేయాలి.

తర్వాత దోమలు కుట్టిన చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.

అప్లై చేసిన ఒక గంట తర్వాత సున్నితంగా మసాజ్ చేస్తూ చన్నీటితో కడగాలి.

ప్రయోజనాలు:

అరటి తొక్కలో స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలున్నాయి. ఇది దోమకాటు వల్ల ఏర్పడ్డ దద్దుర్ల సైజ్ ను తగ్గించి, మంట, వాపు, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

అరటి తొక్క దురదను తగ్గిస్తుంది. దోమ కుట్టిన ప్రదేశంలో కూల్ గా మార్చుతుంది. తిరిగి దురద, నొప్పి పెట్టకుండా కాపాడుతుంది.

గ్లిజరిన్ ప్రభావిత ప్రాంతంలో చర్మంను సున్నితంగా , తేమగా మార్చుతుంది. అలాగే చర్మం నల్లగా మారకుండా చేస్తుంది.

దోమలు కుట్టకుండా ఉండుటకు సులభ చిట్కాలు

3 Amazing Ways To Use Banana Peel For Treating Mosquito Bite

2. అరటి తొక్క మరియు ఐస్

నొప్పి కలిగించే దోమకాటుకు మరో అద్భుతమైన రెమెడీ. టైగర్ మస్కిటోస్ చాలా ప్రాణంతక నొప్పిని కలిగిస్తాయి. వాపు విపరీతంగా వస్తుంది. అంతే కాదు కొంచెం మంటగా కూడా ఉంటుంది. దురద , దురద వల్ల చర్మం ఎర్రగా కందిపోతుంది. రాషెస్ ఏర్పడి చర్మం మరింత అసహ్యంగా కనబడుతుంది. అరటి తొక్క, మరియు ఐస్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల ఇన్ స్టాంట్ గా ఉపశమనం పొందుతారు.

ఎలా ఉపయోగించాలి?

అరటి తొక్కలోపలి బాగంలోని పదార్థాన్ని ఒక స్పూన్ ద్వారా తీసి బౌల్లో వేసుకోవాలి..

దీన్ని రోజు వాటర్ కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి.

ఈ పేస్ట్ ను దోమకుట్టిన చోట అప్లై చేయాలి.

తర్వాత ఒక క్లీన్ క్లాత్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేయాలి.

తర్వాత అరటితొక్క పేస్ట్ ను అప్లై చేసిన ప్రదేశంలో ఈ ఐస్ క్యూబ్స్ క్లాత్ ను చుట్టాలి.

ఒక అరగంట పాటు ఈ ఐస్ క్లాత్ ను ప్రెస్ చేస్తుండాలి.

అరగంట తర్వాత ట్యాప్ వాటర్ తో కడగాలి.

ఉపయోగాలు:

అరటి తొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దోమకాటు వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.

ఇంకా వాపు, రెడ్ నెస్ తగ్గిస్తుంది. దురద వల్ల కుట్టిన చోట ఎర్రగా కందకుండా చేస్తుంది.

ఐస్ క్లాత్ నొప్పిని తగ్గించడంతో పాటు, మంటను కూడా తగ్గిస్తుంది. నొప్పిని తగ్గిస్తూ, మంట ఉన్న ప్రదేశంలో కూల్ గా చేస్తుంది. నొప్పిని నయం చేసి, ఇన్ స్టాంట్ రిలీఫ్ ఇస్తుంది.

3 Amazing Ways To Use Banana Peel For Treating Mosquito Bite

దోమల కాటు నుండి తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలు

3. అరటి తొక్క మరియు కీరదోసకాయ:

అరటి తొక్క దోమకాటు వల్ల ఎక్కువ నొప్పి, మంటల కలగకుండా చేస్తుంది. కీరదోసకాయలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల కూలింగ్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. అందువల్ల బనానా పీల్ మరియు కుకుంబర్ రెండింటి కాంబినేషన్ నొప్పి , దురద, రెడ్ నెస్ తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవచ్చు.

ఎలా తయారుచేయాలి?

కీరదోయకాయను చిన్న ముక్కలుగా చేసి పేస్ట్ చేయాలి.

తర్వాత అరటి తక్కలోని లోపలి పదార్థాన్ని చాకుతో తీసి ఒక బౌల్లో వేసుకోవాలి.

తర్వాత కీరదోసకాయ పేస్ట్ ను అందులో వేసి రెండూ బాగా మెత్తగా పేస్ట్ చేయాలి.

ఒక శుభ్రమైన వస్త్రంలో ఈ పేస్ట్ వేసి, తర్వాత దోమలు కుట్టిన ప్రదేశంలో అప్లై చేయాలి.

తర్వాత క్లాత్ చుట్టి పెట్టాలి. ఒక గంట తర్వాత ఐస్ వాటర్ తో కడగాలి.

ఉపయోగాలు:

అరటి తొక్క దోమకాటు వల్ల వచ్చే మంటకు వ్యతిరేఖంగా పనిచేస్తుంది. నొప్పి , రెడ్ నెస్, దురద తగ్గిస్తుంది. ఇది స్కిన్ రాషెస్ ను మరియు దద్దులను తగ్గిస్తుంది

కీరదోసకాయ అసాధారణమైన కూలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. నొప్పి, వాపు నుండి ఇన్ స్టాంట్ రిలీఫ్ కలిగిస్తుంది.

దోమకాటు నుండి తక్షణ ఉపశమనం పొందడానికి పైన సూచించిన 3 మార్గాలు చాలా అద్భుతంగా ఉపయోగపడుతాయి. ఇవి చర్మంలో రాషెస్ ఏర్పడకుండా చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

English summary

3 Amazing Ways To Use Banana Peel For Treating Mosquito Bites

Banana peel is the king of skin transforming attributes. It offers unmatched beauty benefits upon use. However, its efficacy in reducing the inflammation caused due to mosquito bite is a lesser known fact. Banana peel comes loaded with the goodness of anti-oxidants. It also makes a revolutionary anti-inflammatory agent against inflammations caused due to bugs bite. Read more on banana and mosquito bites..
Story first published: Monday, December 4, 2017, 14:00 [IST]