రామ ఫలం, పేరుకు తగ్గట్లు సౌందర్యానికి ఉత్తమ ఫలం!

By: Mallikarjuna
Subscribe to Boldsky

రామ ఫలం గురించి మీరు ఇదివరకెప్పుడైనా విన్నారా? రామ ఫలం అనేది సీతా ఫలం లాంటిదే. దీన్నే ఇంగ్లీష్ లో సోర్సోప్(రామ్ ఫల్) పిలుస్తారు. ఈ పేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేమో అనిపించకమానదు. అంతే కాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేమో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగే ఈ మొక్కల్ని మన దేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. ఆ తర్వాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ, మనందరికీ ఇష్టమైన రాముడు, సీత, లక్షణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు.

పేరుకు తగ్గట్టుగానే ఈ పండులో సుగుణాలు కూడా మెండుగా ఉండు. రామ ఫలం లోపల గుజ్జు చాలా సాప్ట్ గా ఉంటుంది. అంతే కాదు ఈ పండులో అనేక ఔషధ గుణాలను కనుగొనడం జరిగింది. ఈ పండు తినడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ నివారించబడుతుంది. అంతే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతారు.

రామ ఫలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ, జుట్టు సమస్యలను నివారించడంలో నిజంగా రామఫలం దానికదే సాటి. రామఫలంలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. వీటిని అనేక చర్మ, జుట్టు సమస్యలను నివారించడంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఆలస్యం చేయకుండా రామ ఫలంలోని చర్మ, జుట్టుకు సంబంధించిన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

1. తలలో దురదను నివారిస్తుంది :

1. తలలో దురదను నివారిస్తుంది :

రామ ఫలంలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలలో దురద తగ్గిస్తుంది. దాంతో తలలో దురద, చీకాకును తొలగిస్తుంది. రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల ఇది తలలో దురద తగ్గిస్తుంది. హెల్తీ స్కిన్ అందిస్తుంది. రామ ఫలాన్ని చర్మానికి ఉపయోగించడానికి రామ ఫలంలోని గుజ్జును 5 స్పూన్లు తీసుకుని, అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ పెరుగు చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాడీకి లేదా చర్మానికి అప్లై చేసి, ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి.

2. మొటిమలను నివారిస్తుంది

2. మొటిమలను నివారిస్తుంది

మొటిమలను నివారించడంలో రామ ఫలంగా గ్రేట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు, చర్మ సమస్యలను నివారిస్తుంది. స్కిన్ కొత్త కణాలను పునరుత్పత్తి చేస్తుంది.

మొటిమలను నివారణకు రెండు స్పూన్ల రామ ఫలం గుజ్జు తీసుకోవాలి. తర్వాత అందులో రెండు స్పూన్ల పాలు, ఒక స్పూన్ అలోవెర జెల్, అరటీస్పూన్ పసుపు మిక్స్ చేయాలి. తర్వాత మొటిమలున్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు

3. యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు

ముఖంలో ముడతలు, మచ్చలు, చారలు వంటి ఏజింగ్ లక్షణాలను దూరం చేసుకోవాలంటే రెగ్యులర్ స్కిన్ కేర్ లో రామఫలం చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఫలంలో ఉండే యాంటీఆక్సిడెంట్ ఏజింగ్ లక్షణాలకు దారితీసే ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలో ముఖ్య పాత్రపోషిస్తుంది.అందుకోసం రెండు, మూడు స్పూన్ల రామఫలం పేస్ట్ తీసుకుని, అందులో అలోవెర జెల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిముషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. స్కిన్ రాషెస్ మరియు ఎగ్జిమా

4. స్కిన్ రాషెస్ మరియు ఎగ్జిమా

ముందుగా మనం సూచించినట్లు, రామఫలంలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ అయినా నివారిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా ఎగ్జిమాను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. కొద్దిగా రామఫలం పేస్ట్ తీసుకుని, లేదా రామఫలం వాటర్ తీసుకుని,ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి.

5. హైపర్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది

5. హైపర్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది

రామ ఫలంలో విటిమన్ సి మరియు ఆస్కార్బిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మం కాంతి పెంచడంలో, హైపర్ పిగ్మెంటేషన్ నివారిచండంలో ప్రధాణ పాత్ర పోషిస్తుంది. మీ చర్మం నల్లగా మారినా ఇతర సమస్యలున్నా, రామఫలం జ్యూస్ కు కొద్దిగా కొబ్బరినూనె మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. రాత్రుల్లో అప్లై చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, తర్వాత రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి.

6. తలలో దుర, చెమటను నివారిస్తుంది

6. తలలో దుర, చెమటను నివారిస్తుంది

తలలో దురద మరియు చుండ్రు, చెమట నివారించడంలో గ్రేట్ రెమెడీ. ఒక రామఫలం తీసుకుని, సగానికి కట్ చేసి, వాటర్ లో వేసి బాయిల్ చేయాలి. తర్వాత ఈ వాటర్ తీసుకుని, చల్లార్చి తర్వాత ఈ నీటిని తలకు ఉపయోగిస్తే తలలో దురద, ఇతర సమస్యలను నివారించబడుతాయి.

7. తలలో పేలను నివారిస్తుంది

7. తలలో పేలను నివారిస్తుంది

తలలో పేలను నివారించడంలో మంచి రెమెడీ. తలలో పేలు ఉన్నట్లైతే జుట్టు రాలడం, తలలో చుండ్రు, మురికి వంటి సమస్యలు అధికమౌతాయి. ఈ సమస్యలను నివారించుకోవాలంటే రెండు మూడు ముక్కలు రామఫలం తీసుకుని పేస్ట్ చేయాలి. తర్వాత దీనికి ఒక స్పూన్ మెంతి పౌడర్ జోడించి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీన్ని తలకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

8. చుండ్రు నివారిస్తుంది:

8. చుండ్రు నివారిస్తుంది:

తలను శుభ్రం చేసి, చుండ్రు సమస్యను నివారించడంలో రామఫలం గ్రేట్ గా పనిచేస్తుంది. రామఫలంను పేస్ట్ చేసి, తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు చుండ్రును ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.

English summary

Benefits Of Soursop (Ramphal) For Skin And Hair

Due to antibacterial and antiseptic properties found in soursop, it is widely included in numerous skin care and hair care products as well. Here we've mentioned about the benefits of using soursop (ramphal) for skin and hair. Read on further to know more.
Subscribe Newsletter