మీ పాదాల రక్షణకు 5 అద్భుతమైన చిట్కాలు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మన పాదాలు ఈ 2 కారణాల వల్ల త్వరగా పాలిపోయిన రంగులోకి మారుతున్నాయి.

అందులో 1, ఎండలో తిరగటం వలన ముఖ్యంగా బీచ్ ప్రయాణాలకు సమయంలో

2, బయటకు పాదాలు కనపడేటట్లుగా గా చెప్పులను వేసుకోవడం వలన

బలేరినాస్ (ballerinas) వంటి ఫుట్ వేర్ ను ధరించే మహిళలకు ఈ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ సమస్య మగ వారికి కూడా ఉంది. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే, ఎందుకంటే వారు పూర్తిగా కాలిని కప్పే పాదరక్షలను వాడతారు కాబట్టి.

లూజ్ స్కిన్ మరియు ముడుతలను మాయం చేసే హోం మేడ్ యాంటీఏజింగ్ క్రీమ్స్ ...

పాదాలు పాలిపోయిన సమస్య ఉన్న వారికి మాత్రమే దాని వల్ల కలిగే అనవసరమైన, అనుకోని ఎదురయ్యే సమస్యల గూర్చి బాగా తెలుస్తుంది. ఇలాంటి పాదాలతో మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ పాదాలు మరింత అంద-వికారంగా కనపడతాయి.

ఈ రోజుల్లో ఈ సమస్య అనేది సర్వసాధారణం, అలాగే వాటి నివారణ మార్గాలు కూడా చాలా ఉన్నాయి. సహజ సౌందర్య సాధనాల వాడకం ద్వారా ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందుతారో తెలిస్తే మీరే ఒక అభిప్రాయానికి వస్తారు.

మీ పాదాల సమస్య శాశ్వత నివారణకు, కూరగాయలతో కూడిన 5 రకాల టిప్స్ ని Boldsky వారి సహకారంతో మీకు అందిస్తున్నాము. వీటిని ట్రై చెయ్యడం ద్వారా మీరు శాశ్వత పరిష్కారాన్ని పొందగలరు.

స్కిన్ ట్యానింగ్ తొలగించుకోవడానికి 10 నేచురల్ రెమెడీస్

మీ పాదాల అందానికి తయారు చేసే "బ్యూటీ ప్యాక్" కోసం కావాల్సిన తాజా కూరగాయలు, ఇతర సామాగ్రిని గూర్చి ఒక సారి చూద్దాం.

1 వ. చిట్కా

1 వ. చిట్కా

కావలసినవి:

1 - టమోటా (ముక్కలుగా చేసినవి)

2 టేబుల్ స్పూన్ల - పెరుగు

2 టేబుల్ స్పూన్లు - తాజా నిమ్మ రసం

తయారు చేసే విధానం:

మొదటగా, టమోటా ముక్కలను గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

వేరోక గిన్నె లో, గట్టి పెరుగును తీసుకుని ఒక స్పూన్ తో మృదువైన అయ్యే వరకు బాగా కలపాలి.

ఇప్పుడు ఆ పెరుగుని, టమోటా పేస్ట్ ని, నిమ్మరసం తో జోడించడానికి బాగా కలపాలి.

ఈ విధంగా అన్ని పదార్ధాలను బాగా కలిసిన పూర్తి మిశ్రమాన్ని ఫుట్ ప్యాక్ కు సిద్ధంగా ఉందన్న మాట.

2 వ. చిట్కా

2 వ. చిట్కా

కావలసినవి:

1 - తాజా బంగాళాదుంప

తయారు చేసే విధానం:

బంగాళాదుంప తో పాలిపోయిన మీ చర్మం మీద అప్లై చేయ్యడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి.

మొదటగా, సిద్ధంగా ఉన్న బంగాళాదుంప తొక్కను తీసి నీటిలో కడగాలి. ఆ తర్వాత వాటిని ముక్కలుగా కోసిన తర్వాత, శరీరం పై కావల్సిన చోటులో ఆ బంగాళాదుంపల ముక్కతో బాగా రుద్దాలి.

(లేదా) తొక్క తీసిన బంగాళాదుంపను చిన్న ముక్కలుగా చేసి, దాన్ని మిక్సీలో వేసి బాగా ఆడించాలి. అలా వచ్చిన బంగాళాదుంప గుజ్జు నుండి బంగాళాదుంప రసాన్ని వేరు చేసి, ఆ రసాన్ని చర్మం పై కావలసిన చోట రాస్తే ఫలితం కనపడతుంది.

3 వ. చిట్కా

3 వ. చిట్కా

కావలసినవి:

2 టేబుల్ స్పూన్లు గుమ్మడికాయ గుజ్జు రసం

1/2 టీస్పూన్ దాల్చిన పొడి

1/2 టీస్పూన్ లవంగం పొడి

1/2 టీస్పూన్ అల్లం పొడి

1 టేబుల్ స్పూన్ చక్కెర

2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె (లేదా సన్-ఫ్లవర్ నూనె)

తయారు చేసే విధానం:

గుమ్మడికాయ తొక్కను తీసి నీటిలో కడగిన తర్వాత వాటిని ముక్కలుగా కోసి మిక్సర్ లో బాగా ఆడించాలి. అలా వచ్చిన గుమ్మడికాయ గుజ్జుకి ఒక గిన్నెలోకి తీసుకుని నూనె కలపాలి.

అప్పుడు, దాల్చిన చెక్క, లవంగం మరియు అల్లం - మూడు పొడులను పైన ఉన్న పేస్ట్ కి కలపాలి.

చివరిగా, గుమ్మడికాయ పేస్ట్ కి చక్కెర జోడించి, ఇప్పుడు పూర్తి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ ప్యాక్ ని కావలసిన చోట ఫుట్ ప్యాక్ గా పూర్తి స్థాయిలో వాడవచ్చు.

4 వ. చిట్కా

4 వ. చిట్కా

కావలసినవి:

1 చిన్న గిన్నె - తరిగిన పచ్చి క్యాబేజీ

1 టేబుల్ స్పూన్ - తేనె

పసుపు పొడి (చిటికెడు)

1 టేబుల్ స్పూన్ - శనగపిండి

తయారు చేసే విధానం:

తాజాగా ఉన్న క్యాబేజీని ముక్కలు కోసి, బాగా పేస్ట్ లా చేసి ఒక గిన్నె లోకి తీసుకుని ఉంచండి.

ఆ క్యాబేజీ పేస్ట్ కి తేనెను కలపాలి. ఈ మిశ్రమము అంటుకునే విధంగా ఉండాలి.

ఆ తరువాత, పసుపు మరియు శనగపిండి పొడులను పై మిశ్రమానికి కలపాలి.

ఇప్పుడు క్యాబేజీ మరియు పసుపు పాదాల ప్యాక్ వినియోగానికి సిద్దంగా ఉంది.

5 వ. చిట్కా

5 వ. చిట్కా

కావలసినవి:

1 - తాజా ఎర్ర ముల్లంగి దుంప

1 లీటరు - నీరు

అలాగే మీకు నచ్చిన నూనె ఏదైనా

తయారు చేసే విధానం:

ఒక ప్రెజర్ కుక్కర్లో తొక్క తీసి, ముక్కలు చేసిన ఎర్ర ముల్లంగి దుంపకి కాస్త నీటిని కలిపి కుక్కర్ మూతను మూసివేసి బాగా ఉడికించాలి.

అలా ఉడికించిన తర్వాత, ఒక గిన్నె లోకి దానిని తీసి చల్లారేంత వరకూ దానిని ఒక పక్కన పెట్టుకోవాలి. అలా చల్లారిన తరువాత, ఒక పేస్ట్ లా చేసుకోవాలి.

ఈ పేస్ట్ ని ఒక వారంలో కనీసం రెండుసార్లు చెప్పున చర్మం బాగా పాలిపోయిన ప్రాంతంలో మసాజ్ చెయ్యాలి.

English summary

Five Anti-tan Foot Pack Recipes That Offer Instant & Long-term Relief

Now when the problem of foot tan is so common and gross, there definitely exists many remedies for it. Cosmetic products to natural scrubs - it's on you to decide how to get rid of foot tan. Here is a suggestion of five vegetable-based anti-tan foot pack recipes that we recommend you to try to bid adieu to your feet tan problems for life.
Subscribe Newsletter