గార్లిక్ లో దాగున్న హెయిర్ అండ్ స్కిన్ బ్యూటీ సీక్రెట్స్

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

వెల్లుల్లి లోని ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరిక తెలిసిన విషయమే. గత కొన్ని ఏళ్ళగా వెల్లుల్లిని ఒక ఔషధంగా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇంతర పాపులారిటీ ఉన్న వెల్లుల్లిలో ఆరోగ్యానికి సంబంధించిన ఔషధగుణాలే కాదు, బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.

వెల్లుల్లిని హెల్తీ హెర్బ్ గా సూచిస్తారు. ఇందులో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటీర గుణాలు చాలా ఉన్నాయి. అదే క్రమంలోని ఈ వెల్లుల్లిలో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఎక్కువ. ముఖ్యంగా చర్మానికి, జుట్టుకు సంబంధించిన ప్రయోజనాలు ఎక్కువ .ఈ సీక్రెట్ నమ్మడానికి కాస్త ఇబ్బందిగా, ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. ఒకసారి ప్రయత్నిస్తే.. ఫలితాలు మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. వెల్లుల్లి చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది, అందులో ఉన్న బ్యూటి సీక్రెట్స్ ముందుగా తెలుసుకోవాలి

వెల్లుల్లిలోని 15 పవర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్

ఈ వెల్లుల్లిని చర్మానికి, జుట్టుకు రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల వండర్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.చాలా మంది స్కిన్ కేర్ ఎక్స్ పర్ట్ ఈ న్యాచురల్ రెమెడీని బ్యూటీ బెనిఫిట్స్ పొందడానికి రెకమెండ్ చేస్తున్నారు .

అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కంటే, ఈ ఒక్క కామన్ కిచెన్ ఐటమ్ ను రెగ్యులర్ బ్యూటీలో చేర్చుకోవడం మంచిది.

చర్మ అందాన్ని కానీ, జుట్టు అందాన్ని కానీ మెరుగుపరుచుకోవాలని కోరుకున్నప్పుడు, ఈ హోం మేడ్ రెమెడీని ఫాలో అవ్వడం ఉత్తమం. మరి వెల్లుల్లి చర్మ, జుట్టు సంరక్షణకు ఏవిధంగా ఉపయోగపడుతుంది. అందాన్ని ఎలా మెరుగుపడుతుందో తెలుసుకుందాం

గాార్లిక్ +సాల్ట్ తో మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్ ..!!

సూచన::ఇది చర్మానికి ఫర్ఫెక్ట్ రెమెడీ. అయితే వెల్లుల్లిలో ఉండే ఘాటైన అల్లిసిన్ చర్మం పై ప్రభావం చూపుతుంది. కాబట్టి, దీన్ని ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది

1. చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది

1. చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది

చర్మ రంద్రాల కారణంగా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, మొటిమలు వంటి అన్ని రకాల చర్మ సమస్యలు ఎదురౌతాయి. కాబట్టి, చర్మ రంద్రాలు ఏర్పడకుండా, లేదా చర్మం రంద్రాల్లో దుమ్ము ధూళీ, శుభ్రం చేసుకోవాలి.

అందుకు వెల్లుల్లి ఉత్తమ రెమెడీజ ఇది చర్మ రంద్రాల్లోని మురికిని తొలగించి ఎక్స్ ఫ్లోయేట్ చేయడంలో గొప్పగా సహాయపడుతుంది.

2. మొటిమలను నివారిస్తుంది

2. మొటిమలను నివారిస్తుంది

యాంటీబ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల చర్మంలో మురికి వల్ల మొటిమలకు కారణం అవుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, స్కిన్ బెనిఫెటిక్ యాంటీఆక్సిడెంట్స్ మొటిమలను మచ్చలను నివారిస్తుంది. దీన్ని వారంలో ఒకసారి మొటిమల మీద అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది

3. బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది

3. బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది

బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు మీద, గడ్డ వద్ద వస్తుంటాయి. ఇవి నల్ల మచ్చలు కాకపోయిన ఈ ప్రదేశాల్లో చర్మంలోంచి బయటకు పొడుచుకుని వచ్చ అసహ్యంగా కనబడుట వల్ల చర్మం చూడటానికి అందవిహీనంగా కనబడుతుంది.

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, బ్లాక్ హెడ్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి బ్లాక్ హెడ్స్ లేకుండా నివారించుకోవడానికి వెల్లుల్లి పేస్ట్ ను ఉపయోగించండి

4. యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది

4. యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది

చర్మంలో వయస్సుకు సంబంధించిన ముడుతలు, చారలు, డల్ స్కిన్ నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ రెమెడీ. వయస్సు అయ్యే లక్షణాలను బయటకు కనబడనివ్వకుండా చేస్తుంది

ఒక గుడ్డులోని తెల్లసొన, 5చుక్కల ఆల్మండ్ ఆయిల్, 2 ఎండిన వెల్లుల్లి రెబ్బల పొడి తీసుకోవాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గిస్తుంది

5. స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గిస్తుంది

స్ట్రెచ్ మార్క్స్ నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ రెమెడీ. ఇది హోం ట్రీట్మెంట్ లా పనిచేస్తుంది. పాత స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది. అలాగా కొత్తగా ఎలాంటి చారలు ఏర్పడకుండా నివారిస్తుంది.

6. జుట్టు రాలడం తగ్గిస్తుంది

6. జుట్టు రాలడం తగ్గిస్తుంది

వెల్లుల్లిలో ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. అవి హెయిర్ గ్రోత్ ని మెరుగుపరుస్తాయి. గోరు వెచ్చని గార్లిక్ ఆయిల్ ని స్కాల్ప్ కి మసాజ్ చేయాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. జుట్టు వేగంగా పెరుగుతుంది.

జుట్టు రాలడం సమస్య ప్రతి పది మందిలో ఎనిమంది బాధపడుతున్నారు. వెల్లుల్లిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం మాత్రమే కాదు, జుట్టు తెగకుండా, తిరిగి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

7. చుండ్రు నివారిస్తుంది

7. చుండ్రు నివారిస్తుంది

ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, చుండ్రు నివారించడంలో గ్రేట్ రెమెడీ. ఇంకా ఇందులో ఉండే గుణాలు తలలో దురద కూడా తగ్గిస్తుంది. రెగ్యులర్ గా వెల్లుల్లి తలకు ఉపయోగిస్తుంటే, ఇది ఇక ముందు చుండ్రు, తలలో ఇతర స్కాల్ఫ్ సమస్యలు రాకుండా నివారిస్తుంది.

8. హెయిర్ ఫాలీ సెల్స్ ను బలోపేతం చేస్తుంది

8. హెయిర్ ఫాలీ సెల్స్ ను బలోపేతం చేస్తుంది

వెల్లుల్లిలో ఉండే న్యాచురల్ పవర్ ఆఫ్ విటమిన్స్, మరియు ఐరన్ వంటివి నిర్జీవంగా ఉన్న జుట్టును తిరిగి స్ట్రాంగ్ గా మార్చుతుంది. దీన్ని జుట్టుకు రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీన్ని నేరుగా అప్లై చేయడం లేదా ఇతర నూనెలతో కలిపి ఉపయోగించడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

9. తలను శుభ్రపరుస్తుంది

9. తలను శుభ్రపరుస్తుంది

తలను శుభ్రపరుస్తుంది. వెల్లుల్లి డిటాక్సిఫై చేస్తుంది. వెల్లుల్లిని తలకు శుభ్రపరచడానికి ఉపయోగించడం ఇది ఒక పాత పద్దతే అయిాన, ఇది తలో మలినాలన్నింటిని తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

10. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది

10. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది

జుట్టు చాలా పల్చగా మారడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యల నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది హెయిర్ ఫ్రెండ్లీ కాంపౌండ్, హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది. జుట్టు ఒత్తుగా పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Here's What Garlic Can Do To Your Skin and Hair

Check out the beauty benefits of garlic for skin and hair care.
Story first published: Wednesday, October 25, 2017, 10:20 [IST]