మృదువైన, కోమలమైన పాదాల కోసం హోంమేడ్ ఫ్రూట్ స్క్రబ్ రెసిపీస్

Subscribe to Boldsky

ఫుట్ కేర్ అనేది ఈ కాలంలో ఏ మాత్రం లక్జరీ కానేకాదు. నిజానికి, ఇది ఒక అవసరమైన ప్రక్రియ. అయినప్పటికీ, కేవలం కొంతమంది మాత్రమే తమ పాదాలకు చక్కని సంరక్షణని అందిస్తున్నారు. సంరక్షణని అందించనివారు పగిలిన పాదాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి, ఫుట్ కేర్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుని మీ పాదాల సౌందర్యాన్ని సంరక్షించుకోండి.

సరైన స్కిన్ కేర్ తీసుకోకపోవడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం వలన చర్మం డ్రైగా, డల్ గా అలాగే పగుళ్లతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. వీటన్నిటినీ అరికట్టడానికి మీరు వారానికొకసారి ఎక్స్ఫోలియేషన్ అనే ప్రక్రియను పాటించాలి.

Homemade Foot Scrub Recipes To Pamper Your Feet

మీ పాదాలని గారాబం చేయడానికి ఇంటివద్దే సులభంగా తయారుచేసుకోగలిగిన ఫుట్ స్క్రబ్ రెసిపీలు

మీ పాదాలు రఫ్ గా అలాగే పగుళ్లతో అందవిహీనంగా ఉన్నాయా? అందువలన పాదాలను తరచూ సాక్సులతో కవర్ చేస్తూ ఉన్నారా? అయితే, ఈ ఆర్టికల్ మీ కోసమే. ఇందులో, సమర్థవంతమైన కొన్ని ఫుట్ స్క్రబ్ రెసిపీలను పొందుపరచాము. వీటిని మీరు ఇంటివద్దే సులభంగా తయారుచేసుకోవచ్చు. వీటి తయారీకి చౌకైన సహజసిద్ధమైన పదార్థాలను వినియోగించవచ్చు.

వారానికి ఒకసారి వీటితో మీ పాదాలను గారాబం చేస్తే కోమలమైన, అందమైన పాదాలు మీ సొంతమవుతాయి.

ఈ స్క్రబ్స్ ని తయారుచేయడానికి వాడిన పదార్థాలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి, చర్మంపైన పేరుకుని ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి. అలాగే, ఈ పదార్థాలని కలిపి వాడితే ఇవి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి.

కొబ్బరి నూనె, ఓట్ మీల్, బ్రౌన్ షుగర్ వంటి పదార్థాలకు చర్మాన్ని కోమలంగా అలాగే మృదువుగా చేసే లక్షణాలు కలవు. అంతే కాదు, ఈ పదార్థాలు మీకు సులభంగా మీ వంటింట్లోనే లభిస్తాయి. వీటిని వాడటం సురక్షితం కూడా.

కాబట్టి, ఇంకెందుకాలస్యం. మీ పాదాలకు వారానికి ఒకసారి ఈ స్క్రబ్స్ ను వాడుతూ చక్కని సంరక్షణని అందించండి.

ఈ రెసిపీల వివరాలను చూడండి మరి.

1. బ్రౌన్ షుగర్ కోకొనట్ ఆయిల్ + పెప్పెర్మింట్ ఎసెన్షియల్ ఆయిల్

1. బ్రౌన్ షుగర్ కోకొనట్ ఆయిల్ + పెప్పెర్మింట్ ఎసెన్షియల్ ఆయిల్

రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ ని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ తో కలిపి అందులో ఆరు నుంచి ఏడు చుక్కల పెప్పెర్మింట్ ఎసెన్షియల్ ఆయిల్ ను జోడించండి.

ఈ మిశ్రమాన్ని మీ పాదాలపై స్క్రబ్ లాగా వినియోగించి అయిదు నుంచి పదిహేను నిమిషాల వరకూ ఈ పద్దతిని కొనసాగించండి.

ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో మీ పాదాలను శుభ్రపరచండి.

2. సీసాల్ట్ హనీ + మింట్ జ్యూస్

2. సీసాల్ట్ హనీ + మింట్ జ్యూస్

రెండు నుంచి మూడు స్పూన్ల సీసాల్ట్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ హనీని కలపండి. ఇప్పుడు, ఇందులో ఒక టీస్పూన్ మింట్ జ్యూస్ ను కలపండి.

ఈ మిశ్రమాన్ని పాదాలకి సున్నితంగా అప్లై చేసి స్క్రబ్ లా కొన్ని నిమిషాల పాటు రబ్ చేయండి.

ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో పాదాలను శుభ్రపరచుకోండి.

3. ఓట్ మీల్ ఆలివ్ ఆయిల్ + లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

3. ఓట్ మీల్ ఆలివ్ ఆయిల్ + లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

ఒక పాత్రలో రెండు టీస్పూన్ల వండిన ఓట్ మీల్ ను తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను అలాగే ఏడు నుంచి ఎనిమిది చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను జోడించండి.

వీటిని బాగా కలిపిన తరువాత ఈ మిశ్రమంతో మీ పాదాలను దాదాపు పది నిమిషాల పాటు స్క్రబ్ చేయండి

ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో పాదాల్ని శుభ్రంగా కడగండి.

4. బేకింగ్ సోడా ఆల్మండ్ పౌడర్ + మయోన్నైస్

4. బేకింగ్ సోడా ఆల్మండ్ పౌడర్ + మయోన్నైస్

ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ పౌడర్ ను అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మయొనైస్ ను కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ పాదాలపై అప్లై చేసి పది నిమిషాల పాటు స్క్రబ్ చేయండి.

ఆ తరువాత మీ పాదాలని గోరువెచ్చటి నీటిలో కాసేపు ముంచి ఉంచండి. ఆ తరువాత, పాదాలపై ఫుట్ క్రీమ్ ను అప్లై చేయండి.

5. కాఫీ గ్రౌండ్స్ లెమన్ జ్యూస్ + అలొవేరా జెల్

5. కాఫీ గ్రౌండ్స్ లెమన్ జ్యూస్ + అలొవేరా జెల్

ఒక పాత్రలో, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ గ్రౌండ్స్ ని తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ ని అలాగే మూడు టీస్పూన్ల అలో వెరా జెల్ ని కలపండి.

ఈ పదార్థాలని బాగా కలిపి పాదాలపై జాగ్రత్తగా అప్లై చేయండి.

ఆ తరువాత అయిదు నుంచి పది నిమిషాల పాటు మీ పాదాలని జాగ్రత్తగా స్క్రబ్ చేయండి.

6. రైస్ ఫ్లోర్ మిల్క్ + గ్రామ్ ఫ్లోర్

6. రైస్ ఫ్లోర్ మిల్క్ + గ్రామ్ ఫ్లోర్

రెండు టీస్పూన్ల రైస్ ఫ్లోర్ ను తీసుకుని అందులో ఒక టీస్పూన్ గ్రామ్ ఫ్లోర్ ను అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ ను కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ పాదాలపై జాగ్రత్తగా అప్లై చేసి సున్నితంగా కొద్ది నిమిషాల వరకూ స్క్రబ్ చేయండి.

ఆ తరువాత, మీ పాదాలని వెచ్చటి నీటిలో కాసేపు ముంచండి.

కొద్దిసేపటి తరువాత, పాదాలని బాగా తుడిచి ఫుట్ క్రీమ్ ను అప్లై చేసుకోండి.

7. గ్రాన్యులేటెడ్ షుగర్ ఆరెంజ్ పీల్ పౌడర్ + రోజ్ వాటర్

7. గ్రాన్యులేటెడ్ షుగర్ ఆరెంజ్ పీల్ పౌడర్ + రోజ్ వాటర్

రెండు టేబుల్ స్పూన్ల గ్రాన్యులేటెడ్ షుగర్ ని ఒక టీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ తో కలిపి అందులో మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ని కలపండి.

ఈ మిశ్రమాన్ని పాదాలపై బాగా రాసి పది నిమిషాల వరకు స్క్రబ్ చేయండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ పాదాలను శుభ్రపరుచుకోండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Homemade Foot Scrub Recipes To Pamper Your Feet

    Build-up of dead skin cells along with improper skin care can often lead to dry, dull and cracked feet. To prevent that from happening, it is essential to exfoliate your feet skin on a weekly basis. So check out the best homemade scrubs that you can try to pamper your feet. Some of the natural ingredients such as peppermint oil,
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more