నక సిక సౌందర్యానికి 9 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ప్రతి స్త్రీ బాగా సురక్షితమై మరియు అద్భుతమైన గోర్లు కలిగి ఉండాలని కలలు కంటుంది. అంతే కాక గోర్లు గుండ్రంగా లేదా నలుచదరం, దోషరహిత మరియు బలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అనేక మందికి ఇది కలగానే ఉండిపోతుంది. ఎందుకంటే మహిళలు ఇంటి పనులు ఎక్కువగా చేస్తుండటం, చేతులు డిటర్జెంట్స్ వంటివి తగలడం వల్ల గోళ్లు మద్యలోకి కట్ అవుతుంటాయి.

కొన్ని పరిశోధనల ప్రకారం, నెయిల్ క్రాక్ అవ్వడం, చిట్లడం, బ్రేక్ అవ్వడం సహజం. అందుకు మూడు ముఖ్యమైన కారణాలున్నాయి. వాటిలో ఒకటి నెయిల్స్ నెయిల్ పాలిష్ ఎక్కువగా అప్లై చేయడం, ఎక్కువగా నీళ్లలో తడవటం లేదా కెమికల్స్ లేదా వయస్సు . అలాగో మరికొన్ని అసాధారణమైన కారణాలు మెడికల్ రీజన్స్, పోరియోసిస్, అనీమియా, ఎగ్జిగామ, ఎండోక్రైన్ డిజార్డర్స్ వంటి కారణాల వల్ల కూడా నెయిల్స్ స్పిట్ల్ అవ్వొచ్చు. ఈ సమస్యను నివారించుకోవడానిక కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. టీ ట్రీ ఆయిల్ :

1. టీ ట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ పవర్ ఫుల్ యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలున్నాయి. ఇది నెయిల్స్ బ్రేక్ కాకుండా స్పిట్ల్ కాకుండా నివారిస్తుంది. గోల్లో రకంగు కూడా మారకుండా నేచురల్ గా ఉంచుతుంది. 3-4 చుక్కలు టీట్రీ ఆయిల్ తీసుకుని, అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

2. ఆలివ్ ఆయిల్ :

2. ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ ను చేతి గోళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయాలి. గోరువెచ్చగా చేసిన నూనెను కూడా అప్లై చేయవచ్చు. ఇది చౌకైన నెయిల్ ట్రీట్మెంట్ . పీలింగ్ నివారిస్తుంది. నెయిల్స్ చిట్లడం , బ్రేక్ అవ్వడం నివారిస్తుంది. అలాగే వెజిటేబుల్ ఆయిల్ కూడా రాత్రుల్లో నిద్రించే ముందు గోళ్ళకు అప్లై చేసి పడుకోవచ్చుజ ఒక వారం రోజుల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది

3. విటమిన్ ఇ ఆయిల్ :

3. విటమిన్ ఇ ఆయిల్ :

బాడీలో మాయిశ్చరైజర్ మరియు విటమిన్ల లోపం వల్ల గోళ్ళు వీక్ గా మరియు చిట్లనిట్లుగా మారుతాయి. విటమిన్ ఇ ఆయిల్ గోళ్ళకు కావల్సిన హైడ్రేషన్ ను అందిస్తుంది. మాయిశ్చరైజ్ చేస్తుంది. గోళ్ళు డ్రైగా మారకుండా నివారిస్తుంది. ఒక విటమిన్ ఇ క్యాప్స్యూల్ తీసుకుని చేతికి అప్లై చేయాలి. గోళ్ళకు 10 నిముషాల పాటు మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. యాపిల్ సైడర్ వెనిగర్ :

4. యాపిల్ సైడర్ వెనిగర్ :

బ్రిటిల్ నెయిల్ కు మరో ఎఫెక్టివ్ రెమెడీ యాపిల్ సైడర్ వెనిగర్. ఇందులో న్యూట్రీషియన్స్, విటమిన్స్, ఐరన్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. యాపిల్ సైడర్ వెనిగర్ ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. గోళ్ళల్లో డ్రైనెస్ తగ్గిస్తుంది. వాటర్ లో యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి వేళ్ళకు అప్లై చేసి 10 నిముషాలు మసాజ్ చేయాలి.

5. కొబ్బరి నూనె

5. కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ సెప్టిక్ లక్షనాలు వీక్ గా ఉన్న నెయిల్ కు పోషణను అందిస్తుంది. గోళ్ళను స్ట్రాంగ్ గా మార్చుతుంది. కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేసి గోళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ హోం రెమెడీని రిపీట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగో కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి కూడా మసాజ్ చేసుకోవాలి.

6. బయోటిన్ రిచ్ ఫుడ్స్ :

6. బయోటిన్ రిచ్ ఫుడ్స్ :

వీక్ , డ్రై, మరియు చిట్లిన గోళ్ళ సమస్య ఉన్నవారు బయోటిన్ రిచ్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. అవొకాడో, గుడ్డు, త్రుణధాన్యాలు మొదలగునవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి పోషణను అందిస్తాయి. నెయిల్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి. అలాగే రెగ్యులర్ గా బయోటిన్ సప్లిమెంట్ ను కూడా తీసుకోవచ్చు.

7. క్యూటికల్ క్రీమ్స్ :

7. క్యూటికల్ క్రీమ్స్ :

గోళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే క్యూటికల్ క్రీమ్స్ అప్లై చేయడం మంచిది. క్యూటికల్ క్రీమ్స్ హై క్వాలిటి విటమిన్ ఇ ను అందస్తుంది. దాంతో గోళ్ళకు తగిన హైడ్రేషన్ అందుతుంది. ఈ క్రీమ్ తో గోళ్ళను మసా.్ చేయడం వల్ల గోళ్ళు చిట్లకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎక్కువ సేపు నీటిలో నాని, మరీ డ్రైగా మారిన గోళ్ళు బ్రేక్ అవ్వడానికి ఎలాంటి కారణాలైనా క్యూటికల్ క్రీమ్ నివారిస్తుంది.

8. నెయిల్ పాలిష్ ను అవాయిడ్ చేయాలి :

8. నెయిల్ పాలిష్ ను అవాయిడ్ చేయాలి :

నెయిన్ పాలిష్ మరియు నెయిల్ పాలిష్ రిమూవర్ ను ఎక్కువగా ఉపయోగించకపోవడం మంచిది. నెయిల్ పెయింట్ నెయిన్ పెయింట్ రిమూవర్ లో ఆల్కహాల్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే అసిటోన అనే కంటెంట్ గోళ్ళను డ్యామేజ్ చేస్తుంది. గోళ్ళను హెల్తీగా మెయింటైన్ చేయలంటే వీటికి దూరంగా ఉండటమే మంచిది.

9. హైడ్రేషన్ :

9. హైడ్రేషన్ :

ఎక్కువ నీళ్ళు తాగాలి. శరీరానికి తగినంత నీళ్ళు అందివ్వడం ద్వారా నెయిల్స్ కూడా హైడ్రేషన్ లో ఉంటాయి. రేడియంట్ గా కూడా కనబడుతాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How To Prevent Nails From Breaking

    Broken nails are not only painful physically, but also painful emotionally, for most of the women. Here are some ways by which you can prevent them from breaking.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more