వావ్ : సువాసనభరిత దాల్చిన చెక్కతో బ్యూటిఫుల్ లుక్స్ మీ సొంతం..

Posted By:
Subscribe to Boldsky

ఇండియన్ మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి. ఇది కేవలం ఆహారాలకు మంచి సువాసన, రుచి మాత్రమే అందివ్వడం కాదు, ఇది ఆరోగ్యానికి అందానికి కూడా మెండుగా ప్రయోజనాలను అందిస్తుంది. బ్యూటీ విషయంలో చర్మం మరియు జుట్టుకు గ్రేట్ గా సహాయపడుతుంది.

దాల్చిన చెక్కను మన ఇండియన్ కుషన్స్ లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. మరి బ్యూటిలో ఎప్పుడైనా ఉపయోగించారా? అసలు ఆ ఆలోచనైనా మీకు కలిగిందా..?

How To Use Cinnamon In Your Makeup Routine

బ్యూటిని మెరుగుపరచడంలో దాల్చిన చెక్క వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఫంగల్ ప్రొపర్టీస్ అధికంగా ఉన్నాయి. ఇది చర్మ సంరక్షణాలో అమేజింగ్ ఫలితాలను అందించినట్లు నిరూంచుకొన్నది.

మరికెందుకు ఆలస్యం మీ రెగ్యులర్ బ్యూటి రింజిమ్ లో దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించుకోవాలో ఒకసారి తెలుసుకోండి..

జుట్టు మంచి రంగు, మెరిసే తత్వాన్ని అందిస్తుంది:

జుట్టు మంచి రంగు, మెరిసే తత్వాన్ని అందిస్తుంది:

తెల్లజుట్టు ఉన్నవారికి వాటిని కవర్ చేస్తూ నేచురల్ రెడ్ కలర్ ను అందిస్తుంది. అదే విధంగా చర్మసంరక్షణకు కూడా ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ ను హెయిర్ కండీషనర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ ను షాంపుతో చేర్చి ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రెగ్యులర్ గా ఉపయోగించే హెయిర్ ప్యాక్స్ కు దాల్చిన చెక్క పొడి చేర్చి హెయిర్ ప్యాక్ వేసుకుని రెండు మూడు గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

ఎక్సలెంట్ ఫేస్ స్క్రబ్

ఎక్సలెంట్ ఫేస్ స్క్రబ్

ఇది అద్భుతమైన ఫేస్ స్ర్కబ్ గా పనిచేస్తుంది. గ్లోయింగ్ మరియు హెల్తీ స్కిన్ అందిస్తుంది. కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ తీసుకుని అందులో దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి స్ర్కబ్ చేసి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఈ ఫేస్ స్ర్కబ్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫేస్ స్ర్కబ్ బల్ల డెడ్ స్కిన్ సెల్స్ సులభంగా తొలగిపోతుంది. దాల్చిన చెక్క పౌడర్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల హెల్తీ స్కిన్ పొందవచ్చు.

గ్లోయింగ్ ఫౌండేషన్ :

గ్లోయింగ్ ఫౌండేషన్ :

మేకప్ ను మరింత గోల్డెన్ ఫిష్ తో ముగించాలంటే దాల్చిన చెక్ సహాయపడుతుంది. కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ తీసుకుని అందులో కొద్దిగా ఫౌండేషన్ లూజ్ పౌడర్ తో మిక్స్ చేయాలి. ఈ ఫౌండేషన్ ను చర్మానికి అప్లై చేస్తే గ్లోయింగ్ టచ్ వస్తుంది.

నేచురల్ ఫేస్ పౌడర్ :

నేచురల్ ఫేస్ పౌడర్ :

చాలా వరకూ అమ్మాయిలందరూ అందంగా కనబడాలని కోరుకుంటారు. కొంత మంది మేకప్ ను అస్సలు ఇష్టపడరు. కాబట్టి, అలాంటి వారు వారు స్వతహాగా నేచురల్ ఫేస్ పౌడర్ ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. కార్న్ స్ట్రార్చ్ పొడి కి కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేిస ముఖానికి పౌడర్ లా ఉపయోగించుకోవచ్చు.

నేచురల్ లిప్ బామ్ :

నేచురల్ లిప్ బామ్ :

దాల్చిన చెక్క్ పొడికి కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేసి పెదాలకు అప్లై చేస్తే నేచురల్ లిప్ బామ్ లా పనిచేస్తుంది. ముఖ్యంగా డ్రై లిప్స్ ను నివారిస్తుంది.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

దాల్చిన చెక్క పౌడర్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముఖంలో మొటిమలను మచ్చలను తొలగిస్తుంది. కొద్దిగా దాల్చిన చెక్క పొడి తీసుకుని, అందులో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా మిక్స్ చేసి, మొటిమలు, మచ్చల మీద అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని రోజుకు రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

How To Use Cinnamon In Your Makeup Routine

Cinnamon is particularly used for weight loss, but let us tell you that this magical herb is of great use on the skin and hair as well. Although cinnamon is a common spice found in Indian kitchen, did you ever think about including it in your makeup routine?
Story first published: Saturday, April 1, 2017, 19:00 [IST]
Subscribe Newsletter