స్త్రీలు సెలబ్రెటీవలె ఫ్యాషనబుల్ గా కనిపించాలంటే బాడీ మీద టాటూ ఎక్కడ వేయించుకోవాలి..?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

స్తీలైనా పురుషులైనా ఈరోజుల్లో పచ్చబొట్టు పొడిపించుకోవడం అనేది ఒక సహజ నాగరికత. స్త్రీ టాటూ వేయించుకోవాలి అనుకున్నపుడు, టాటూ వేయించుకోవాలి ఆనుకున్న ప్రదేశాన్ని ముందుగానే నిర్ధారించుకోవాలి.

ఒక స్త్రీకి, టాటూ వేయించుకోవడానికి ఖచ్చితమైన ప్రదేశం ఎదో గుర్తించడం చాలా ముఖ్యం. ఒక టాటూ స్త్రీ ఆకర్షణను మెరుగుపరుస్తుంది, టాటూ వేయించుకుంటే బాగుండే ఖచ్చితమైన ప్రదేశం ఏది?

ఒక స్త్రీ ఏ స్థానంలో టాటూ ఆకర్షణీయంగా కనిపిస్తుందో అది పరిగణించుకోవాలి, ఇది ఆమె రూపాన్నే కాకుండా స్త్రీత్వాన్ని కూడా మేరుగుపరిచేలా చేస్తుంది. తుది మెరుగులు దిద్దేముందే పచ్చబొట్టు పొడిచే ప్రదేశాన్ని పునః పరిశీలించుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు అవసరమైనపుడు మీరు దాన్ని దాచవచ్చు.

మీరు దానిని పొందడానికి ఎక్కువ కంగారు పడితే, మీరు ఆకర్షణ, సౌందర్యం జోడించే స్త్రీత్వ ప్రదేశాలను గుర్తించండి.

1. పాదం మీద

1. పాదం మీద

ఒక స్త్రీ టాటూ వేయించుకోవడానికి ఉత్తమమైన ప్రదేశాలలో పాదం ఒకటిగా గుర్తించబడింది. ఒక స్త్రీ పాదాల మీద పూల ఆకృతులను వేయించుకోవచ్చు లేదా ఒక రకమైన స్త్రీ డిజైన్ వేయించుకోవచ్చు. పాదాల మీద పచ్చబొట్టు ఎత్తుమడాల చెప్పులతో చాలా అందంగా కనిపిస్తాయి.

2. భుజ౦మీద

2. భుజ౦మీద

ఏ స్త్రీకైనా భుజం ఒక శృంగారమైన, ఆకర్షణీయమైన ప్రదేశం, ఇది ఆమె అందంగా, శృంగారంగా కనిపించేట్టు చేస్తుంది. చాలామంది స్త్రీలు భుజంపై పచ్చబొట్టు పొడిపించుకోవడానికే ఇష్టపడతారు, ఎందుకంటే అది అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఒక స్టార్ ని ఎంచుకోవచ్చు, ఆ ప్రాంతంలో సీతాకోకచిలుక లేదా చాలా చిన్న టాటూ వేయించుకోవచ్చు. అక్కడ పెద్ద పెద్ద టాటూ లు వేయించుకోవద్దు.

3. తుంటి

3. తుంటి

మీరు ఒక ప్రత్యేకమైన స్త్రీ అయితే, టాటూ వేయించుకోవడానికి మంచి ప్రదేశం వెతుకుతుంటే, మీ తుంటి ప్రదేశం మీకు సరైనదని మేము సూచిస్తాము. ఒక చిన్న సరదాతో కూడిన, అమ్మాయి, మంచి ప్రదేశం, దాన్ని మీరు అన్ని సమయాల్లో దాచవచ్చు, కేవలం "ప్రత్యేకమైన సందర్భాలలో" మాత్రమే చూపించవచ్చు. అందువల్ల, మీ తుంటి మీద టాటూ వేయించుకుంటే మీ అందాన్ని మరింత ప్రత్యెక ఆకర్షణ తెస్తుంది.

4. చెవుల వెనుక

4. చెవుల వెనుక

మీరు చాలా సున్నితమైన, సిగ్గు వైఖరి గల అమ్మాయి అయితే, మీరు చెవి వెనుక భాగంలో టాటూ వేయించుకోండి. చెవులు చాలా లేతగా, మృదువుగా ఉంటాయి, అందువల్ల మీరు చెవుల వెనుక భాగంలో టాటూ వేయించుకునే టపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ, మీరు చెవు వెనుక భాగంలో టాటూ వేయించుకోవాలి అనుకుంటే, చాలా చిన్న పరిమాణంలో ఉన్న టాటూ లను ఎంచుకోండి. అవసరం లేనపుడు, వాటిని మీరు మీ జుట్టుతో లేదా మేకప్ తో కవర్ చేయోచ్చు.

5. మణికట్టు దగ్గర

5. మణికట్టు దగ్గర

మణికట్టు స్త్రీలు టాటూ లు వేయించుకునే మరో సాధారణ ప్రదేశం. మణికట్టు మీద టాటూ వేయించుకోవడం అనేది స్త్రీలకూ ఒక మంచి ప్రదేశం. ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశం, ఇది అందాన్ని ఇనుమడింప చేసి, స్త్రీ అందానికి తగిన కారకంగా ఉంటుంది.

6. వెనుక భాగం

6. వెనుక భాగం

స్త్రీ టాటూ వేయించుకోవడానికి వీపు ఒక సాధారణమైన ప్రదేశం. చాలామంది స్త్రీలు టాటూ ను వీపు మీద వేయించుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే అది వారు అవసరమైనపుడు మాత్రమే కనిపించడానికి ఇష్టపడతారు, లేకపోతే దాన్ని కప్పి ఉంచుతారు. అంతేకాకుండా, బాగా పొడవైన టాటూ కావాలనుకునే స్త్రీ, వీపు మీద మాత్రమే టాటూ ను వేయి౦చుకుంటుంది, ఆమె తన పిచ్చితో విర్రవీగడానికి అదే సరైన ప్రదేశం.

English summary

These Are The Feminine Spots Where Women Can Get Tattoos

This article will describe about some of the best places for a woman to get a tattoo done, read on!
Subscribe Newsletter