డార్క్ ఆర్మ్ పిట్స్ నుంచి ఉపశమనమందించే పది ఆపిల్ సైడర్ వెనిగర్ హోంరెమెడీస్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

డార్క్ అండర్ ఆర్మ్స్ అనే సమస్య అనేది తలెత్తడానికి వివిధ అంశాలు కారణమవుతాయి. ఆల్కహాల్ తో తయారయ్యే డియోడరెంట్స్ ని అలాగే వైటనింగ్ క్రీమ్స్ ని వాడటం వలన ఈ సమస్య తలెత్తుతుంది. చంకలు నల్లబడడానికి ఇవి కాక మరికొన్ని అంశాలు కూడా కారణమవుతాయి.

షేవింగ్: చంకలలోని అవాంఛిత రోమాలను షేవింగ్ ద్వారా తొలగించుకోవడం వలన కూడా చంకలు నల్లబడతాయి. అంతేకాక, షేవింగ్ వలన మంట కూడా కలుగుతుంది. తద్వారా, చర్మం మరింత నల్లగా అలాగే కఠినంగా మారుతుంది.

how apple cider vinegar helps to prevent dark armpit

చెమట: చెమట అధికంగా పడితే చంకలు నల్లబడతాయి. చంకలకు తగినంత గాలి తగలేకపోవటం వలన అలాగే బిగుతుగా ఉండే వస్త్రాలను ధరించడం వలన చర్మానికి గాలి తగలదు. తద్వారా, చంకలు నల్లబడతాయి.

ప్రెగ్నన్సీ: ప్రెగ్నన్సీ వలన శరీరంలో హార్మోన్ల ఛేంజెస్ ఏర్పడతాయి. ఇది, పిగ్మెంటేషన్ సమస్యకు దారితీస్తుంది.

చంకలలో నల్లదనాన్ని ఆపిల్ సిడర్ వినెగార్ తో ఎలా నిరోధించవచ్చు?

  • చంకలలో నల్లదనాన్ని తొలగించేందుకు ఏపిల్ సిడర్ వినేగార్ ఏ విధంగా ఉపయోగపడుతుంది?
  • అల్ఫా హైడ్రాక్సీ తో పాటు అమినో యాసిడ్స్ అనేవి ఆపిల్ సిడర్ వినేగార్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ, డెడ్ స్కిన్ ని అలాగే చర్మంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి.
  • అలాగే ఆపిల్ సిడర్ వినేగార్ అనేది డెడ్ స్కిన్ ని తొలగించి మచ్చలను నిర్మూలిస్తుంది.
  • ఆపిల్ సిడర్ వినేగార్ లోనున్న యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ ప్రాపర్టీలు బాక్టీరియాను అంతం చేసి చర్మంపైనున్న అదనపు నూనెను అలాగే దుమ్మును తొలగిస్తుంది.

చర్మంలోనున్న పిహెచ్ బాలన్స్ ను పునరుద్ధరిస్తుంది.

సహజసిద్ధమైన అస్ట్రింజెంట్ గా పనిచేస్తూ క్రమంగా చర్మాన్ని లైటెన్ చేస్తుంది.

ఈ ఆర్టికల్ లో ఆపిల్ సిడర్ వినేగార్ ని ఉపయోగించే పది ఉత్తమమైన పద్దతులను వివరించాము. వీటిని ఒకసారి పరిశీలిద్దాం.

ఆపిల్ సిడర్ వినేగార్

ఆపిల్ సిడర్ వినేగార్

దీనిని నేరుగా చంకలలో అప్లై చేసుకోవచ్చు.

విధానం:

ఒక పాత్రలో ఆపిల్ సిడర్ వినేగార్ ను నింపి అందులో కాటన్ బాల్ ను ముంచండి.

ఈ కాటన్ బాల్ తో చంకలపై అప్లై చేయండి.

ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసిన ఆపిల్ సిడర్ వినేగార్ ను అలాగే ఉంచండి.

ఈ పద్దతిని ప్రతి రోజూ పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు బేకింగ్ సోడా

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలోనున్న సోడియం మరియు పిహెచ్ న్యూట్రలైజర్ అనేవి చర్మంలోని డెడ్ సెల్స్ ని తొలగిస్తాయి. అలాగే, చర్మాన్ని తెల్లగా చేస్తాయి. అంతేకాక, చర్మాన్ని మృదువుగా మరియు కోమలంగా మారుస్తాయి. ఇందులోనున్న యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇంఫ్లేమేటరీ, యాంటీ ఫంగల్ మరియు యాంటీ సెప్టిక్ ప్రాపర్టీలనేవి బాక్టీరియాను నశింపచేస్తాయి. చర్మంపైనున్న అదనపు నూనెను గ్రహించి చర్మాన్ని శుభ్రపరుస్తాయి.

విధానం:

ఒక పాత్రలో ఒక టీస్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ను అలాగే ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను తీసుకోండి.

ఈ మిశ్రమంలో కాటన్ బాల్స్ ని ముంచి చంకలలో అప్లై చేయండి.

పదిహేను నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని కదపకండి.

గోరువెచ్చటి నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించండి.

ప్రతిరోజూ ఈ పద్దతిని పాటించండి.

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు రైస్ ఫ్లోర్

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు రైస్ ఫ్లోర్

రైస్ ఫ్లోర్ అనేది సహజసిద్ధమైన క్లీన్సింగ్ ఏజెంట్ గా వ్యవహరిస్తోంది. తద్వారా చర్మం నిగారింపుని పెంచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

విధానం:

ఒక పాత్రలో రెండు టీస్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్ ను అలాగే ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ను కలపండి.

ఈ మిశ్రమాన్ని చంకలలో అప్లై చేసుకోండి.

ఈ పేస్ట్ ను కనీసం పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించండి.

ఈ పద్దతిని ప్రతి రోజూ పాటించాలి.

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు శనగపిండి

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు శనగపిండి

శనగపిండి చర్మంలోని దుమ్ముని తొలగించి కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది. శనగపిండిలో ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీలు అధికంగా కలవు. ఇవి డెడ్ స్కిన్ సెల్స్ ని సులభంగా తొలగించి చర్మాన్ని సంరక్షిస్తాయి. అలాగే, కొత్త స్కిన్ సెల్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇందులోనున్న యాంటీ ఏజింగ్ ప్రాపర్టీల వలన చర్మం అనేది బిగుతుగా మారుతుంది.

విధానం:

రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్ ను ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో కలపాలి.

ఈ రెండిటినీ బాగా కలిపి మెత్తటి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని శుభ్రమైన అండర్ అర్మ్స్ పై అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించాలి.

మెరుగైన ఫలితాల కోసం ఈ పద్దతిని ప్రతిరోజూ పాటించాలి.

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు కొబ్బరి నూనె:

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో అనేకమైన ఫ్యాటీ యాసిడ్స్ కలవు. ఇవన్నీ చర్మంలోని తేమని నిలిపి ఉంచి చర్మానికి తగిన పోషణని అందిస్తాయి. కొబ్బరి నూనెలో గల యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ అనేవి దెబ్బతిన్న చర్మ కణాల్ని బాగుచేసి ప్రకాశవంతమైన స్కిన్ టోన్ ని అందిస్తాయి. కొబ్బరినూనె చర్మంలోకి సులభంగా ఇంకిపోతుంది. తద్వారా చర్మాన్ని దెబ్బతీసే బాక్టీరియాని విచ్చిన్నం చేస్తుంది.

విధానం:

రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్ లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలపండి.

ఈ రెండు పదార్థాలను బాగా కలిపి చంకలపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోండి.

ఆ తరువాత పదిహేను నిమిషాల వరకు ఈ మిశ్రమాన్ని కదపకండి.

పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించండి.

ఈ పద్దతిని ప్రతి రోజూ పాటించండి.

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు పసుపు

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు పసుపు

పసుపు అనేది డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. తద్వారా చర్మం మరింత కాంతివంతంగా అలాగే ప్రకాశవంతంగా మారేందుకు ఉపయోగపడుతుంది.

విధానం:

ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ని అర టీస్పూన్ పసుపు పొడిలో కలపండి.

ఈ పదార్థాలని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చంకలపై అప్లై చేయండి.

పది నుంచి పదిహేను నిమిషాల వరకు అప్లై చేసిన మిశ్రమాన్ని అలాగే ఉంచండి.

ఆ తరువాత నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించండి.

ఈ పద్దతిని ప్రతిరోజూ పాటించండి.

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు బెంటోనైట్ క్లే:

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు బెంటోనైట్ క్లే:

బెంటోనైట్ క్లే అనేది డెడ్ స్కిన్ ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా చర్మం కోమలంగా మరియు మృదువుగా మారుతుంది.

విధానం:

ఒక పాత్రలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ని, బెంటోనైట్ క్లేని అలాగే కాస్తంత నీటిని కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోండి.

ఈ మిశ్రమాన్ని చంకలలో బాగా అప్లై చేయండి.

ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసిన మిశ్రమాన్ని దాదాపు ఇరవై నిమిషాల వరకు తొలగించకూడదు.

ఆ తరువాత వెచ్చటి నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించండి.

ఈ పద్దతిని ప్రతి రోజూ పాటించండి.

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు రోజ్ వాటర్

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు రోజ్ వాటర్

చర్మాన్ని కోమలపరచి, మృదువుగా చేసి చర్మానికి తగినంత రక్త ప్రసరణను అందించే చర్మసంరక్షణ గుణాలు రోజ్ వాటర్ లో అత్యధికం.

విధానం:

ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ని బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్స్ సహాయంతో చంకలలో అప్లై చేయండి.

ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై కనీసం పదినిమిషాల పాటు ఉంచండి.

ఆ తరువాత సాధారణ నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించండి.

ఈ పద్దతిని ప్రతి రోజూ పాటించండి.

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు నీళ్లు:

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు నీళ్లు:

ఈ పద్దతి అనేది సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారికి అత్యంత ఉపయోగకరం.

విధానం:

ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ లో కాసిన్ని నీళ్లను కలపండి.

కాటన్ బాల్స్ ని ఉపయోగించి ఈ మిశ్రమాన్ని చంకలలో అప్లై చేయండి.

పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసిన ఈ మిశ్రమాన్ని కదపకండి.

ఆ తరువాత సాధారణ నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించండి.

ఈ పద్దతిని ప్రతిరోజూ పాటించండి.

ఆపిల్ సిడర్ వినేగార్, ల్యావెండర్ ఆయిల్ మరియు రోజ్ వాటర్ స్ప్రే

ఆపిల్ సిడర్ వినేగార్, ల్యావెండర్ ఆయిల్ మరియు రోజ్ వాటర్ స్ప్రే

లావెండర్ ఆయిల్ లో చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలు అధికం. ఇవన్నీ చర్మాన్ని తెల్లగా చేసి స్కిన్ టెక్చర్ ని మెరుగుపరుస్తాయి. అలాగే, రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు కూడా ఈ పదార్థం ఉపయోగపడుతుంది.

విధానం:

ఒక పాత్రలో మూడు టేబుల్ స్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్ ను తీసుకుని అందులో కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను అలాగే అర కప్పుడు రోజ్ వాటర్ ను కలపండి.

ఈ పదార్థాలని బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోండి.

నిద్రపోవడానికి ముందు ఈ మిశ్రమాన్ని చంకలలో స్ప్రే చేసుకోండి.

ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రదేశంపై రాత్రంతా ఉంచండి.

ఈ పద్దతిని ప్రతి రోజూ పాటించండి.

జాగ్రత్తలు:

పైన చెప్పిన పద్దతులను పాటించే ముందు, మీ స్కిన్ పై ప్యాచ్ టెస్ట్ ను నిర్వహించండి. మీ చర్మం ఆపిల్ సిడర్ వినేగార్ కు అలెర్జిక్ అవునో కాదో తెలుసుకోండి.

హానికర కెమికల్స్ కలిగిన డియోడరెంట్ లను అలాగే యాంటీ పెర్సిపెరెంట్ లను వాడకండి.

షేవింగ్ బదులు అండర్ ఆర్మ్స్ కు వ్యాక్సింగ్ ను ప్రిఫర్ చేయండి.

కాస్తంత వదులుగా ఉండే వస్త్రాలను ధరించండి. తద్వారా, చర్మానికి తగినంత గాలి అందుతుంది. ఆ విధంగా స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది.

English summary

Apple cider vinegar – 10 home remedies to prevent dark armpit

Dark underarms are caused mainly due to excessive use of alcohol-based deodorants and whitening creams. There are other factors too that can lead to the darkening of armpits. But by constant application of apple cider vinegar, one can reduce the darkness in the armpit region.
Subscribe Newsletter