For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మస్టర్డ్ ఆయిల్ ద్వారా కలిగే ఈ బ్యూటీ బెనిఫిట్స్ గురించి మీరు తెలుసుకోవాలి

|

వివిధ బ్యూటీ రిలేటెడ్ ఇష్యూలకు మస్టర్డ్ ఆయిల్ అనేది ప్రభావవంతమైన నేచురల్ రెమెడీగా పనిచేస్తుంది. స్కిన్, బాడీ అలాగే హెయిర్ రిలేటెడ్ ఇష్యూలకు మస్టర్డ్ ఆయిల్ అనేది చక్కటి పరిష్కారం.

చర్మతత్త్వం ఏదైనా సరే మస్టర్డ్ ఆయిల్ అనేది చర్మసంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. మీది ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ లేదా నార్మల్ స్కిన్ అయినా మస్టర్డ్ ఆయిల్ మీకు అనేకవిధాల తోడ్పడుతుంది. దీనిని నేరుగా వాడవచ్చు లేదా మరిన్ని సౌందర్య ప్రయోజనాలను పొందేందుకు ఇతర పదార్థాలతో కలిపి వాడవచ్చు.

Beauty Benefits Of Mustard Oil You Didnt Know


క్రీమ్స్, ఆయింట్మెంట్స్, సోప్స్, లోషన్స్ మరియు బాడీ స్క్రబ్స్ తయారీలో మస్టర్డ్ ఆయిల్ ను విరివిగా వాడతారు. ఇది యాక్నే, స్కిన్ ఇన్ఫెక్షన్స్, రింకీల్స్ మరియు ఫైన్ లైన్స్ వంటి వివిధ స్కిన్ ప్రాబ్లెమ్స్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

ఈ ఆర్టికల్ లో మస్టర్డ్ ఆయిల్ ను వాడటం ద్వారా వివిధ స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. అలాగే, మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించి బ్యూటీ రిలేటెడ్ ప్రాబ్లెమ్స్ కి రెమెడీస్ ను ఏ విధంగా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

1. యాక్నేను నివారిస్తుంది:

1. యాక్నేను నివారిస్తుంది:

చర్మంపై పిహెచ్ బాలన్స్ ను మెయింటెయిన్ చేస్తూ అదనపు నూనెను నియంత్రించే సామర్థ్యం కలిగిన మస్టర్డ్ ఆయిల్ కు యాక్నే ను యాక్నే స్కార్స్ తో నివారించే గుణం కలదు.

రోజువారీ యూజ్ కోసం, ఒక టీస్పూన్ మస్టర్డ్ ఆయిల్ ను ఒక టీస్పూన్ నిమ్మరసంతో కలపాలి. ఈ సొల్యూషన్ ను ఒక కాటన్ ప్యాడ్ సహకారంతో ప్రభావిత ప్రాంతంపై రోజూ అప్లై చేయాలి. తద్వారా, యాక్నే మరియు స్కార్స్ నుంచి రక్షణ లభిస్తుంది.

2. డ్రై స్కిన్ ను అరికడుతుంది:

2. డ్రై స్కిన్ ను అరికడుతుంది:

చాలా మంది డ్రై స్కిన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. డ్రై స్కిన్ సమస్యను అరికట్టేందుకు వివిధ రెమెడీస్ ను మనం ప్రయత్నించవచ్చు. ఈ మస్టర్డ్ ఆయిల్ రెమెడీస్ అనేవి డ్రై స్కిన్ సమస్యను సమర్థవంతంగా నివారిస్తాయి. టోనర్ రూపంలో మస్టర్డ్ ఆయిల్ రెమెడీస్ ను పాటించడం ద్వారా మరింత ఉపయోగం పొందవచ్చు. ఈ రెమెడీస్ వలన చర్మం యవ్వనంగా అలాగే తాజాగా కనిపిస్తుంది. ఈ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ లభించడం వలన ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఒక స్ప్రే బాటిల్ లో రెండు టేబుల్ స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ మరియు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ను తీసుకోవాలి. వీటిని బాగా షేక్ చేస్తే పదార్థాలు రెండూ బాగా కలుస్తాయి. ఈ స్ప్రే ని ఫేస్ పై టోనర్ లా ఉపయోగించాలి. మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకునే ముందు ఈ స్ప్రే ని వాడాలి. దీనిని ప్రతి రోజూ వాడితే మంచి ఫలితం లభిస్తుంది. దీనిని రిఫ్రిజిరేటర్ లో భద్రపరచుకోవచ్చు.

3. పెదవులను మృదువుగా మారుస్తుంది:

3. పెదవులను మృదువుగా మారుస్తుంది:

పెదవులకు ఈవెన్ టోన్ ని అందించడానికి మస్టర్డ్ ఆయిల్ ఉపయోగపడుతుంది. తద్వారా పెదవులకు సహజసిద్ధమైన కాంతిని అందిస్తుంది. మస్టర్డ్ ఆయిల్ ను రోజువారీ లిప్ కేర్ లో భాగంగా చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.

నిద్రపోయే ముందు ప్రతిరోజూ మస్టర్డ్ ఆయిల్ ను పెదవులకు అప్లై చేసుకోవాలి. ఇన్స్టెంట్ గా మీకు పింకిష్ లిప్స్ కావాలంటే కింద వివరించిన రెమెడీను మీరు ప్రయత్నించవచ్చు.

బీట్ రూట్ స్లైసెస్ ను తీసుకోండి. వాటిని ఎండబెట్టండి. ఎండిన బీట్ రూట్ పీసెస్ ని పొడిగా చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ లో ఒక చిటికెడు బీట్రూట్ పౌడర్ ను కలపండి. ఈ చిక్కటి మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసి పదినిమిషాల పాటు ఉంచండి. ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో పెదాలను వాష్ చేసుకోండి. ఈ పద్దతిని రోజుకు ఒక్కసారి పాటించండి.

4. మేకప్ రిమూవర్:

4. మేకప్ రిమూవర్:

మేకప్ రిమూవర్స్ పై డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి బదులుగా మస్టర్డ్ ఆయిల్ తో సహజసిద్ధమైన మేకప్ రిమూవర్ ను ప్రయత్నించండి.

ఒక కాటన్ బాల్ ను మస్టర్డ్ ఆయిల్ లో ముంచి దీంతో ముఖంపై సున్నితంగా వైప్ చేస్తే మేకప్ అనేది తొలగిపోతుంది. ఈ స్టెప్ ని మేకప్ అంతా తొలగిపోయే వరకు పాటించాలి. ఈ పద్దతిని నిద్రపోయే ముందు ప్రతి రోజూ పాటిస్తే ఫలితం ఉంటుంది. ఇది మేకప్ ని తొలగించడంతో పాటు మీ స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసేందుకు తోడ్పడుతుంది.

5. క్రాక్డ్ హీల్స్ సమస్యను నయం చేస్తుంది

5. క్రాక్డ్ హీల్స్ సమస్యను నయం చేస్తుంది

మస్టర్డ్ ఆయిల్ మరియు రోజ్ వాటర్ కాంబినేషన్ క్రాక్డ్ హీల్స్ సమస్యను తొలగించేందుకు తోడ్పడుతుంది. మస్టర్డ్ ఆయిల్ మరియు రోజ్ వాటర్ ను సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ పాదాలపై అప్లై చేయాలి. నిద్రపోయే ముందు ఈ రెమెడీను పాటించాలి. మరుసటి రోజు, గోరువెచ్చటి నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి.

6. ట్యానింగ్ ను అరికడుతుంది:

6. ట్యానింగ్ ను అరికడుతుంది:

ట్యానింగ్ అనేది అతిపెద్ద స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లెమ్. ముఖ్యంగా, సమ్మర్ సీజన్ లో ఈ సమస్య మరింతగా వేధిస్తుంది. మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించి ట్యానింగ్ కు చక్కటి పరిష్కారాన్ని పొందవచ్చు.

ఒక టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ ని ఒక పాత్రలోకి తీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని మరియు ఒక టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ ను కలిపి చిక్కటి పేస్ట్ ను తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

7. ఫ్రిజ్ హెయిర్ కు వీడ్కోలు చెప్పండి:

7. ఫ్రిజ్ హెయిర్ కు వీడ్కోలు చెప్పండి:

డ్రై మరియు డేమేజ్డ్ హెయిర్ సమస్య మహిళల్ని వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చక్కటి హోమ్ రెమెడీ కలదు. మీ శిరోజాల పొడవుకు తగినంత మస్టర్డ్ ఆయిల్ ను తీసుకోండి. ఈ ఆయిల్ తో స్కాల్ప్ పై ఆలాగే హెయిర్ పై మసాజ్ చేయండి. ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లఁటి నీటితో రిన్స్ చేయండి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తే సిల్కీ స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది.

8. డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది:

8. డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది:

రోజంతా అలసిపోయి డార్క్ సర్కిల్స్ కనిపిస్తే మస్టర్డ్ ఆయిల్ అనేది మిమ్మల్ని రక్షిస్తుంది. ఒక కాటన్ ఫ్యాడ్ ను చల్లని మస్టర్డ్ ఆయిల్ లో ముంచి దానిని కంటి చుట్టూ ఉన్న డెలికేట్ స్కిన్ పై అప్లై చేయాలి. ఇది కంటి కింద పఫీనెస్ ను తగ్గించి డార్క్ సర్కిల్స్ సమస్యను తొలగిస్తుంది.

English summary

Beauty Benefits Of Mustard Oil You Didn't Know

Mustard oil is one of the effective natural remedies for several beauty-related issues. This can be a solution for the skin, body and hair-related issues too.Setup Timeout Error: Setup took longer than 30 seconds to complete.It works the best, whether you have an oily, dry or even normal skin. It can be effective on all skin types. Mustard oil can be either used on its own or mixed with other ingredients, for it to be more effective.
Desktop Bottom Promotion