For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మానికి, జుట్టుకి కాఫీతో అద్భుత లాభాలు

చర్మానికి, జుట్టుకి కాఫీతో అద్భుత లాభాలు

|

మీరెప్పుడైనా కాఫీ మీ అందాన్ని మెరుగుపర్చటంలో అద్భుతాలు ఎలా చేస్తుందని ఆలోచించారా? అవును, ఈ అద్భుతమైన పదార్థం మీరు అందమైన చర్మం పొందటంలో స్క్రబ్,మాస్క్,నూనె మొదలైన రూపాల్లో సాయం చేస్తుంది.

కెఫీన్ మీ చర్మం, జుట్టు రూపాన్ని మెరుగుపర్చి వాటిని మరింత ఆరోగ్యవంతంగా మారుస్తుంది. నల్లమచ్చలు, ముదురురంగు, చర్మంపై ట్యాన్, జుట్టు ఊడిపోవటం, పాదాలపై పగుళ్ళు వంటివాటిని తగ్గించటంలో సాయపడుతుంది.

Coffee Benefits For Skin And Hair

కాఫీ యాంటీ ఆక్సిడెంట్ గా చర్మాన్ని సాగనీయకుండా చేసి, ఫ్రీ రాడికల్స్ నుంచి దాన్ని రక్షిస్తుందని ముఖ్యంగా అందరికీ తెలుసు.జుట్టు ఊడిపోవటం తగ్గించి మీ జుట్టు కాంతివంతంగా,పొడవుగా పెరిగేలా చేస్తుంది. కాఫీ మీ చర్మాన్ని, జుట్టు కుదుళ్ళను ఎక్స్ ఫోలియేట్ చేసి మరింత ఆరోగ్యవంతంగా,శుభ్రంగా మారుస్తుంది.

చాలారకాల అందాల సమస్యలకి ఇది ఒకటే పరిష్కారంగా పనిచేస్తుంది. ఇక ఇంట్లోంచే మీ అందాన్ని మెరుగుపర్చుకోవచ్చంటే ఉత్సాహంగా ఉంది కదూ? చర్మానికి, జుట్టుకి కాఫీ లాభాలను ఇంట్లోనే సులభంగా ప్రయత్నించే విధానాలు ఇవిగో.

తల రుద్దుకోవటం కోసం

తల రుద్దుకోవటం కోసం

మొహాన్ని,శరీరాన్ని స్క్రబ్ చేసుకోవటం ముఖ్యమని మనందరికీ తెలుసు. కానీ మీ వెంట్రుకల కుదుళ్ళను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోటానికి తలను కూడా స్క్రబ్ చేసుకోవటం ముఖ్యమని మీకు తెలుసా? తలను రుద్దుకోవటం వలన అక్కడ పేరుకున్న చనిపోయిన చర్మకణాలు తొలగిపోతాయి.

మీరు చేయాల్సిందల్లా కొంచెం కాఫీ పొడిని రెగ్యులర్ గా వాడే ఏదో ఒక కండీషనర్ తో కలపండి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా కుదుళ్ళకి పట్టించి కొన్ని నిమిషాలు వదిలేయండి. 20 నిమిషాలు అలా వదిలేసాక మైల్డ్ షాంపూతో కడిగేయండి. వారంకోసారి ఇలా చేసి ఆరోగ్యవంతమైన కుదుళ్ళను పొందండి.

జుట్టు రంగు కోసం

జుట్టు రంగు కోసం

కాఫీ మీ జుట్టు రంగును పెంచటంలో చక్కగా పనిచేస్తుంది. ఇది మీ జుట్టును నల్లగా,కాంతివంతంగా మారుస్తుంది. ఇది సహజమైనది కాబట్టి ఏ సైడ్ ఎఫెక్టులు ఉండవు.

మొదటగా, కొంచెం కాఫీని తయారుచేసి, పక్కన చల్లబడనివ్వండి. ఇప్పుడు 1 చెంచా కాఫీ పౌడర్ ను 2 చెంచాల రెగ్యులర్ కండీషనర్ తో కలపండి.బాగా కలపండి. ఇందులో పెట్టిన కాఫీని పోసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మాస్క్ లాగా కుదుళ్ళ నుంచి చివర్ల వరకూ పట్టించండి. గంటసేపు అలా వదిలేసి షవర్ క్యాప్ తో కవర్ చేయండి.

1 గంట తర్వాత మామూలు నీరుతో జుట్టును కడిగేయవచ్చు. మీకు మరింత ముదురు రంగు కావాలంటే,ఒక చెంచా కోకో పౌడర్ జతచేస్తే తేడా మీకే కన్పిస్తుంది.

జుట్టు పెరగటానికి

జుట్టు పెరగటానికి

కాఫీ జుట్టు పెరిగేలా చేయటమేకాక, మృదువుగా,మెరిసేలా చేస్తుంది. ఈ సింపుల్ కాఫీ హెయిర్ మాస్క్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.

1చెంచా కాఫీ పౌడర్ ను 2 చెంచాల ఆలివ్ నూనెతో కలిపి పేస్టులా తయారుచేయండి. దీన్ని మీ జుట్టుకి పట్టించి గుండ్రంగా నెమ్మదిగా మసాజ్ చేయండి. 15-30 నిమిషాలు ఆగండి. అరగంట తర్వాత మామూలు నీళ్ళతో మైల్డ్, సల్ఫేట్ లేని షాంపూతో కడిగేయండి. దీన్ని వారంకోసారి చేసి మెరుగైన ఫలితాలు చూడండి.

కొంచెం కాఫీని తయారుచేసి దాన్ని చల్లబడనివ్వండి. మీ జుట్టును షాంపూ తర్వాత, కండీషనర్ తర్వాత దీనిని పట్టించి కడిగితే మీ జుట్టు మెరుస్తూ,మృదువుగా కన్పిస్తుంది.

చర్మం కోసం

చర్మం కోసం

చర్మం కాంతివంతంగా మారటానికి

కాఫీ చర్మంపై చనిపోయిన కణాలను తొలగించి ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. మీరు ఇంటివద్దనే ప్రయత్నించదగ్గ కొన్ని కాఫీ ఫేస్ మాస్కులు ఇవిగో.

కాఫీ,పెరుగు,తేనె ఫేస్ మాస్క్

కాఫీ,పెరుగు,తేనె ఫేస్ మాస్క్

మీకు కావాల్సిందల్లా 2 చెంచాల కాఫీ పౌడర్,2 చెంచాల తేనె, 2 చెంచాల పెరుగు. వీటిని కలిపేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. 30-45 నిమిషాలు అలా వదిలేయండి. 45 నిమిషాల తర్వాత మామూలు నీళ్ళతో కడిగేయండి.

కాఫీ, ఓట్ మీల్ స్క్రబ్ తో

కాఫీ, ఓట్ మీల్ స్క్రబ్ తో

ఓట్ మీల్ ను మిక్సీ పట్టి పౌడర్ లా చేయండి. కొంచెం కాఫీ పౌడర్, పెరుగు వేసి పేస్టులా తయారుచేయండి. బాగా కలపండి. దీన్ని మీ మొహంపై గుండ్రంగా తిప్పుతూ రాయండి. 15-20 నిమిషాలు అలానే వదిలేయండి. 20 నిమిషాల తర్వాత మామూలు నీళ్ళతో కడిగేయండి.

కాఫీ,తేనెతో

కాఫీ,తేనెతో

ఒక బౌల్ లో కొంచెం కాఫీ పొడి,1 చెంచా తేనెను కలపండి. బాగా కలపండి. ఈ పేస్టును మీ మొహంపై సమానంగా పట్టించి నెమ్మదిగా మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత మామూలు నీళ్ళతో కడిగేయండి. వారానికోసారి ఇలా చేసి మెరుగైన,వేగవంతమైన ఫలితాలు చూడండి.

కంటి కింద నల్లటి వలయాల కోసం

కంటి కింద నల్లటి వలయాల కోసం

కాఫీలోని కెఫీన్ కంటి కింద నల్ల వలయాలను తొలగించటంలో సాయపడుతుంది. అది చర్మాన్ని టైట్ చేయటంలో సాయపడి, కంటి చుట్టూ వాచటాన్ని తగ్గిస్తుంది.

1 చెంచా కాఫీ పౌడర్ ను తీసుకుని తాజా ఆలోవెరా జెల్ తో కలపండి. మీరు కేవలం తాజా ఆలొవెరా ఆకునే వాడాలి, ఎందుకంటే దానిలో ఏ రసాయనాలు ఉండవు. ఈ మిశ్రమాన్ని మీ నల్లవలయాలపై రాయండి. 15నిమిషాలు అలా వదిలేసి చల్లనీరుతో కడిగేయండి.

English summary

Coffee Benefits For Skin And Hair

Have you ever wondered how coffee can do wonders in enhancing beauty? It is one solution for many beauty-related issues. It helps in reducing dark spots, pigmentation, skin tan, hair fall, cracked heels, etc. When mixed with other ingredients like honey, yogurt, aloe vera, etc., it helps in solving many beauty-related issues.
Desktop Bottom Promotion