For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక వారంలోనే మీ గోర్లు సహజంగా పెరిగేందుకు ఉపయోగపడే హోంరెమెడీస్

మీరు సరైన ఆహారం తీసుకోకపోతే, గోర్ల పెరుగుదలకు ఎటువంటి హోంరెమెడీస్ కూడా దోహదపడలేవు. మీ గోర్లు కూడా మీ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయి. కాబట్టి, సరైన పోషకాలను ఆహారంలో భాగంగా చేసుకుంటూ నికోటిన్ ని తీసుకోవడం

|

మీ గోర్లు తరచూ చిట్లిపోతూ ఉంటాయా? అలాగే, పెరిగేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయా? మీ గోర్లు ఆకర్షణీయంగా లేకుండా మొద్దుబారినట్లుంటాయా? మీ గోర్లలో సహజసిద్ధమైన మెరుపు నశించిందా? ఈ ప్రశ్నలకి మీ సమాధానం అవునని వస్తే ఇప్పటి నుంచైనా మీ గోర్ల ఆరోగ్యంపై మీరు మరింత శ్రద్ధ కనబరచాలి.

మీ శిరోజాల లాగానే గోర్లలో కూడా కేరాటిన్ అనే పదార్థం కలిగి ఉంటుంది. గోర్ల ఎదుగుదల సవ్యంగా ఉండేందుకు శరీరంలోని కొలాజెన్ స్థాయిని మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలి.

నెలలో అంగుళానికి పదో వంతు మాత్రమే గోర్లు ఎదుగుతాయి. అయితే, గోర్ల పెరుగుదల అనేది వ్యక్తులను బట్టీ మారుతుంది. హార్మోన్ల అసమతుల్యతలు, పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలతో పాటు కొన్ని రకాల మెడికేషన్స్ వంటివి గోర్ల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.

మీరు సరైన ఆహారం తీసుకోకపోతే, గోర్ల పెరుగుదలకు ఎటువంటి హోంరెమెడీస్ కూడా దోహదపడలేవు. మీ గోర్లు కూడా మీ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయి. కాబట్టి, సరైన పోషకాలను ఆహారంలో భాగంగా చేసుకుంటూ నికోటిన్ ని తీసుకోవడం తగ్గించుకోవాలి. అలాగే, తగినంత మంచినీళ్లను తీసుకోవాలి. గోర్లు కొరికే ఆలవాటును మానుకోవాలి.

వీటితో పాటు కొన్ని హోంరెమెడీస్ ని పాటిస్తే ఆకర్షణీయమైన గోర్లు మీ సొంతమవుతాయి. ఒక వారంలోనే గోర్లు అతివేగంగా పెరుగుతాయి. మరి ఈ చిట్కాలను ప్రయత్నిస్తారు కదూ!

నిమ్మకాయ మరియు కొబ్బరినూనె

నిమ్మకాయ మరియు కొబ్బరినూనె

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ అనేది పాలిపోయిన గోర్లని తిరిగి ఆరోగ్యంగా చేసేందుకు దోహదపడతాయి. అలాగే, కొబ్బరినూనె లోని లారిక్ యాసిడ్ అనేది గోర్లకు తగినంత పోషణనిచ్చి దృఢపరుస్తాయి.

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను తీసుకుని అందులో అయిదు చుక్కల నిమ్మరసాన్ని కలిపి మైక్రోవేవ్ లో 20 సెకండ్ల పాటు వేడిచేయండి. ఇప్పుడు, మీ గోర్లను ఈ సొల్యూషన్ లో పదినిమిషాల పాటు ముంచి గోర్లకు తగిన మసాజ్ ను అందివ్వండి. రోజూ ఈ పద్ధతిని పాటిస్తే పాలిపోయిన గోర్లు తిరిగి కాంతిని పెంపొందించుకుంటూ దృఢంగా మారతాయి.

నారింజ రసం:

నారింజ రసం:

ఆరెంజ్ జ్యూస్ లో ఫోలిక్ యాసిడ్ తో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ రెండూ గోర్ల ఎదుగుదలకు సహకరిస్తాయి. మీ గోర్లను ఆరెంజ్ జ్యూస్ లో అయిదు నిమిషాల పాటు ముంచి ఆ తరువాత శుభ్రమైన నీటితో కడగండి . ఆ తరువాత శుభ్రమైన టవల్ తో గోర్లను తుడుచుకోండి. వెంటనే చక్కటి మాయిశ్చరైజర్ ను గోళ్లపై అప్లై చేయండి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో సల్ఫర్ అనేది అధికంగా లభిస్తుంది. ఇది చిట్లిన గోర్లను దృఢపరచి గోర్ల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఒక కప్పుడు నీళ్లను మరగబెట్టి అందులో క్రష్ చేయబడిన ఒక వెల్లుల్లి రెబ్బను జోడించండి. ఇప్పుడు, ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కూడా కలపండి. వీటిని పది నిమిషాల పాటు సిమ్ లో మరగనిచ్చి కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు, ఈ సొల్యూషన్ ను ఒక ఖాళీ సీసాలోకి మార్చుకుని ప్రతిరోజూ మీరు నిద్రపోయే ముందు ఈ సొల్యూషన్ ను మీ గోర్లపై పై అప్లై చేయండి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

రాత్రికి రాత్రే గోర్లలో ఎదుగుదలను ప్రోత్సహించే అద్భుతమైన చిట్కా ఇది. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా, గోర్ల ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది.

నిద్రపోయే ముందు, మీ గోర్లను ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేసుకోండి. రాత్రంతా ఆలివ్ ఆయిల్ ను గోర్లపై అలాగే ఉంచండి. ఈ పద్దతిని ప్రతి రోజూ పాటించండి.

కొబ్బరి నూనె మరియు తేనె :

కొబ్బరి నూనె మరియు తేనె :

కొబ్బరి నూనెలో గల లారిక్ యాసిడ్ అలాగే తేనెలో గల అమినో యాసిడ్ లనేవి కలగలిసి గోర్లను దృఢపరుస్తాయి. అలాగే, గోర్లను నిగనిగలాడేలా చేస్తాయి.

కాస్తంత కొబ్బరినూనెలో ఒక టీస్పూన్ తేనెను కలిపి ఈ మిశ్రమంతో మీ గోర్లను అయిదు నిమిషాలపాటు మసాజ్ చేయండి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని పదిహేను నిమిషాల వరకు గోర్లపై ఉండనివ్వండి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో గోర్లను శుభ్రపరుచుకోండి. ఈ పద్దతిని వారానికి రెండు సార్లు పాటించండి.

హార్స్ టైల్:

హార్స్ టైల్:

చిట్లిన గోర్లను దృఢపరిచి గోర్ల ఎదుగుదలను వేగవంతం చేసే శక్తి హార్స్ టైల్ అనే నేచురల్ హెర్బ్ లో కలదు. ఒక కప్పుడు నీళ్లను మరగబెట్టి, అందులో ఒక టేబుల్ స్పూన్ హార్స్ టైల్ హెర్బ్ ను కలపండి. ఈ సొల్యూషన్ ను మరొక పది నిమిషాల పాటు మరగనివ్వండి. ఆ తరువాత వడగట్టండి. చల్లారిన తరువాత మీ చేతి గోర్లను ఈ సొల్యూషన్ లో పదిహేను నిమిషాల వరకు ముంచి ఉంచండి. ఆ తరువాత శుభ్రమైన నీటితో మీ గోర్లను శుభ్రపరుచుకోండి. ఈ పద్దతిని వారానికి రెండు సార్లు పాటిస్తే గోర్లు నిగనిగలాడడంతో పాటు వేగంగా పెరుగుతాయి.

టమాటో మరియు ఆలివ్ ఆయిల్:

టమాటో మరియు ఆలివ్ ఆయిల్:

విటమిన్ ఏ తో పాటు బయోటిన్ లు టమాటో లో అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి, గోర్లను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. ఒక టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్ ని ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తో కలపండి. ఈ మిశ్రమంలో మీ గోర్లను పదినిమిషాల పాటు ముంచండి. ఈ పద్దతిని ఒక వారంలో అనేక సార్లు పాటించడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

ఫ్ల్యాక్స్ సీడ్ ఆయిల్

ఫ్ల్యాక్స్ సీడ్ ఆయిల్

లెసిథిన్ తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఫ్ల్యాక్స్ సీడ్ లో అధికంగా లభిస్తాయి. ఇవి గోర్లను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు తోడ్పడతాయి. ఫ్ల్యాక్స్ సీడ్ ఆయిల్ తో గోర్లను మసాజ్ చేయండి. ఆ తరువాత గ్లోవ్స్ ను ధరించి మాయిశ్చరైజర్ ను సంరక్షించుకోండి. ఈ చిట్కాను ఐదు నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు పాటిస్తే గోర్లు వేగవంతంగా పెరుగుతాయి.

ఆరెంజ్ జ్యూస్ మరియు వెల్లుల్లి:

ఆరెంజ్ జ్యూస్ మరియు వెల్లుల్లి:

మీ గోర్లు పొడిబారినట్లయి తరచూ చిట్లిపోతున్నాయా? అయితే, ఆరెంజ్ జ్యూస్ ను, వెల్లుల్లి నూనెను అలాగే ఆలివ్ ఆయిల్ ను కలిపిన మిశ్రమంతో మీ గోర్లకు సంరక్షణని అందించడం ద్వారా గోర్లను తిరిగి ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు. ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్ లో మూడు చుక్కల వెల్లుల్లి నూనెను అలాగే అయిదు చుక్కలు ఆలివ్ ఆయిల్ ను కలపాలి. ఈ మిశ్రమంతో గోర్లను మసాజ్ చేసుకోవాలి. కాసేపటి తరువాత గోర్లను శుభ్రమైన నీటితో కడగాలి. ఈ పద్దతిని ప్రతిరోజూ పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన గోర్ల ఎదుగుదలను గమనించవచ్చు.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గోర్ల ఆరోగ్యాన్ని సంరక్షించే యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పుడు గ్రీన్ టీను తయారుచేసుకుని చల్లార్చుకోవాలి. ఈ సొల్యూషన్ లో గోర్లను అయిదు నిమిషాల వరకు ముంచి ఉంచాలి. ఆ తరువాత నాణ్యత కలిగిన హ్యాండ్ క్రీమ్ ను అప్లై చేయాలి. ఈ పద్దతిని వారానికి రెండు సార్లు పాటించాలి.

ఉప్పు:

ఉప్పు:

డెడ్ సీ ఉప్పులో దాదాపు 20 వరకూ ఉపయోగకరమైన మినరల్స్ గలవు. ఇవి, గోర్లకు తగినంత పోషణని అందించేందుకు ఉపయోగపడతాయి.

ఒక టేబుల్ స్పూన్ డెడ్ సీ ఉప్పును ఒక కప్పుడు గోరువెచ్చటి నీటిలో కలిపి అందులో మూడు చుక్కల రోజ్ మేరీ ఆయిల్ ను జోడించండి. ఈ మిశ్రమంలో మీ గోర్లను పదినిమిషాల పాటు ముంచి ఉంచండి. ఆ తరువాత శుభ్రమైన నీటితో గోర్లను కడగండి. ఈ పద్దతిని వారానికి మూడు సార్లు పాటించండి.

విటమిన్ ఈ:

విటమిన్ ఈ:

గోర్లను వేగవంతంగా పెంచే మరొక అద్భుతమైన చిట్కా ఇది. విటమిన్ ఈ ని గోర్ల సంరక్షణకు వాడడం ద్వారా గోర్లు ఆరోగ్యవంతంగా మారి వేగవంతంగా పెరిగి నిగనిగలాడతాయి.

రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని తీసుకుని స్క్వీజ్ చేసి అందులోంచి జెల్ ను తీసుకోండి. ఇందులో రెండు చుక్కల ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను కలపండి. ఈ సొల్యూషన్ తో గోర్లను మసాజ్ చేయండి. రాత్రంతా ఈ సొల్యూషన్ ను గోర్లపై ఉండనివ్వండి. ఉదయానికల్లా, గోర్లలో గుర్తించదగిన దృఢత్వంతో పాటు కాంతి కనిపిస్తుంది.

English summary

Home Remedies To Grow Nails In A Week At Home | Home Remedies For Nails To Grow Faster | Home Remedies For Nail Growth | How To Grow Nails Faster Naturally At Home In 5 Minute

Is your nails chipped, blunt, with stunted growth rate? Does is it lack the natural sheen? Then here are some quick and effective home remedies to grow nails in a week at home! Your nails, just like your hair, is composed of keratins. And to accelerate nail growth, first thing you need to do is up your collagen count.!
Story first published:Sunday, January 14, 2018, 8:40 [IST]
Desktop Bottom Promotion