For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హోలీకి ముందు మరియు తర్వాత మీ చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలి

  |

  రంగుల పండగ అయిన హోలీ కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరుంటారు?ఎక్కడెక్కడో ఉండే చుట్టాలందరూ కలిసి రంగులతో ఆడుకోవడం చాలా సరదాగానే ఉంటుంది.

  అలా సరదాగా ఉన్నప్పటికీ, చర్మానికి మరియు జుట్టుకి రంగుల వలన వచ్చే పరిణామాల వలన మనలో చాలా మంది ఆడడానికి అయిష్టత చూపిస్తారు. హోలీలో వాడే కఠినమైన రంగులు,చర్మాన్ని మరియు జుట్టుని పొడి బార్చి, పొరలుబారేలా చెస్తాయి.

  skin care tips before an after holi

  మీ ఇంట్లో కుటుంబమంతా హోలీ ఆడుకుంటుంటే మీరొక్కరే చర్మం గురించి బాధపడుతూ ఆ ఆనందాన్ని పాడుచేయాలనుకోరు.కనుక అది జరగకుండా ఉండటానికి మా దగ్గర కొన్ని చిట్కాలు ఉన్నాయి.

  హోలీ రంగులు మీ ముఖానికి కొన్ని రోజులు అంటుకొని ఉంటాయి.కానీ మా చిట్కాలవలన చాల తక్కువ రంగు మిగులుతుంది.ప్రాకృతిక మరియు మూలికాపరమైన రంగులు ఎక్కువ సేపు చర్మం మీద ఉండటం మంచి ఆలోచనే కానీ వర్ణరసాయనాలు కలిసిన ఈ కృత్రిమ రంగులు కాదు.వాటిలో ఎక్కువ శాతం రసాయనాలు ఉండటం వలన, అవి మన ముఖంలో మెరుపుని తొలగించడమే కాకుండా, దద్దుర్లకి మరియు చర్మం పగిలిపోడానికి కూడా కారణం కావచ్చు.

  కనుక ప్రకృతి సంబంధిత మరియు సహజ సిద్దమైన రంగులు వాడటానికి ప్రయత్నించండి.హోలీకి మీ చర్మాన్ని సిద్ధం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి చదవండి.

  1. శరీరం అంత పూర్తిగా ఉండే బట్టలు వేసుకోండి

  1. శరీరం అంత పూర్తిగా ఉండే బట్టలు వేసుకోండి

  మీ శరీరాన్ని ఎంత కుదిరితే అంత కప్పుకోండి.ఇది రంగులు మీ శరీరాన్ని నేరుగా తాకకుండా కాపాడుతుంది.సినిమాల్లో చిన్న చిన్న బట్టలు వేసుకోని హోలీ ఆడటం మనం చూస్తాం.ఇది సరైంది కాదు, ఎందుకంటే శరీరంలో చాల భాగాలు కఠినమైన రంగులకి బహిర్గతం అవుతాయి.పల్చగా ఉండే, పొడుగు చేతుల బట్టలు, కుదిరితే కాటన్ ఫాబ్రిక్ వి వేసుకోండి.

  2. నూనె వాడండి

  2. నూనె వాడండి

  హోలీ ఆడడానికి వెళ్ళే ముందు, ఒంటికి నూనె రాసుకోని వెళ్ళండి.బయటకు కనిపించే భాగాలకే కాకుండా శరీరంలో అన్ని భాగాలకి రాసుకోని వెళ్ళండి.ఇది చర్మాన్ని జిడ్డుగా చేసి ఏ రంగు లోపలికి వెళ్ళకుండా కాపాడుతుంది.ఈ నూనె చర్మానికి, ఆ కఠినమైన రంగులకి ఒక అడ్డంకిలా పనిచేస్తుంది.ఈ చిట్కాని వాడి చూడండి,మీ ముఖం మరియు చర్మానికి ఉన్న రంగులు అతి

  తక్కువ సమయంలో వెంటనే పోతాయి.కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లంటి మందపాటి నూనెలు మీ చర్మంలో కరగవు కాబట్టి అవి సూచిస్తాం.

  3.పెట్రోలియం జెల్లీ

  3.పెట్రోలియం జెల్లీ

  పెట్రోలియం జెల్లీ కొంచెం మందంగా మీ పెదాల మీద రాసుకోండి, రంగులు మీ పెదాల కింద లోపలి పొరల్లోకి చొచ్చుకు పోకుండా కాపడుతుంది.నూనె చేరలేని మెడ వెనుక,చెవుల మధ్యలో,వేళ్ళ మధ్య వంటి ప్రదేశాలకి పెట్రోలియం జెల్లీ రాయాలని గుర్తుంచుకోండి.పెట్రోలియం జెల్లీ కి ఉండే మందపాటి స్వభావం వలన,హోలీ ఆడటానికి బయటకు వెళ్ళేప్పుడు లిప్ బాం కంటే ఇదే వాడటం మంచిది.

  4. మాయిశ్చరైజ్ చేయటం

  4. మాయిశ్చరైజ్ చేయటం

  హోలీ ఆడేప్పుడు, మీ శరీరానికి మాయిశ్చరైజ్డ్ గా ఉంచడం చాలా ముఖ్యం.ఈ చిన్న విషయాన్ని అందరూ మరిచిపోతారు,ఎందుకంటే, హోలీ ఆడుతూ ఎవరు మధ్యలో వెళ్ళి నీళ్ళు తాగుతారు అని!అందుకే అందరూ మర్చిపోతూ ఉంటారు,కాని రంగులు మీ చర్మాన్ని పొడి బారుస్తాయి కాబట్టి, శరీరాన్ని తేమపర్చటం తప్పనిసరి.మీరు ఇది మర్చిపోతే,మీ చర్మం మరింత పొడి బారిపోయి, రంగులు చర్మానికి ఎక్కువ హత్తుకుని ఉండిపోతాయి.

  5.ఎండ నుంచి రక్షణ

  5.ఎండ నుంచి రక్షణ

  మీ శరీరం అంత బట్టలతో కప్పి ఉంది కదా అని, సన్ స్క్రీన్ రాయడం మానద్దు.హోలీ సమయంలో చర్మం నల్లబడటం చాలా సులభం.ఎస్ పి ఎఫ్ ఉన్న ఉత్పత్తి వాడండి మరియు నూనె రాసే ముందు ఇది రాయాలని గుర్తుంచుకోండి, ఎందుకంటే నూనెలు సన్ స్క్రీన్ ని చర్మం పీల్చుకోకుండా నిరోధిస్తాయి.ఉత్తమమైన ఫలితాల కోసం ఎస్ పి ఎఫ్ 30 ఉన్న ఉత్పత్తి మాత్రమే వాడండి.

  6.నూనె మరియు సన్ స్క్రీన్ రాసే ముందు ముఖం బాగా కడుక్కోండి

  6.నూనె మరియు సన్ స్క్రీన్ రాసే ముందు ముఖం బాగా కడుక్కోండి

  సన్ స్క్రీన్ మరియు నూనే రాసే ముందు ఖచ్చితంగా మొహం శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి,ఎందుకంటే ముందర నుంచి దుమ్ము,మట్టి ఉన్న చర్మం,శుభ్రంగా ఉన్న చర్మం కంటే ఇంకా నష్టం కలిగిస్తుంది.

  7. శుభ్రపరిచే నూనె లేక బాం వాడండి

  7. శుభ్రపరిచే నూనె లేక బాం వాడండి

  రంగులని తీసేయడానికి సబ్బులు వాడటం అంత మంచిది కాదు,ఎందుకంటే సబ్బులు , రంగుల తో బాధ పడుతున్న చర్మాన్ని ఇంకా కఠినత్వానికి గురిచేస్తాయి.సబ్బులో ఉండే ఆల్కలీన్ మీ శరీరాన్ని ఇంకా పొడి బారుస్తుంది.మొదటిగా ముఖం మీద రంగులకి ఏదైనా శుభ్రపరిచే నూనె కానీ బాంతో కానీ కడగాలి.శుభ్రపరిచే నూనె మరియు బాంలు చర్మానికి ఏ హానీ జరగకుండా ,భారీ మేకప్ను తీయడానికి వాడతారు. చర్మంలోని నూనె జిడ్డుతనం పోకుండా,మీ ముఖం నుంచి రంగులని తీసేస్తుంది.

  8. చర్మం పొరలు ఊడిపోకుండా నివారించండి

  8. చర్మం పొరలు ఊడిపోకుండా నివారించండి

  ముఖం మీద ఎక్కువ సేపు రంగులు ఉండిపోవడం చిరాకుగానే ఉంటుంది,కానీ చర్మం పొరలు ఊడేలాగా రుద్దకండి.ఎందుకంటే ఈ సమయంలో చర్మం అసలే సున్నితంగా ఉంటుంది.చర్మం మీద నుంచి రంగులుపోయేదాకా ,శుభ్రపరిచే నూనెలు మరియు బాంలు వాడండి.

  9. తేమపర్చడం

  9. తేమపర్చడం

  చర్మాన్ని తేమపర్చండి. చర్మం అంటే, ముఖం మీద ఉండే చర్మమే కాదు, శరీరం అంతా ఉండే చర్మానికి తేమ చాలా అవసరం.హైయలురోనిక్ ఆమ్లం ఉండే ముఖ క్రీముని వాడండి,ఎందుకంటే దానిలోని యాసిడ్ పర్యావరణంలోని తేమని పీల్చుకొని, చర్మంలోకి పంపిస్తుంది.రంగులు చర్మాన్ని పొడిబార్చడం వలన, ఎంత తేమ వీలైతే అంత చర్మానికి అవసరం. మీ శరీరం మీద ఉన్న చర్మానికి ఎక్కువ తేమకోసం, షియా బటర్ మరియు కోకో వెన్న ఉన్న మాయిశ్చరైజర్ వాడండి, ఎందుకంటే అవి మీ చర్మాన్ని అత్యంత తేమగా ఉంచుతాయి.

  10. మీ చర్మానికి కొంత విరామం ఇవ్వండి

  10. మీ చర్మానికి కొంత విరామం ఇవ్వండి

  మేకప్ వేయడం కానీ లేక ఏదైన కఠినమైన పని కొన్ని రోజులు నివారించండి.మీ చర్మం

  నయం అయ్యి తేమని వెనక్కు తెచ్చుకోనివ్వండి.ఒక్కసారి రంగులు పోయాక, మీ చర్మంతో మీరు రోజు చేసుకోనే సాధారణ పనులు అన్ని చేసుకోవచ్చు.

  English summary

  How To Take Care Of Your Skin Before And After Holi

  Though there are a whole lot of people waiting to celebrate the festival of Holi there are a few who are reluctant to play the same. The reason is the damage that is caused to the skin due to the colours. Well, there are certain precautions to be followed for the skin before and after playing holi such as using oils, applying sun protection creams, moisturising, etc.
  Story first published: Saturday, February 24, 2018, 17:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more