మీ పాదాలపై ఆనెకాయలను తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఎవరికైనా ఎప్పుడైనా తమ పాదాలపై ఆనెకాయలు మొలిచి దానితో గోలంతా పడితే, ఈ చిరాకు తెప్పించే చర్మ స్థితి వలన వచ్చే కష్టాల గురించి తెలుస్తుంది.

అవి కేవలం అందంగా కన్పించకపోవటమే కాదు, అనారోగ్యకరంగా, నొప్పి, అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి. ఇవి సాధారణంగా కాలివేళ్ళ మధ్యన, మడమల వద్దా వస్తాయి. అవి అక్కడ చర్మాన్ని గట్టిగా, కఠినంగా మార్చేస్తాయి.

ఎక్కువ ఘర్షణ, మృత చర్మకణాలు పేరుకుపోవటం, కలుషితాల వంటి చాలా కారణాలు పాదాలపై ఆనెకాయలను కలిగించవచ్చు.

 Remedies That Can Banish Corns And Calluses On Your Feet

ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ సమస్యతో అసౌకర్యంగా బాధపడుతుంటే, మీరు ఆనెకాయలను అద్భుతంగా తగ్గించే కొన్ని సహజమైన చిట్కాలను ప్రయత్నించాలి.

ఇక్కడ మేము కఠినమైన చర్మాన్ని మెత్తబర్చి, ఇంకా ఆనెకాయలను నయం చేసే కొన్ని మంచి చిట్కాలను పొందుపరిచాం,

ఆ చిట్కాలేంటో తెలుసుకుని, ఎలా వాడాలో నేర్చుకోటానికి చదవండిః

1.విటమిన్ ఇ నూనె

1.విటమిన్ ఇ నూనె

విటమిన్ ఇ నూనె సహజంగా తేమనిచ్చే పదార్థం, ఇది పేరుకుపోయిన మృతచర్మ కణాలను తొలగించి ఆనెకాయలను తగ్గిస్తుంది.

ఎలా వాడాలి

- విటమిన్ ఇ నూనెను సమస్య ఉన్నచోటంతా రాయండి.

-మీ పాదాలను సాక్స్ తో కవర్ చేసి రాత్రంతా ఆ నూనెను అలానే ఉండనివ్వండి.

-వారానికి 4-5 సార్లు ఈ చిట్కాను పాటించి వేగవంతమైన ఫలితాలు పొందండి.

2.ఓట్ మీల్

2.ఓట్ మీల్

ఓట్ మీల్ మృతకణాలను, ఆనెకాయలను చక్కగా తొలగించటంలో సాయపడే సహజ పదార్థం.

ఎలా వాడాలి

- మీ పాదాలను గోరువెచ్చని నీరున్న టబ్ లో నానబెట్టండి.

-4-5 నిమిషాల తర్వాత కొంచెం ఉడకబెట్టిన ఓట్ మీల్ ను సమస్య ఉన్నచోట రాయండి.

-ఒక 10 నిమిషాల పాటు రుద్దండి, తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

3.బాదం నూనె

3.బాదం నూనె

మంచిశక్తి ఉన్న బాదం నూనె చర్మం పొరల్లోకి ఇంకి పేరుకున్న మృతకణాలు, కలుషితాలను తొలగిస్తుంది. ఇలా ఆనెకాయలు తొలగిపోతాయి.

ఎలా వాడాలి

-బాదం నూనెను సమస్య ఉన్నచోటంతా రాయండి.

-మీ పాదాలను కవర్ చేసి రాత్రంతా అలా వదిలేయండి.

-ఈ చిట్కాను ప్రతిరోజూ పాటించి చిరాగ్గా ఉండే ఆనెకాయలను తగ్గించుకోండి.

4.ఆలోవెరా జెల్

4.ఆలోవెరా జెల్

ఈ వైద్యలక్షణాలున్న జెల్ లో యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉండి, పాదాలపై వచ్చే ఆనెకాయలను తొలగించి చర్మాన్ని మెత్తగా మారుస్తుంది.

ఎలా వాడాలి

-తాజా ఆలోవెరా జెల్ ను సమస్య ఉన్నచోటంతా రాయండి.

- ఒక గంట పాటు అలానే ఉంచేసి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- ఈ జెల్ ను రోజుకి 2-3సార్లు వాడి ఆనెకాయలకు మంచి ఫలితాలను పొందండి.

5.ఉల్లిపాయ

5.ఉల్లిపాయ

ఉల్లిపాయలో ఉండే ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్లు చర్మంపై మురికిని తొలగించి, మీ పాదాలపై గట్టి, కఠినమైన చర్మాన్ని మెత్తగా మార్చి ఆనెకాయలను తగ్గిస్తుంది.

ఎలా వాడాలి

-గోరువెచ్చని నీటితో చిన్న టబ్ ను నింపి 4-5 చెంచాల ఉల్లిరసాన్ని వేయండి.

- మీ పాదాలను ఆ టబ్ లో 15-20 నిమిషాల పాటు నానబెట్టండి.

-అయ్యాక, పాదాల క్రీమ్ ను రాసి మంచి ఫలితాలను పొందండి.

-ఈ చిట్కాను వారంలో 2-3సార్లు పాటించండి.

6.ఆముదపు నూనె

6.ఆముదపు నూనె

గట్టిపడిన చర్మాన్ని మెత్తగా మార్చే మరో అద్భుతమైన పదార్థం ఆముదపు నూనె. ఇది చూడటానికి బాగోని ఆనెకాయలను తొలగించటంలో సాయపడుతుంది.

ఎలా వాడాలి

-ఆముదపు నూనెను సమస్య ఉన్న ప్రదేశంలో నెమ్మదిగా రాసి రాత్రంతా అలా వదిలేయండి.

-మరునాడు పొద్దున గోరువెచ్చని నీటితో కడిగేయండి.

-ఈ పద్ధతిని వారంలో 4-5 సార్లు ప్రయత్నించి వేగవంతమైన ఫలితాలను చూడండి.

7.వంట సోడా

7.వంట సోడా

మృతచర్మకణాలను, చర్మంపై కలుషితాలను తొలగించటానికి చాలామందికి ఇష్టమైనది వంటసోడా. వంటసోడా మీ పాదాలపై మొండిగా ఉండే ఆనెకాయలకి గుడ్ బై చెప్పటానికి మంచి ఇంటి చిట్కా.

ఎలా వాడాలి

-1 చెంచా వంటసోడాను 1 చెంచా నీటితో కలిపి మెత్తని పేస్టును తయారుచేయండి.

-ఈ పేస్టును సమస్య ఉన్నచోటంతా పూసి, 10-15 నిమిషాలు అలా వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

-మంచి ఫలితాల కోసం ఈ చిట్కాను వారంలో 2-3సార్లు వాడండి.

English summary

Remedies That Can Banish Corns And Calluses On Your Feet

There are various factors like excessive friction, accumulation of dead skin cells, impurities, etc., that can cause corns and calluses on your feet. By using certain home remedies such as vitamin E oil, oatmeal, etc., it can help reduce corns and calluses on feet.
Story first published: Tuesday, March 6, 2018, 9:00 [IST]