For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో పాదాలు పగిలితే ఇలా చేయాలి, ఈ చిట్కాలు పాటిస్తే ఒక్కరాత్రిలోనే సమస్య పోతుంది

కాళ్లను నీళ్లలో పెట్టి ఉంచడం వల్ల కూడా పగుళ్లను తగ్గించుకోవొచ్చు. రోజూ రాత్రి పూట కాళ్లను వెచ్చని నీటిలో ఉంచుతూ ఉండండి. ఇలా చేస్తే కూడా కాళ్ల పగుళ్లు తగ్గిపోతాయి. కాస్త వెచ్చని నీళ్లు తీసుకోండి అం

|

చలికాలంలో ప్రతి ఒక్కరికీ కాళ్లు పగులుతుంది. పాదాలు, మడమలు మొత్తం కూడా ఇబ్బందికరంగా మారుతాయి. చర్మం మొత్తం కూడా గరుకుగా మారుతుంది. ఆ చర్మాన్ని మొత్తం కూడా కొన్ని ట్రిక్స్ పాటించి సున్నితంగా మార్చుకోవొచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకోండి. వాటిని పాటించి కాళ్ల పగుళ్లను నయం చేసుకోండి.

నీరు

నీరు

నీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే పాదాలు పగలవు. ఒకవేళ పగిలినా కూడా నయం అయ్యేలా చేయగల గుణాలు నీటిలో ఉంటాయి. అందువల్ల మీరు నీటిని ఎక్కువగా తాగండి.

ఫుట్ మాస్క్

ఫుట్ మాస్క్

చలికాలంలో పాదాలకు మాస్క్ వేసుకుంటే చాలా మంచిది. నిమ్మ, ఉప్పు, గ్లిసరిన్, గులాబీ నీటితో కలిపి మాస్క్ తయారు చేసుకోండి. దాన్ని మీ పాదాలకు పూసుకోండి. ముఖ్యంగా ఉప్పు పాత చర్మాన్ని తొలగించి కొత్త చర్మం వచ్చేలా చేస్తుంది. నిమ్మ రసం పొడి చర్మంపై మంచి ప్రభావం చూపుతుంది. గ్లిసరిన్ , రోజ్ వాటర్ చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది.

ఆవాల నూనె

ఆవాల నూనె

కాళ్ల పగుళ్లను వెంటనే బాగు చేయగల గుణం ఆవాల నూనెకు ఉంటుంది. పగిలిన చోట ఆవాల నూనె పూసుకోండి. రాత్రి పూట మడమలపై ఆవాల నూనె పూసుకుని పడుకుంటే చాలు ఉదయంకల్లా పగుళ్లు చాలా వరకు తగ్గుతాయి.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజ్ చేయడం వల్ల కూడా మీ పగుళ్లను తగ్గించుకోవొచ్చు. కనీసం రోజుకు రెండు సార్లు మీరు మాయిశ్చరైజ్ చేసుకుంటే చాలా

మంచిది. రోజుకు దరఖాస్తు చేసుకోండి.

Most Read :</p><p>రోజూ రాత్రి వైన్ తాగితే చాలా ప్రయోజనాలు, యవ్వనంగా ఉండొచ్చు, ఆ వ్యాధులేమీ రావు, ఆ శక్తి పెరుగుతుందిMost Read :

రోజూ రాత్రి వైన్ తాగితే చాలా ప్రయోజనాలు, యవ్వనంగా ఉండొచ్చు, ఆ వ్యాధులేమీ రావు, ఆ శక్తి పెరుగుతుంది

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసం ద్వారా కూడా మీ పాదాల పగుళ్లను తగ్గించుకోవొచ్చు. సంగం బకెట్ నిండా నీళ్లు నింపండి. అందులో కాస్త నిమ్మకాయ రసం పిండండి. 10 నిముషాల పాటు అందులో కాళ్లు పెట్టుకుని ఉండండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మీ పాదాల పగుళ్లు తగ్గే అవకాశం ఉంది.

ఆలివ్ నూనె

ఆలివ్ నూనె

ఆలివ్ నూనె పాదాల పగుళ్లను బాగా తగ్గించగలదు. మీరు సగం కప్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి. అందులో సగం కప్ లావెండర్ నూనె కలపండి. ఇక దాన్ని కాళ్లు పగలిన చోట పూసుకోండి. చిటికెలో పగుళ్లు మొత్తం పోతాయి. చర్మం నున్నగా మారుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి ఫలితం పొందుతారు.

వాజిలిన్

వాజిలిన్

వాజిలిన్ కాళ్లు పగలకుండా చేయగలదు. రాత్రి వాజిలిన్ కు కాస్త నిమ్మరసం కూడా కలిపి కాళ్లకు రాసుకోండి. తర్వాత సాక్స్ వేసుకుని పడుకోండి. ఉదయం కల్లా మీ కాళ్ల పగుళ్లు మొత్తం పోతాయి.

నీళ్లలో పాదాలను ఉంచండి

నీళ్లలో పాదాలను ఉంచండి

కాళ్లను నీళ్లలో పెట్టి ఉంచడం వల్ల కూడా పగుళ్లను తగ్గించుకోవొచ్చు.

రోజూ రాత్రి పూట కాళ్లను వెచ్చని నీటిలో ఉంచుతూ ఉండండి. ఇలా చేస్తే కూడా కాళ్ల పగుళ్లు తగ్గిపోతాయి. కాస్త వెచ్చని నీళ్లు తీసుకోండి అందులో కాస్త ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలపండి. ఆ నీటిలో ఒక పది నిమిషాల పాటు కాళ్లను పెట్టండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే కాళ్ల పగుళ్లు మొత్తం పోతాయి.

ప్యూమిస్ రాక్

ప్యూమిస్ రాక్

ప్యూమిస్ రాక్ ద్వారా కూడా కాళ్ల పగళ్లను తగ్గించుకోవొచ్చు. ఇది ఒక రాయి. దీన్ని తీసుకుని మీరు పగుళ్లను చోట రుద్దుకుంటే చర్మం సున్నితంగా మారుతుంది. గరుకుగా ఉండే చర్మం స్మూత్ గా అవుతుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే కాళ్ల పగుళ్లు పోతాయి.

Most Read :చదువు పేరుతో ఆమెతో సరసాలు, మా ఇంట్లో బాగా కలిసిపోయింది, ఇంతలో వాళ్ల నాన్న ఎంట్రీ #mystory398Most Read :చదువు పేరుతో ఆమెతో సరసాలు, మా ఇంట్లో బాగా కలిసిపోయింది, ఇంతలో వాళ్ల నాన్న ఎంట్రీ #mystory398

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె ద్వారా కాళ్ల పగుళ్లను ఈజీగా తగ్గించుకోవొచ్చు. రాత్రి పూట మీరు కొబ్బరి నూనెను పగిలిన చోట్ల పూసుకోండి. ఉదయం లేచిన తర్వాత కడుక్కోండి. దాదాపుగా కాళ్లు మొత్తం కూడా సున్నితంగా మారుతాయి.

ఉప్పు, నిమ్మ

ఉప్పు, నిమ్మ

ఉప్పు నిమ్మ ద్వారా కూడా కాళ్ల పగుళ్లను తగ్గించుకోవొచ్చు. నిమ్మరసంలో కాస్త ఉప్పు కలుపుకుని పూసుకుని తర్వాత క్లీన్ చేసుకోండి. అలాగే ఉప్పు, గ్లిజరిన్ వేడి నీళ్లలో కలిపి అందులో కాళ్లను ఉంచుకుంటే కూడా మంచిది. అలాగే నీటిలో నిమ్మకాయ రసం, రోజ్ వాటర్ , ఉప్పు కలిపి అందులో కాళ్లు పెట్టుకోండి.

అరటిపండు మాస్క్

అరటిపండు మాస్క్

అరటిపండు గుజ్జు ద్వారా కూడా కాళ్ల పగుళ్లను తగ్గించుకోవొచ్చు. అరటిపండు గుజ్జులో కాస్త తేనే కలుపుకుని దాన్ని కాళ్లకు పూసకోండి. ఇలా తరుచూ చెయ్యడం వల్ల కూడా కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.

English summary

Desi Remedies for Cracked Heels During Winters

Desi remedies for cracked heels during winters
Desktop Bottom Promotion