For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంకల్లో దుర్వాసన నివారించే టాప్ 10 హోం రెమెడీస్

|

మీరు ఎప్పుడైనా చంకలలో దుర్వాసనతో కూడుకుని నిద్ర లేచారా ? నిస్సందేహంగా అది చెప్పుకోలేని సమస్యగానే ఉంటుంది. అవునా ? దురదృష్టవశాత్తు, ఇటువంటి దుర్వాసనలకు అనేక కారకాలు కారణాలుగా ఉంటాయి.

మీ చంకల్లో తరచుగా వచ్చే చెడు దుర్వాసనను అదుపులో ఉంచడానికి సహాయపడే డియోడరెంట్లు మరియు పర్ఫ్యూమ్స్ ఉన్నప్పటికీ, అవి కొన్నిసార్లు మీ చర్మానికి హానికరం కావొచ్చు. క్రమంగా చిరాకుకు లోనవడం, లేదా నల్లటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంటుంది. డియోడరెంట్స్ లో ఉండే కొన్ని హానికరమైన పదార్ధాలు ఇటువంటి సమస్యలకు కారణం కావచ్చు. అయితే, అటువంటి సందర్భాలలో మీరు ఏం చేయగలరు ? ఇటువంటి సందర్భాలలో చక్కని పరిష్కారంగా మీరు గృహ వైద్యాలను అనుసరించవచ్చు. అయితే, మనం గృహ వైద్య చిట్కాలను ఎంచుకునే ముందుగా చంకలు దుర్వాసనకు గురవడానికి గల కారణాల గురించిన అవగాహన కలిగి ఉండాలి.

Smelly Armpits

చంకల దుర్వాసనకు గల కారణాలేమిటి ?

చంకల దుర్వాసన అనేక కారణాల వలన ఏర్పడవచ్చు, వీటిలో కొన్ని దిగువ జాబితాలో ఇవ్వబడ్డాయి :

• బాక్టీరియా పెరగడం

• దుస్తుల ఎంపిక, వారియు వాడకం

• స్వేద గ్రంథులు అధికంగా ఉండడం

• ఆహారప్రణాళిక

• హైపర్ హైడ్రోసిస్ మరియు మధుమేహం వంటి అనారోగ్య పరిస్థితులు

• వయస్సు ప్రభావం

చంకలలో దుర్వాసన వదిలించుకోవడానికి సూచించగల గృహ వైద్య చిట్కాలు :

1. కలబంద గుజ్జు :

1. కలబంద గుజ్జు :

యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉన్న కలబంద గుజ్జును ఇక్కడ చెప్పినట్లు అనుసరించడం ద్వారా, చంకలలో దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు

• 1 టేబుల్ స్పూన్ తేనె

అనుసరించు విధానం :

• ఒక కలబంద ఆకు నుండి కొద్దిగా తాజా కలబంద గుజ్జును సేకరించండి.

• దానికి కొంత ముడి తేనెను చేర్చి రెండింటినీ మిశ్రమంగా కలపండి.

• దీనిని చంకలభాగంలో అప్లై చేయండి. 30 నిమిషాలపాటు అలానే విడిచిపెట్టి, చల్లటి నీటితో శుభ్రపరచండి.

• ఉత్తమ ఫలితాల కోసం ఈ ప్రక్రియను ప్రతిరోజూ 3 మార్లు చొప్పున, ఒక వారంపాటు పునరావృతం చేయండి.

2. ఆపిల్ సైడర్ వెనిగర్ :

2. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆమ్ల స్వభావంతో కూడుకుని ఉన్న ఆపిల్ సైడర్ వెనిగర్లో ఉండే క్రిమినాశక గుణాలు, చంకల దుర్వాసనను తగ్గించడానికి మరియు నియంత్రించడానికి సహాయపడతాయి.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్

• 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు

అనుసరించవలసిన విధానం :

• ఒక గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నీరు రెండింటిని తీసుకుని మిశ్రమంగా కలపండి.

• ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ డిప్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి.

• పూర్తిగా పొడిబారే వరకు కొన్ని నిమిషాలపాటు అలాగే వదిలేయండి.

• ఆశించిన ఫలితాల కొరకు రోజులో కనీసం ఒక్కసారైనా పునరావృతం చేయండి.

3. బేకింగ్ సోడా మరియు లెమన్ జ్యూస్ :

3. బేకింగ్ సోడా మరియు లెమన్ జ్యూస్ :

బేకింగ్ సోడా, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చంకల్లో ఉండే దుర్వాసనను తొలగించడానికి సాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా

• 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

అనుసరించవలసిన విధానం :

• ఒక గిన్నెలో నిమ్మరసం మరియు బేకింగ్ సోడా రెండింటిని మిశ్రమంగా కలపండి.

• ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ డిప్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి.

• దీనిని సుమారు 10 నుండి 12 నిమిషాలపాటు విడిచిపెట్టండి, తరువాత దానిని చల్లని నీటితో శుభ్రం చేయండి.

• ఆశించిన ఫలితాల కోసం దీనిని రోజులో 3 నుండి 4 సార్లు పునరావృతం చేయండి.

4. కొబ్బరి నూనె :

4. కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, మరియు యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చంకల నుండి దుర్వాసనను తొలగించడంలో ఉత్తమ ప్రభావాలను చూపుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

• 1 టేబుల్ స్పూన్ జొజోబా ఆయిల్

అనుసరించవలసిన విధానం :

• రెండు నూనెల్ని ఒక గిన్నెలో కలుపుకోవాలి. వాటిని ఒక మిశ్రమం అయ్యేవరకు కలుపుకోవాలి.

• ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ డిప్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి.

• కొన్ని నిమిషాలపాటు అలానే వదిలేయండి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరచండి.

• ఆశించిన ఫలితాలకోసం దీనిని రోజులో 3 నుండి 4 సార్లు పునరావృతం చేయండి.

5. విచ్ హేజల్ మరియు టీట్రీ ఆయిల్ :

5. విచ్ హేజల్ మరియు టీట్రీ ఆయిల్ :

సహజ తేమను తగ్గించే గుణాలు కలిగిన విచ్ హేజల్, శరీర దుర్వాసనను నివారించే అతి సాధారణమైన గృహ వైద్యాలలో ఒకటిగా ఉంది. మీ చర్మం యొక్క pH బ్యాలెన్స్ నిర్వహించడానికి మరియు దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి కూడా ఇది సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టీస్పూన్ విచ్ హేజల్

• 1 టేబుల్ స్పూన్ టీ ట్రీ ఆయిల్

అనుసరించవలసిన విధానం :

• ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ డిప్ చేసి, సంబంధిత ప్రదేశంలో అప్లై చేయాలి.

• పూర్తిగా ఆరిపోయే వరకు కొన్ని నిమిషాలపాటు వదిలేయండి.

• ఆశించిన ఫలితాల కోసం దీనిని రోజులో 3 నుండి 4 సార్లు పునరావృతం చేయండి.

6. బోరిక్ యాసిడ్ :

6. బోరిక్ యాసిడ్ :

సూక్ష్మ జీవ రసాయన బాక్టీరియా అయిన బోరిక్ ఆమ్లం, చంకలలో వాసన రాకుండా చేస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• రెండు టేబుల్ స్పూన్ల బోరిక్ యాసిడ్

అనుసరించాల్సిన విధానం :

• మీ చంకల భాగంలో కొంచెం బోరిక్ ఆమ్లం చుక్కలను వేసి అప్లై చేయండి.

• కొన్ని నిమిషాలపాటు అలానే ఉంచి, గాలికి ఆరనివ్వండి. తరువాత స్నానం చేయడం ఉత్తమం.

• ఆశించిన ఫలితాల కోసం ప్రతిరోజూ అనుసరించడం.

7. లెమన్ జ్యూస్ :

7. లెమన్ జ్యూస్ :

ఆమ్ల తత్వాలు అధికంగా ఉండే నిమ్మలో, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీ చర్మం యొక్క pH స్థాయిలను తగ్గిస్తుంది. మరియు దుర్గంధ కారక బ్యాక్టీరియా కూడా పోరాడుతుంది.

కావలసిన పదార్దాలు :

• 1 నిమ్మకాయ

అనుసరించవలసిన విధానం :

• ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోయవలసి ఉంటుంది.

• ఒక నిమ్మకాయ ముక్కను తీసుకుని మీ చంకల భాగంలో రుద్దవలసి ఉంటుంది.

• అదేవిధంగా రెండవ చంకలో మరో నిమ్మకాయ ముక్కను అదేవిధంగా పునరావృతం చేయండి.

• సుమారు 5 నుండి 10 నిమిషాలపాటు అలాగే ఉండనిచ్చిన తర్వాత, దానిని శుభ్రం చేయండి.

• ఆశించిన ఫలితాల కొరకు రోజులో కనీసం ఒక్కసారి పునరావృతం చేయండి.

• సున్నితమైన చర్మం ఉన్నవారు నిమ్మకాయ నుండి రసాన్ని పిండుకొని, దానిని తమ చంకల మీద అప్లై చేసేముందుగా కొద్దిగా నీటితో కలుపుకోవడం ఉత్తమం.

8. వెల్లుల్లి :

8. వెల్లుల్లి :

వెల్లుల్లి దాని క్రిమినాశక లక్షణాల కారణంగా చంకలలో దుర్వాసనను తగ్గించగలిగే ప్రముఖ గృహ వైద్యాలలో ఒకటిగా ఉంది.

కావలసిన పదార్థాలు :

• 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలు

అనుసరించే విధానం :

• కొన్ని వెల్లుల్లి రెబ్బలను నీటితో కలుపుకుని, మిశ్రమంగా తయారుచేయడానికి వాటిని గ్రైండ్ చేయాలి.

• ఈ మిశ్రమాన్ని మీ చంకలలో అప్లై చేయండి. 10 నిమిషాలపాటు అలాగే విడిచిపెట్టండి.

• దానిని శుభ్రంగా కడగండి మరియు మీ చంకలను టవల్తో పొడిగా తుడవండి.

• ఆశించిన ఫలితాలకోసం రోజులో ఒకసారి పునరావృతం చేయాలి.

8. బంగాళ దుంప మరియు ఆముదం నూనె :

8. బంగాళ దుంప మరియు ఆముదం నూనె :

బంగాళ దుంపలకు తేమను నియంత్రించే స్వభావం ఉంటుంది. అంతేకాకుండా, మీ చర్మం pH ను తగ్గించడం ద్వారా కింది వాటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల బంగాళాదుంప రసం

• 2 టేబుల్ స్పూన్ల ఆముదం నూనె

అనుసరించవలసిన విధానం :

• బంగాళా దుంప రసం మరియు ఆముదం నూనెను ఒక బౌల్లో తీసుకుని మిశ్రమంగా కలుపుకోవాలి. వాటిని మిశ్రమంగా కలుపుకోవాలి.

• ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ వేసి, ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి.

• కొన్ని నిమిషాలపాటు అలానే వదిలేయండి. ఒక కాటన్ బాల్ ఉపయోగించి దానిని తుడిచి తర్వాత స్నానం చేయండి.

• ఆశించిన ఫలితాల కోసం దీనిని రోజులో 3 నుండి 4 సార్లు పునరావృతం చేయండి.

9. ఎప్సం సాల్ట్ :

9. ఎప్సం సాల్ట్ :

ఎప్సం సాల్ట్ చెమటను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా మీ శరీర దుర్వాసనను నియంత్రించగలుగుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 కప్పు ఎప్సం సాల్ట్

• 1 టబ్ వాటర్

అనుసరించు విధానం :

• మీరు స్నానంచేసే సమయంలో నీటికి ఒక కప్పు ఎప్సం సాల్ట్ కలపండి.

• 15 నుంచి 20 నిమిషాలపాటు నీళ్లలో నానబెట్టాలి.

• ఆశించిన ఫలితాల కొరకు 2 రోజులకు ఒక్కసారి పునరావృతం చేయండి.

10. హైడ్రోజన్ పెరాక్సైడ్ :

10. హైడ్రోజన్ పెరాక్సైడ్ :

యాంటీ సెప్టిక్ లక్షణాలతో లోడ్ అయిన హైడ్రోజన్ పెరాక్సైడ్ దుర్వాసన కారక బ్యాక్టీరియాను చంపడానికి సహకరిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్

• 1 కప్పు నీళ్లు

తయారుచేయు విధానం :

• కొంత హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఒక గిన్నెలోకి తీసుకోండి.

• తరువాత, దీనికి కొంత నీటిని జోడించి మిశ్రమంగా కలపండి.

• ఒక కాటన్ బాల్ను ఆ మిశ్రమంలో ముంచి మీ చంకలమీద రుద్దండి.

• ఆశించిన ఫలితాలకోసం రోజులో అనేకసార్లు పునరావృతం చేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Home Remedies For Smelly Armpits

Smelly armpits are something that nobody likes to have. But, unfortunately, some people do have smelly armpits which can be caused due to a number of factors. Try using home remedies like baking soda, aloe vera gel, apple cider vinegar, potato juice, witch hazel, garlic, coconut oil, olive oil or tea tree oil to get rid of body odour permanently.
Desktop Bottom Promotion