జుట్టు రాలడానికి ఐదు ప్రధాన కారణాలు...!?

By Sindhu
Subscribe to Boldsky

జుట్టు రాలడానికి కారణాలు అనేకం. కొన్ని వందల్లోనే చెప్పొచ్చు. ఒక స్థాయిలో జుట్టు రాలటం అందరిలోనూ సహజంగా జరిగేదే. అయితే కొంతమందిలో మాత్రం అసాధారణ స్థాయిలో వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఏది సాధారణం, ఏది అసాధారణం అనేది తెలుసుకోవటం అవసరం. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పడీపడని కాస్మొటిక్స్..... అన్నింటి ఫలితం జుట్టు రాలిపోవడం. ఇప్పుడు అందరినీ విపరీతంగా వేధిస్తున్న సమస్య. దీని నివారణ కోసం అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఫలితాలే అందరికీ ఒకేవిధంగా అందవు. అసలు జుట్టు రాలిపోవడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకోవాలి....

5 Unusual Causes Of Hairfall...!

1. వేడి నీళ్ళతో స్నానం: స్నానానికి వేడినీటిని ఉపయోగించడం కంటే చల్లటి నీటితో స్నానం చేయడం చాలా ఉత్తమమని చాలా మంది సౌందర్య నిపుణల పరిశోదన ద్వారా తెలుపబడినది. అయితే కొంత మంది నిపుణులు మాత్రం దీనిని వ్యతిరేకించారు. వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు డ్యామేజ్ అవ్వతుంది. ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళను తలకు పోసుకోవడం వల్ల తల వెంట్రుకులకు సంబంధించిన ఫోలీ సెల్స్ తెరుచుకోవడంతో తలవెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది.

2. హెల్మెట్స్: హెల్మెట్స్ అనేవి బైక్ డ్రైవింగ్ లో ఎక్కుగా వినియోగించేటివి. బైక్ మీద ప్రయాణం చేసే వాళ్లు భద్రత కోసం ఎక్కువగా వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే శరీరానికి ఎంత భద్రత అయినా తలకు మాత్రం ఒక రకంగా హానే జరుగుతుంది. అదెలా అంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. హెల్మెట్స్ ను ఎక్కువ సేపు పెట్టుకొని ప్రయాణం చేయడం వల్ల తలలో చెమట ఎక్కువగా పట్టి, కురుల యొక్క మూలాలు బలహీన పడేలా చేస్తుంది. అందు వల్లనే అతి చిన్న వయస్సులో ఉన్నవారిలో కూడా జుట్టు రాలడం కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ప్రతి రోజూ ఎక్కువ దూరం ప్రయానించే వారిలో మాత్రమే ఇటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంది.

3. ఒత్తిడితో తలదువ్వడం(గట్టిగా తలదువ్వడం): జుట్టు రాలడంలో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. తల దువ్వవే సమయంలో తలమాడుకు ఎక్కువ ప్రెజర్ పెట్టి దువ్వకూడదు. దాని వల్ల వెంట్రుకు చిక్కు పడి రాలిపోయే ప్రమాదం ఉంది. తల దువ్వేటప్పుడు ముందుగా పెద్ద పళ్లు ఉన్న దువ్వెనలతో చిక్కుముడులు వదిలించి, ఆ తర్వాతే వేరే దువ్వెనతో మృధువుగా దువ్వుకోవాలి. లేదంటే చిక్కుముడులతో లాగడం వల్ల వెంట్రుకలు తెగిపోయే ప్రమాదం ఉంది.

4. తడిమీద తలదువ్వడం: మీరు తలస్నానం చేసినప్పుడు కురులను బాగా తడి ఆరనిచ్చి తలదువ్వాలి. తల స్నానం చేసినప్పుడు వెంట్రుకలు బలహీనపడుతాయి. టైమ్ లేదనో.. మరేదైనా కారణం చేతనో చాలా మంది చేసే పెద్ద తప్పు తల తడిగా ఉన్పప్పుడే తలదువ్వుతుంటారు. తడి మీద తలదువ్వడంతో వెంట్రుకలు సెట్ చేసినట్లు అవుతుందని నమ్ముతుంటారు. ఒకే షేప్ లో ఉంటుందనుకొంటారు. అయితే అలా చేయడం మంచి పద్దతి కాదు. దాని వల్ల ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి సమస్య అన్ని రకాల వయస్సుల వారికి వర్థిస్తుంది. అరుదుగా ఇలాంటి సమస్య ఏర్పడటాన్ని మనం గమనించవచ్చు.

5. గట్టిగా ముడి వేయడం వల్ల కూడా: ఇది కూడా ఒక జుట్టు రాలడంలో ఒక కారణమే. చాలా మంది హెయిర్ స్టైల్ కోసమని వివిధ రకాల కటింగ్స్ చేయించుకొని రకరకాల హెయిర్ బ్యాండ్లు, హెయిర్ క్లిప్స్ వాడుతుంటారు. అయితే అవి కురులను గట్టిగా పట్టి ఉంచడంతో కేశాలు నిర్జీవంగా మారి రాలిపోవడం జరుగుతుంది. జుట్టు చెరిగిపోకుండా హెయిర్ బ్యాండ్లు రక్షిస్తాయి కానీ మొదటికే ప్రమాదం అని ఎవరూ గమనించరు. కురులను గట్టిగా బ్యాండ్లు, క్లిప్పులతో బంధించడం వల్ల మద్యలో తెగిపోయే ప్రమాదం ఉంది. జుట్టు మరీ పలుచగా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి, హెయిర్ బ్యాండ్లు, హెయిర్ క్లిప్పులను ఎక్కువ వాడకపోవడమే మంచిది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    5 Unusual Causes Of Hairfall...!? | జుట్టు రాలడానికి ఐదు ప్రధాన కారణాలు...!?

    There are more than a hundred causes of hairfall. It can be a wide range of things like pollution, stress etc. If you want to stop your hair from thinning, then you have to know the cause of hairfall first. Some of the reasons for hair loss are very obvious and yet we miss them completely. These are some peculiar habits we have that are not hair healthy.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more