జుట్టు నిగ నిగ లాడాలంటే!

By B N Sharma

 Care for your hair in winter
ప్రస్తుతం శీతాకాలం, ప్రతి ఒక్కరు వారి చర్మం పై కేర్ తీసుకోవడంతోనే బిజీగా ఉంటారు. కానీ మీజుట్టు సంరక్షణ ఆలోచించారా? మేము మీ జుట్టు సంరక్షణ కొరకు ఈ సీజన్లో కొన్ని చేయాల్సినవి మరియు చేయకూడనివి చిట్కాలుగా ఇస్తున్నాం పరిశీలించండి.

బ్లోయర్ - మీ జుట్టును ఈ కాలంలో బ్లోయర్ తో పొడి చేయకండి. శీతాకాలంలో బ్లోయర్ తో మీ జుట్టు ఎండబెట్టడం దానిలోని తేమ దూరంఅయిపోతుంది. మీ జుట్టు సహజంగా పొడిగా వుంటే మంచిదే.

నీరు అధికంగా తాగండి - చర్మానికి నీరు ఎంత అవసరమో మీ తల వెంట్రుకలకు సైతం నీటి అవసరం వుంది. ప్రతిరోజూ మీ జుట్టు పొడిబారకుండా 8 నుండి 10 గ్లాసుల నీరు తాగండి.

తడి వెంట్రుకలతో బయటకు వెళ్ళకండి - ఇంటినుండి బయటకు వెళ్ళే ముందు మీ జుట్టు పూర్తిగా పొడారిందో లేదో చూసుకోండి. తడి జుట్టుతో బయటకు వెళితే, చలికాలంలో అధిక దుమ్ము, కాలుష్యం వెంట్రుకలకు అంటుకుంటుంది.

తలకు స్కార్ఫ్ లేదా కేప్ పెట్టండి - చల్లని గాలి మీ జుట్టులోని తేమను పొడిబార్చి డల్ గా కనపడేలా చేస్తుంది. కనుక తలకు ఒక స్కార్ఫ్ లేదా టోపీ పెట్టండి.

ఆయిల్ మసాజ్ - వారానికోసారి లేదా రెండు సార్లు ఆయిల్ మసాజ్ తీసుకోండి. దీనివలన మీ వెంట్రుకలకు ఎండ, దుమ్ము, ఇతర కాలుష్యాలనుండి రక్షణ లభిస్తుంది. జుట్టు నిగనిగలాడుతూ మెరుస్తుంది.

వేడి నీరు - జుట్టును వీలైనంతవరకు గోరు వెచ్చని నీటితో మాత్రమే కడగండి. వేడి అధికంగా వుంటే అది జుట్టు కుదుళ్ళను డ్యామేజి చేస్తుందని గుర్తుంచుకోండి.

Story first published: Tuesday, January 10, 2012, 12:30 [IST]
Desktop Bottom Promotion