For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిగనిగలాడే నల్లని..దట్టమైన కురుల కోసం...!

|

Homemade Hair Care Tips for Black Hair...!
జాలువారే అందమైన, దట్టమైన జుట్టు చూసేవారిని వెంటనే ఆకర్షిస్తుంది. వారి అందాన్ని పెంచి, వారిని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మార్చేస్తుంది. వెన్నల కాంతులు విరబూసే కురులు మరింత నిగనిగలాడాలంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మెరుసే కురుల కాంతుల కోసం అందంగా ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం.....

1. వారంలో రెండు సార్లు తలకు నూనె రాసి, తల మాడు మీద బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కురులు బాగా పెరగడానికి సహాయ పడుతుంది.

2. జుట్టు సాధారణంగా ఉన్నట్లై తే మైల్డ్ షాంపూ, లైట్ కండీషనర్ ఉపయోగించండి. అయినప్పటికీ కురులకు హాని జరుగుతుంటే గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయవచ్చు. హై ఆల్కహాల్ ప్రోడక్ట్స్, బ్లో డ్రయింగ్ లకు దూరంగా ఉండాలి.

3. తలకు షాంపూ చేసిన తర్వాత షాంపూను నీళ్లతో పూర్తిగా తొలగించాలి. కండీషనింగ్ సమయంలో వెంట్రుకల మూలాల్లో లైట్ కండీషనర్ ను ఉపయోగించాలి. అదేవిధంగా తీసుకొనే ఆహారంలో కొవ్వు పదార్థాలు, నెయ్యి, నూనె పదార్థాలను వీలైనంత వరకూ తగ్గించండి. బాగా నీళ్ళు తాగి ఒత్తిడికి దూరంగా ఉండాలి.

4. జుట్టు సన్నగా పల్చగా ఉంటే జెంటర్ హెయిరింగ్ నరిషింగ్ మాస్క్ ఉపయోగించండి. ఇది వెంట్రుకలను దట్టంగా ఉండేలా చేస్తుంది. తగినంత తేమను అందిస్తుంది.

5. వనమూలికలు(హెర్బల్స్)ను ఉపయోగించి తయారు చేసిన షాంపూ, గోరింటాకు ఆధారిత కండీషనర్ లను కూడా వాడవచ్చు. అప్పుడు కురులు దట్టగా కనిపిస్తాయి. నిగనిగలాడుతాయి.

6. రంగు వేసుకొనే జుట్టుకు ప్రత్యేక శ్రద్ద చాలా అవసరం. వారంలో లేదా 15రోజులకు ఒకసారి వేడి నీళ్లతో మసాజ్ చేసి నరిషింగ్ ప్యాక్ వేసుకుంటే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దాంతో వెంట్రుకలకు పోషణ లభిస్తుంది. వెంట్రుకలు కూడా జిడ్డుగా మారవు.

7. కురులకు కలర్ చేస్తే యు నీ ఫిల్టర్ ఉన్న కేర్ షాంపూను ఉపయోగించడం మంచిది. ఇది కురులకు కండిషనింగ్ ఇస్తుంది. ఇది ఎండ నుంచి రక్షించడం మాత్రమే కాదు, కేశాలకు కలర్ నిలిచి ఉండేలా చేస్తుంది.

8. కురులను శుభ్ర పరచడానికి సాధారణ నీళ్ళతో ఉపయోగించాలి. ఎక్కువ వేడి వున్న నీళ్ళతో కురులను శుభ్ర పరిస్తే జుట్టులో ఉన్న నేచురల్ ఆయిల్ వెళ్లిపోతుంది. దాంతో కురులు పొడిగా, పెళుసుగా మారతాయి. అందుకే సాధారణ నీళ్ళను ఉపయోగిస్తే బాగుంటుంది.

9. చల్లని నీళ్లు కూడా వెంట్రుకులపై దుష్ప్రభావం చూపిస్తాయి. కాబట్టి చలికాలంలో గోరువెచ్చిన నీళ్లు, వేసవిలో సాధారణ నీళ్లను ఉపయోగించాలి.

10. కురులను పొడవుగా చేయడానికి ముందు చిట్లిపోయిన వెంట్రుకులను ట్రిమ్మింగ్ చేయించాలి. ఇలా చేయకపోతే, చిట్లిన కురులు ఇతర కురులను కూడా బలహీనపరుస్తాయి. ఎనిమిది లేదా పది వారాలకు ఒకసారి జుట్టును ట్రిమ్మింగ్ చేయడం మంచిది. జుట్టుకు మెత్తగా లేదా గట్టిగా మార్చే స్టయిలిష్ జెల్ ని కేవలం ప్రత్యేక సందర్భాల్లోనే ఉపయోగిస్తే మంచిది.

11. వేళ్ల కణుపుతో స్కాల్ఫ్ మసాజ్ చేయొచ్చు. షాంపూను అప్లై చేస్తున్నప్పుడు కూడా ఇలా చేయవచ్చు. వారంలో 2-3సార్లు హెయిర్ బ్రష్ తో శుభ్రం చేయండి. దుమ్ము లేదా నూనె వెంట్రుకల్లో చేరకుండా చూడండి.

12. నేచురల్ హెయిర్ టానిక్ వాడితే వెంట్రుకలకు నేచురల్ మాయిశ్చరైజర్ లభిస్తుంది. వారంలో రెండు సార్లు ఆలివ్ ఆయిల్, బాదం, ఆముదం, నూనెను సమానంగా కలిపి సాయంత్రం ఈ నూనెతో చర్మంపై మసాజ్ చేసి మర్నాడ్ హెర్బల్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకుల మూలాలు దృడంగా మారుతాయి.

English summary

Homemade Hair Care Tips for Black Hair...! | కురులు దట్టంగా నిగనిగలాడుతూ...!


 Black hairs require an extra care as they are thick and dark in color so have more chances to lose the color by sun. They look bad when turn gray before time because of their thick texture. If regular care has to be taken dark black hair can remain as beautiful as ever.
Story first published:Monday, July 16, 2012, 16:34 [IST]
Desktop Bottom Promotion